అన్వేషించండి

Jagadhatri Serial Today March 14th: ‘జగధాత్రి’ సీరియల్‌: ఆన్‌లైన్‌ మనీ ముఠాను పట్టుకున్న ధాత్రి, కేదార్‌ - ధాత్రి, కేదార్‌లను ఇంట్లోంచి వెళ్లిపోమన్న కౌషికి

Jagadhatri Today Episode: ధాత్రి, కేదార్ ఆన్ లైన్ మనీ ముఠాను పట్టుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: కేదార్‌ను బయటకు తీసుకెళ్లి తిడుతుంది ధాత్రి. దీంతో కేదార్‌ నవ్వుతుంటాడు. ఎందుకు నవ్వుతున్నావు నేను లేనప్పుడు తలకి ఏమైనా దెబ్బ తగిలిందా? అని అడుగుతుంది ధాత్రి. అలాంటిదేం లేదు కానీ నువ్వు నన్ను బుజ్టి బుజ్టిగా  తిడుతుంటే నవ్వొస్తుంది. అనగానే ధాత్రి కోపంగా చూస్తుంది. ఇంతలో కౌషికి వస్తుంది.

ధాత్రి: సారీ వదిన ఏదో ఆవేశంలో ఆలోచించకుండా నోరు జారేశాను. ఇంకోసారి ఇలా నోరు జారకుండా జాగ్రత్త పడతాను.

కౌషికి: వాళ్లు మాట్లాడిన దానికి నీ ప్లేస్‌లో ఎవరున్నా అలానే రియాక్ట్‌ అయ్యేవారు. కానీ వాళ్ల నోటి దురుసు వల్ల నీ కోపం వల్ల బలయ్యేది ఈ ఇల్లు. కోపంలో మాట్లాడే మాటల వల్ల కుటుంబం చెల్లాచెదురవుతుంది. మా బాబాయే కేదార్‌ తండ్రి అన్న ఆరోపణలు చేయడం తప్పా ఆధారాలు చూపించలేకపోయారు. ఇక రెండు రోజుల్లో మీకిచ్చిన గడువు అయిపోతుంది. ఆలోపు ఆధారాలు చూపించకపోతే మీరు ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది.

ధాత్రి: ఎలాగైనా సూరి బాబాయ్‌ని పట్టుకోవాలి కేదార్‌. కచ్చితంగా ఆ ఫోటోస్‌ కాకుండా వేరే సాక్ష్యాలు ఎక్కడో ఉండే ఉంటాయి.

అని మాట్లాడుకుంటుండగానే సాధు ఫోన్‌ చేసి ఆన్ లైన్ మనీ ముఠా ఉండే  లొకేషన్‌ ట్రేస్‌ చేశాను. టీంతో వెళ్లి ఆపరేషన్‌ చేయలేము. కాబట్టి నువ్వు కేదార్‌ వెళ్లి పట్టకురండి అని చెప్తాడు. దీంతో కేదార్‌, ధాత్రి అక్కడికి బయలుదేరుతారు. మరోవైపు కాల్‌ మనీ ఆఫీసు నుంచి  అప్పులు తీసుకున్న వారిని ఫోన్‌ చేసి బెదిరిస్తుంటారు. మరోవైపు కేదార్‌, ధాత్రి.. సాధు పంపించిన లోకేషన్‌కు వెళ్తారు. మరోవైపు లోపల ఒక అమ్మాయిని బెదిరిస్తూ ఉంటారు. డబ్బులు కట్టమంటే ఎందుకు తప్పించుకుతిరుగుతున్నావని అడుగుతుంటారు ఇంతలో ధాత్రి, కేదార్‌ వస్తారు. వారిపైకి రౌడీలు వెళ్తారు. దీంతో కేదార్‌, ధాత్రి గన్స్‌ తీసి ఎయిమ్‌ చేస్తారు.

ధాత్రి: గాడిద నేను బ్రో అని మనస్ఫూర్తిగా అంటే నువ్వు నన్ను మామయ్య కూతురు అంటావా? తప్పు కదా? వరుసలు కూడా తెలియకుండా ఉన్నావేంట్రా?

రౌడీ: తప్పై పోయింది అక్కా వదిలేయ్‌ అక్కా..

ధాత్రి: నీ ఫోన్‌ ఇటివ్వు..

అని ఫోన్‌ తీసుకుని అందులోని అమ్మాయిల వీడియోలు మొత్తం డిలేట్‌ చేస్తుంది ధాత్రి.

ధాత్రి: అరేయ్‌ చాలా జాగ్రత్తగా విను నేను ఒక్కటే సారి అడుగుతాను మర్యాదగా సమాధానం చెప్పు. నీ వెనకుండి ఇదంతా నడిపిస్తుంది ఎవరు?

రౌడీ: మీనన్‌.. అవును మేడం నాకు ఫండింగ్‌ ఇచ్చి నాతో ఇదంతా చేయించేది మీనన్‌.

అనగానే కేదార్‌, ధాత్రి షాక్‌ అవుతారు. ఇంతలో పోలీసులు వచ్చి వాళ్లను తీసుకెళ్తారు. మీడియా వాళ్లు వచ్చి ధాత్రిని ఇంటర్య్వూ చేస్తారు. మీడియా సాక్షిగా ధాత్రి మీనన్‌కు వార్నింగ్‌ ఇస్తుంది. అలాగే యూత్‌కు ధైర్యాన్ని ఇస్తుంది. ఇలాంటి సమస్యలు ఇంకా ఎవరికైనా ఉంటే కింది నెంబర్లకు ఫోన్‌ చేయండి మేము వచ్చి కాపాడతామని చెప్పి వెళ్లిపోతారు. మరోవైపు ఈ న్యూస్‌ను టీవీలో చూస్తూ యువరాజ్‌ షాక్‌ అవుతాడు. టీవీలో మాట్లాడుతున్న ధాత్రిని ఫోటో తీస్తాడు. వీళ్లిద్దరూ పోలీసులా.. పాఠాలు చెప్పుకునే పంతుళ్లా తెలియాలంటే వీళ్లు ఇంట్లో ఉన్నారో లేరో తెలుసుకోవాలి.. అనుకుంటుండగా బూచి రావడంతో యువరాజ్‌ బూచిని అడుగుతాడు ఇందాక స్కూల్‌ నుంచి ఫోన్ వచ్చిందని వెళ్లారని చెప్తాడు. దీంతో యువరాజ్‌ వాళ్లు ఇంటికి రాని అప్పుడు చెప్తా అని బయట ఎదురుచూస్తుంటాడు. ఇంతలో కేదార్‌, ధాత్రి రావడంతో టీవీలో హెడ్‌లైన్స్‌ చదివినట్లు స్కాం గురించి యువరాజ్‌ చదువుతుంటాడు. దీంతో కేదార్‌, ధాత్రి షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: తిరుపతిలో అభిమానుల ఫోన్లు లాగేసుకున్న హీరో విశ్వక్‌ సేన్‌ - షాకైన ఫ్యాన్స్‌

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
Illu Illalu Pillalu Serial Today August 8th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ చాటుగా వినేసిన వల్లీ! గుడిలో అలా జరగకుండా అడ్డుకుంటుందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ చాటుగా వినేసిన వల్లీ! గుడిలో అలా జరగకుండా అడ్డుకుంటుందా!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget