అన్వేషించండి

Jagadhatri Serial Today May 29th: ‘జగధాత్రి’ సీరియల్‌: ఇంట్లోంచి వెళ్లిపోతానన్న సురేష్ – నిషిక చెంప పగులగొట్టిన కౌషికి

Jagadhatri Today Episode: చీర మార్చింది నిషికేనని సీసీటీవీ ఫుటేజీలో చూసిన కౌషికి కోపంగా నిషిక చెంప పగులగొట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode : ధాత్రి కేదార్‌ గురించి ఆలోచిస్తుంది. కేదార్‌పై తనకున్నది ప్రేమా? అభిమానమా? అనుకుంటుంది. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే కొత్తగా కనిపిస్తున్నాడేంటి? కేదార్‌నే అడుగుదామని అనుకుంటుంది. ఎంత ఫ్రెండ్‌ అయినా ఇలా డైరెక్టుగా అడిగితే బాగుంటుందా? అని మనసులో అనుకుని రూంలోకి వెళ్తుంది. అక్కడ ఒక ఓల్డ్‌ పెట్టే  కనిపిస్తుంది. ఇదేంటి ఇది కొత్తగా కనిపిస్తుంది. అని ఆ పెట్టే తీసుకొచ్చి ఓపెన్‌ చేసి చూస్తుంది. అందులో ధాత్రికి సంబంధించిన వస్తువులు కేదార్‌ దాచి పెట్టి ఉంటాడు. ఇవన్నీ కేదార్‌ దాచి ఉంచాడా? అని ధాత్రి మనసులో అనుకుంటుంటే ఇంతలో కౌషికి వస్తుంది.

కౌషికి: ఇవన్నీ నీ గుర్తుగా దాచిపెట్టుకున్నాడా? కేదార్‌కు నువ్వుంటే ప్రేమ అని తెలుసు కానీ ఇంత పిచ్చిగా ఆరాధిస్తున్నాడని ఇప్పుడే తెలుస్తుంది.

ధాత్రి: ప్రేమా?

కౌషికి: ప్రేమా అని అంత నీరసంగా చెప్తున్నావేంటి? నిన్ను ఆరాధిస్తున్నాడు. తన లైఫ్‌ అంతా నిన్నే నింపుకుని బతుకుతున్నాడు. నువ్వుంటే ఎంత ఇష్టం కాకపోతే నీకు సంబంధించింది తనకు అంత ఇష్టం ఎలా అవుతుంది.

ధాత్రి: కేదార్‌ కు నేనంటే ఇంత ఇష్టం అని నాకు తెలియదు వదిన..

కౌషికి: మాకే తెలిసిపోయింది. ఇన్ని రోజులు కళ్ల ముందే ఉన్నావు నీకు తెలియదా?

 అంటూ చెప్పి కౌషికి కిందకు వెళ్లిపోతుంది. తర్వాత ధాత్రి ఫీలవుతుంది. ఇంతలో కేదార్‌ వస్తుంటే కంగారుగా ఆ పెట్టేను దాచిపెడుతుంది ధాత్రి. కేదార్‌ వచ్చి టవల్‌ తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత ఆ పెట్టేను తీసిపెడుతుంది ధాత్రి. మరోవైపు సురేష్‌ ఆలోచించుకుంటూ ఉంటాడు. కౌషికి బాధగా చూస్తుంటుంది. ధాత్రి, కేదార్‌ వస్తారు.

ధాత్రి: ఏంటి వదిన ఇంకా అన్నయ్య అన్న మాటలు తలుచుకుని బాధపడుతున్నారా? అన్నయ్యా కోపంలో ఉన్నారు మీరలా ఎప్పటికి చేయరని ఆయనకు తెలియదా?

కౌషికి: తెలియదు ధాత్రి... అయినా మనిషి కోపంలో ఉన్నప్పుడే మనసులో ఉన్న భావం బయటపడుతుంది.

కేదార్‌: ప్లీజ్‌ అక్కా అర్థం చేసుకుని కలిసి ఉండాల్సిన టైంలో ఇలా అపార్థం చేసుకుని విడిపోకండి.

కౌషికి: ఈసారి ఆయనే విడిపోదామనుకుంటున్నారు కేదార్‌. ఆయన ఇంట్లోంచి వెళ్లిపోతామంటున్నారు. తప్పు చేయలేదు అన్నా వినడం లేదు.

అంటూ చెప్తూ కౌషికి బాధపడుతుంటే ధాత్రి, కేదార్‌.. కౌషికిని తీసుకుని సురేష్‌ దగ్గరకు వెళ్తారు. ధాత్రి, కేదార్‌ సురేష్‌ ను కన్వీన్స్‌ చేస్తారు. దీంతో సురేష్‌ సరేనని ఇక ఇంట్లోంచి వెళ్లనని కానీ చీరను ఎవరు మార్చారో నిరూపించమని చెప్పి వెళ్తాడు.  అది నిరూపించడం ఎలాగని కౌషికి అడుగుతుంది. వెంటనే సీసీటీవీ ఫుటేజ్‌ చూస్తే తెలుస్తుందని ధాత్రి చెప్పడంతో కౌషికి ఫోన్‌లో సీసీటీవీ ఫుటేజ్‌ చూస్తుంది. అందులో నిషిక శారీ మార్చడం చూసి  కోపంగా కౌషికి హాల్‌లోకి వెళ్లి నిషిక చెంప పగులగొడుతుంది.

కౌషికి: ఇన్ని రోజులు నువ్వు ఎన్ని తప్పులు చేసినా.. ఎన్ని మాటలు జారినా కొత్తగా వచ్చావు ఇంకా కుటుంబంలో కలిసిపోలేదు కదా అని ఊరుకున్నాను. కానీ ఇవాళ నువ్వు చేసిన ఈ పనితో నువ్వు ఈ ఇంట్లో ఉండే అర్హత కోల్పోయావు.  

సుధాకర్‌: కౌషికి ఏంటిది మన ఇంట్లో వాళ్లనే అనుమానిస్తున్నావా? అయినా ఆ చీరను కవర్లో పెట్టే అవసరం నిషికకు ఏంటి?

కౌషికి: అది ఆ కవరులో పెట్టిన నిషికకే తెలియాలి బాబాయ్‌. తక్షణమే నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్లిపో నిషిక.

అని కౌషికి కోపంగా వార్నింగ్‌ ఇవ్వడంతో వైజయంతి వచ్చి తన ముఖం చూసి ఈ ఒక్కసారి వదిలేయమని రిక్వెస్ట్‌ చేస్తుంది. దీంతో కౌషికి సరేనని చెప్తుంది. నిషికకు అర్థం అయ్యేలాగా నేను చెప్తానని వైజయంతి, నిషికను తీసుకుని లోపలికి వెళ్తుంది. తర్వాత సురేష్‌ గిల్టీగా ఫీలవుతూ వచ్చి కౌషికికి సారీ చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ టైమింగ్ మార్పు, రిషీ రీ-ఎంట్రీ కూడా ఫిక్స్? రోజూ ఎన్ని గంటలకు ప్రసారమంటే?

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
Godavari Serial Today October 13th: 'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget