అన్వేషించండి

Jagadhatri Serial Today March 16th: ‘జగధాత్రి’ సీరియల్‌: ధాత్రి ప్లాన్ సక్సెస్ – మెహిందీ ఫంక్షన్ లో నిజాలు ఒప్పుకున్న దివ్యాంక

Jagadhatri Today Episode: మెహిందీ ఫంక్షన్ లో సురేష్ ను తిడుతూ దివ్యాంక నిజాలు చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: నువ్వు కౌషికిని సురేష్‌ అన్నయ్యని కలపడమేంటి దివ్యాంక అని నిషిక అడుగుతుంది. దీంతో కౌషికి మీద పగ తీర్చుకోవాలంటే సురేష్‌ను పెళ్లి చేసుకోవాలి. కానీ సురేష్‌ పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకే ఇలా నాటకం అని పెళ్లి దాకా తీసుకొచ్చానని అసలు విషయం చెప్తుంది దివ్యాంక. ఒక వేళ అప్పుడు సురేష్‌ పెళ్లి వద్దని అంటే నీ పరిస్థితి ఏంటని అడుగుతుంది నిషిక. పెళ్లిపీటల దాకా వెళ్లాక నా జీవితం ఏం కావాలని నిలదీస్తాను. అంటూ దివ్యాంక చెప్పడంతో నీ ప్లాన్‌ బాగానే ఉంది కానీ మధ్యలో ఆ జగధాత్రి ఎంటర్‌ కాకుండా చూసుకో లేదంలే అది పెంటపెంట చేస్తుంది అని నిషిక చెప్తుంది. మరోవైపు బూచి మందు ఎత్తుకెళ్లిన కేదార్‌, ధాత్రి ఆ మందును కూల్‌ డ్రింక్‌లో కలిపి దివ్యాంకకు ఇవ్వాలని ప్లాన్‌ చేస్తారు.

కేదార్‌: ధాత్రి ఈ గ్లాస్‌ దివ్యాంకనే తాగుతుందన్న గ్యారంటీ ఏంటి? ఇంకెవరైనా తాగితే

ధాత్రి: కరెక్టే కదా.. దివ్యాంకనే తాగేలా నేను చూసుకుంటాను కదా?

అని మందు కలిపిన గ్లాస్‌కు చిన్న స్టిక్కర్‌ వేస్తుంది ధాత్రి. అందరూ మెహిందీ హడావిడిలో ఉండగా ధాత్రి కూల్‌డ్రింక్స్‌ ఇస్తూ వెళ్తుంది. చివరకు మందు కలిపిన గ్లాస్‌ సురేష్‌ తీసుకుంటాడు. దీంతో ధాత్రి కంగారు పడుతుంది.  

దివ్యాంక: తాగి ఎలా ఉందో చెప్పాలా ఏంటి? వెళ్లు ఇక్కణ్నుంచి.

ధాత్రి: అన్నయ్యా ఆగండి..

సురేష్‌: ఏమైంది సిస్టర్‌..

దివ్యాంక: అడుగుతుంటే నోరు మెదపవేంటి? వెళ్లు ఇక్కణ్నుంచి..

కౌషికి: ఆ మందున్న డ్రింక్‌ ఆ మనిషి తీసుకున్నాడు ఇప్పుడెలా ధాత్రి

కేదార్‌: బావగాని ఆ డ్రింక్‌ తాగితే ప్లాన్‌ మొత్తం రివర్స్‌ అయిపోతుంది ధాత్రి.

ధాత్రి: మీరు టెన్షన్‌ అవ్వకండి ఏదో ఒకటి చేద్దాం..

అని కేదార్‌ను తీసుకుని వైజయంతికి వినిపించేలా దగ్గరకు వెళ్లి కేదార్‌ వదినకు ఏదో ఒకటి చెప్పి ఇక్కణ్నుంచి తీసుకెళ్లు అనగానే ఎందుకు అని కేదార్‌ అడిగితే సురేష్‌ అన్నయ్యతో ఆ దివ్యాంక కూల్‌డ్రింక్‌ తాగించుకుందంటే. అది వదిన చూసి తట్టుకోలేదు. అనగానే వైజయంతి వెళ్లి దివ్యాంకకు చెప్తుంది. దీంతో దివ్యాంక సురేష్‌ను మీరు నాకు కూల్‌డ్రింక్‌ తాగించండి అని అడగడంతో సురేష్‌ మందు కలిపిన డ్రింక్‌ను దివ్యాంకకు తాగిస్తాడు. అది చూసి కేదార్‌, ధాత్రి, కౌషికి హ్యాపీగా ఫీలవుతుంటే వారిని చూసిన నిషిక ఇక్కడేదో కుట్ర జరుగుతున్నట్లుంది అనుకుంటుంది. ఇంతలో తనకు ఇలాంటి కూల్‌డ్రింకే ఇంకా కావాలని దివ్యాంక అడుగుతుంది. ధాత్రి వెళ్లి ఇంకాస్త డ్రింక్‌ తెచ్చి ఇస్తుంది. డ్రింక్‌ తాగిన దివ్యాంక కల్లుతాగిన కోతిలా ఎగురుతుంది.

వైజయంతి: ఏమైంది నిషి ఈ అమ్మి ఇలా ఎగురుతుంది.

నిషిక: ఆ జగధాత్రిని అవమానించింది కదా అది డ్రింక్‌లో ఏదో కలిపినట్లుంది.

సురేష్‌: దివ్యాంక మీరు కాసేపు సైలెంట్‌గా కూర్చోండి.

దివ్యాంక: ఏయ్‌ ఎవరు నువ్వు ఆఫ్ట్రాల్‌ నా ఆఫీసులో జీతానికి పనిచేసేవాడివి. నా కాళ్ల కింద పడి ఉండకుండా నాకే ఎదురు మాట్లాడతావా? నా పగకోసం పావులా వాడుకుంటున్నాను నిన్ను..

అనగానే నిషిక, దివ్యాంకను తీసుకెళ్లబోతుంటే వెళ్లకుండా ధాత్రిని, కౌషికిని తిడుతుంది. దీంతో ధాత్రి నిన్ను మరోసారి జైలుకు పంపిస్తానని చెప్పడంతో దివ్యాంక నిన్ను చంపేస్తానని ధాత్రి మెడ పట్టుకుంటుంది. దీంతో కౌషికి దివ్యాంకను కొడుతుంది. ఇంతలో నిషిక దివ్యాంకను తీసుకుని వెళ్ళిపోతుంది. దీంతో మెహింది ఫంక్షన్‌ చెడిపోతుంది.  మీ బంధం ఎంత పవిత్రమైంది కాబట్టే ఆ దివ్యాంక చేస్తున్న ప్రతి ఫంక్షన్‌ చెడిపోతున్నాయి. గతం మరిచిపోయి ఒక్కసారి అన్నయ్య ప్రేమను గుర్తు చేసుకోండని ధాత్రి, కౌషికికి  చెప్తుంది. కొన్ని బంధాలు ఎంత కలపాలని చూసిన కలవవు అని చెప్పి కౌషికి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసో అయిపోతుంది.

Also Read: కిరణ్‌ అబ్బవరంతో ప్రేమ, పెళ్లి - రహస్య గోరక్‌ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today October 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌ను అనుమానించిన వైజయంతి – కోల్‌కతా వెళ్లడానికి రెడీ అయిన మనోహరి 
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌ను అనుమానించిన వైజయంతి – కోల్‌కతా వెళ్లడానికి రెడీ అయిన మనోహరి 
Meghasandesam Serial Today October 18th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమి మెడలో తాళి కట్టబోయిన సూర్య – పోలీస్‌ గెటప్ లో వచ్చి పెళ్లి ఆపేసిన ఆకాష్‌
‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమి మెడలో తాళి కట్టబోయిన సూర్య – పోలీస్‌ గెటప్ లో వచ్చి పెళ్లి ఆపేసిన ఆకాష్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
Nindu Manasulu Serial Today October 17th: నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Embed widget