అన్వేషించండి

Jagadhatri Serial Today October 28th: ‘జగధాత్రి’ సీరియల్‌: ధాత్రికి నిజం చెప్పిన డ్రైవర్‌ అబ్బులు -  కావ్య మెడకు చుట్టుకున్న చోరీ కేసు

Jagadhatri Today Episode: హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య ఉన్న డ్రైవర్‌ అబ్బులు ధాత్రికి నిజం చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Jagadhatri  Serial Today Episode:  డ్రైవర్‌ ధాత్రి, కేదార్‌ లను తోసేసి పారిపోతుంటాడు. కొద్ది దూరం పరిగెత్తగానే కారులో ఎవరో వచ్చి ఆ డ్రైవర్ గొంతు కోసి వెళ్లిపోతారు. వెనకే వచ్చిన  ధాత్రి, కేదార్‌.. అతన్ని  హాస్పిటల్ కు తీసుకెళ్తారు.  హాస్పిటల్‌ లో డాక్టర్‌ అతనికి ట్రీట్‌మెంట్‌ చేస్తుంటాడు. ధాత్రి, కేదార్‌ ఆలోచిస్తూ.. మీనన్‌ మనుషులు ఎవరైనా అటాక్‌ చేశారా? అని అనుమానిస్తుంటారు. ఇంతలో డాక్టర్‌ వచ్చి అతడిది యాక్సిడెంట్‌ కాదు.. మర్డర్‌ అటెంప్ట్‌.. ఎవరో కత్తితో పొడిచారని చెప్పి అతడు ఎంత రోజులు బతుకుతాడో డౌటేనని అంటాడు. అతన్ని చూడటానికి లోపలికి వెళ్తారు ధాత్రి, కేదార్‌.

ధాత్రి: సార్‌ ఎలా ఉంది మీకు..

డ్రైవర్‌: నా భార్య..

కేదార్‌: మీ భార్యకు ఏం కాదు.. మీకు ఏం కాదు. మీరు ఆరోగ్యంగా ఇంటికి వెళ్తారు. మేము అడిగిన వాటికి సమాధానం చెప్పండి.

ధాత్రి: చూడండి మీరు ఇన్వాల్వ్‌ అయింది. దేవుడి విషయంలో ఒక వేళ మనుషులు మిమ్మల్ని శిక్షించలేకపోయినా.. ఆ దేవుడి నుంచి మాత్రం మీరు తప్పించుకోలేరు. ఇప్పటికైనా ఈ కేసు వెనక ఎవరెవరు ఉన్నారో చెప్పండి. మీరు నిజం చెప్తే ఆ దేవుడి మిమ్మల్ని కాస్తైన క్షమిస్తాడు.  

డ్రైవర్‌: ప్రొఫెసర్‌ గారి చావుకు నేను కూడా ఒక కారణం.

ధాత్రి: ప్రొఫెసర్‌ ను చంపింది. మీరా..?

డ్రైవర్‌: చంపింది నేను కాదు మేడం. కానీ నేను అబద్దం చెప్పి తీసుకెళ్లడం వల్లే ఆయన చంపబడ్డాడు.

ధాత్రి: అసలు మీరేం అబద్దం చెప్పారు. ఆయన్ని ఎవరు చంపారు కాస్త వివరంగా చెప్పండి.

 అని ధాత్రి అడగ్గానే డ్రైవర్‌ నిజం చెప్తాడు. తమ ఊరి గుడిలో బయట పడిన బంగారు నిధి విషయం గురించి మొత్తం చెప్తాడు. నిధికి కాపలాగా ఉన్న కావ్య గురించి నిధి గురించి అందులో ఉన్న ఇత్తడి, రాగి రేకుల గురించి తెలుసుకున్న మీనన్‌ గురించి చెప్తాడు. నిధి ఎత్తుకుపోయిన మీనన్‌ ప్లాన్‌ గురించి అప్పుడు జరిగిన కావ్య మెడకు చుట్టుకున్న నిధి దొంగతనం గురించి చెప్తాడు. అప్పుడు తాను మీనన్‌ దగ్గర అసిస్టెంట్‌గా ఉన్నానని నేనే వెళ్లి ప్రొఫెసర్‌ ను అబద్దం చెప్పి మీనన్‌ దగ్గరకు తీసుకొచ్చానని చెప్తాడు.

డ్రైవర్‌: అక్కడ మీనన్‌ తో పాటు ఇంకా ఎవరో ఉన్నారని నాకు అనిపించింది. ఎవరున్నారో చూద్దామని ప్రయత్నించాను.

ధాత్రి: మీనన్‌తో ఇంకెవరున్నారో చూశారా?

డ్రైవర్‌: నన్ను గమనించిన ఆ మీనన్‌ నేను దగ్గరకు వెళ్లినప్పుడల్లా.. కోపంగా సైగలతో నన్ను బయటకు వెళ్లమని చెప్పాడు. దాంతో చేసేది ఏం లేక నేను బయటకు వెళ్లిపోయాను. కానీ ఆ మీనన్‌ వాలకం చూస్తే మాత్రం లోపల ఎవరో పెద్దమనిషే ఉన్నాడనిపించింది.

ధాత్రి: మీరు అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు.

డ్రైవర్‌: చెప్పగలను మీనన్‌తో పాటు ఎవరో ప్రముఖ వ్యక్తి అయితే కచ్చితంగా ఉన్నాడు.

 అని చెప్తాడు. తర్వాత లోపలికి వెళ్లిన ప్రొఫెసర్‌ బయటకు వచ్చి వెళ్లిపోతుంటే మీనన్‌ వచ్చి నన్ను ఆ ప్రొఫెసర్‌ ను ఫాలో అవ్వమని చెప్పతాడు. నేను ఆయన్ని ఫాలో అవ్వగానే ఆయన వెళ్లి ఒక జర్నలిస్టును కలిసి.. తాళపత్ర గ్రంథాలను రాగిరేకును ఆ జర్నలిస్టుకు ఇచ్చాడు. అదంతా నేను మీనన్‌కు ఫోన్‌ చేసి చెప్పాను. మీనన్‌ ప్రొఫెసర్‌ ను చంపేద్దామని బయలుదేరాడు. అని చెప్తాడు డ్రైవర్‌. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today October 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భర్త, అత్తమామల మీద గృహహింస కేసు పెట్టిన వల్లీ! పెళ్లి రోజు వేడుకలో షాక్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భర్త, అత్తమామల మీద గృహహింస కేసు పెట్టిన వల్లీ! పెళ్లి రోజు వేడుకలో షాక్!
Meghasandesam Serial Today October 13th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని ఆవహించిన గగన్‌ ఆత్మ – ఆకాష్‌ అసలు రూంప కనిపెట్టిన అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని ఆవహించిన గగన్‌ ఆత్మ – ఆకాష్‌ అసలు రూంప కనిపెట్టిన అపూర్వ
Gundeninda Gudigantalu Oct 13: విల్లా విజయ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించిన బాలు,మీనా..మనోజ్‌,రోహిణి మండిపాటు
గుండెనిండా గుడిగంటలు: విల్లా విజయ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించిన బాలు,మీనా..మనోజ్‌,రోహిణి మండిపాటు
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 13: విక్కీపై పద్మ హత్యాయత్నం...శీనయ్య బతికే ఉన్నాడని చెప్పి ఆమెకు చూపించిన విక్రమ్‌కృష్ణ
నువ్వులేక నేను లేను: విక్కీపై పద్మ హత్యాయత్నం...శీనయ్య బతికే ఉన్నాడని చెప్పి ఆమెకు చూపించిన విక్రమ్‌కృష్ణ

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Embed widget