అన్వేషించండి

Jagadhatri Serial Today March 13th: ‘జగధాత్రి’ సీరియల్‌: కేదార్‌ను అవమానించిన నిషిక - నిజం చెప్పబోయిన ధాత్రి

Jagadhatri Today Episode: ధాత్రి, కేదార్ లను ఇంట్లోంచి గెంటివేయమని వైజయంతి, కౌషికికి చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: కేదార్‌, ధాత్రిలను కీర్తి ఫోటోలు తీస్తుంటుంది. ఇంతలో దివ్యాంక, సురేష్‌ వస్తారు. సురేష్‌ను చూసిన కీర్తి పరుగెత్తుకుంటూ పోతుంది. అయితే సురేష్‌ను దివ్యాంక ఆపుతుంది. కీర్తి బాధపడుతుంది. సురేష్‌ కూడా బాధపడతాడు. ఇంతలో కౌషికి వచ్చి కీర్తిని తీసుకెళ్తుంటే..

దివ్యాంక: చిన్నపిల్ల నీ కోపాన్ని నీ కక్ష్యని తనకెందుకు నూరిపోస్తావు. చిన్నపిల్లలను ప్రేమతో పెంచాలి ఇలా పగ నేర్పిస్తూ కాదు.

కౌషికి:  నా కూతురును ఎలా పెంచాలో నాకు బాగా తెలుసు. ఇంకోసారి కీర్తి విషయంలో కలగజేసుకుంటే... నీ మంచికే చెప్తున్నాను కలగజేసుకోకు దివ్యాంక.

దివ్యాంక: ఎలా పెంచాలో నాక్కూడా చెప్పు కౌషికి. ఎందుకంటే త్వరలోనే కీర్తి కూడా నా కూతురే అవుతుంది కదా?

కౌషికి: ఏమన్నావు ఇంకోసారి కీర్తికి నీకు సంబంధం ఉంది అన్నావంటే.. ఇంటికి అతిథివి అని కూడా చూడను.

దివ్యాంక: కౌషికి నీకీ మధ్య ఆవేశం ఎక్కువైపోయి ఆలోచన తగ్గిపోతుంది. సురేష్‌ కీర్తికి తండ్రి అయినప్పుడు నేను కూడా అమ్మనే కదా?

కౌషికి: బాధ్యత లేని తండ్రి, అతనికి తలాతోక లేని భార్య వీళ్లతో నా కూతురుకి ఏ సంబంధం ఉండదు ఉండనివ్వను.

అంటూ కౌషికి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. ఇంతలో నిషిక వచ్చి ఈ రోజు కూడా ఎందుకు గొడవ అనగానే దివ్యాంక నిషికను పొగుడుతుంది. నీ కాపురాన్ని పణంగా పెట్టి నా ఫంక్షన్‌ జరిపిస్తున్నావని తెలిసింది అనగానే నీకన్నా నా చెల్లి త్యాగం గొప్పదేం కాదు అంటూ ధాత్రి వస్తుంది. నిషిక లాంటి దాన్నే గుప్పిట్లో పెట్టుకున్నావంటే నువ్వు ఎంత గొప్పదానివి అంటూనే మా వదిన అనాథలకు చాలా సాయం చేస్తుంటుంది. ఇప్పుడు నీ ఫంక్షన్‌ కూడా అలాగే ఒప్పుకుంది సో ఆమె గొప్పదనం కూడా ఉంది. అనగానే దివ్యాంక కోపంగా ఈ ధాత్రి, కౌషికి మీద ఒక్క మాట కూడా పడనివ్వదు అని మనసులో అనుకుంటుంది.

నిషిక: నీకు పొగరు బాగా ఎక్కువైందే.. మన ఇంట్లో ఉన్నప్పుడు కుక్కిన పేనులా పడి ఉండే దానివి. ఇప్పుడేందే ఎగిరెగిరి పడుతున్నావు.

ధాత్రి: అప్పుడు నువ్వు నన్ను బాధపెట్టాలని మాట్లాడేదానివి నిషి కానీ ఇప్పుడు అవమానించాలనుకుంటున్నావు. అది కూడా ఇలాంటి వాళ్ల ముందు.

అనగానే నిషిక ధాత్రికి పనిచెప్తుంది. నువ్వు ఎంత చెప్పినా నేను ఏ పనిచెయ్యను అంటూ చెప్పి ధాత్రి వెల్లిపోతుంది. తర్వాత వైజయంతి జూస్‌ తీసుకుని కేదార్‌ దగ్గరకు వెళ్లి జ్యూస్‌ ఇచ్చి  బయట ఆటోలో సామాను ఉంది తీసుకురా అని చెప్తుంది. దీంతో కేదార్‌ సామాన్లు తీసుకురావడానికి బయటకు వెళ్తాడు. కేదార్‌ సామాన్లు తీసుకొస్తుంటే బూచి వెళ్లి ధాత్రికి చెప్తాడు. ధాత్రి కోపంగా బయటకు వస్తుంది.

ధాత్రి: కేదార్‌ ఏం చేస్తున్నావు..?

కేదార్‌: అది సామాన్లు..

ధాత్రి: ముందు కింద పెట్టు.... కింద పెట్టు

అంటూ సామాన్లు కింద పెడుతుంది. ఎందుకు సామాన్లు నువ్వు తీసుకొస్తున్నావు అని ధాత్రి అడగ్గానే వైజయంతి వచ్చి జ్యూస్‌ ఇచ్చి చెప్పిన మాటలు చెప్తాడు కేదార్‌. మనోడు అనుకున్నందుకే నాకు పనులు చెప్పారు. అనగానే మనోడు అనుకోలేదు పనోడు అనుకున్నారు అని చెప్తుంది ధాత్రి. అయినా వినకుండా కేదార్‌ సామాన్లు తీసుకెళ్తుంటే.. ధాత్రి కూడా సాయం చేస్తుంది. ఇంతలో కౌషికి వచ్చి మీరెందుకు ఈ పనులు చేస్తున్నారు అని అడగ్గానే దివ్యాంక, నిషిక, వైజయంతి వచ్చి ధాత్రి, కేదార్‌లను అవమానిస్తారు.

కేదార్‌: ధాత్రి వాళ్లు కావాలనే నీకు కోపం తెప్పించేలా మాట్లాడుతున్నారు నువ్వేమీ పట్టించుకోకు.

అనగానే నిషిక, ధాత్రిని తిడుతుంది దీంతో ధాత్రి కోపంగా నిషిక నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అంటుంది. వెంటనే వైజయంతి భయంగా ధాత్రి ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని ధాత్రిని బయటకు తీసుకెళ్లమని కేదార్‌కు చెప్తుంది. కేదార్‌, ధాత్రిని బయటకు తీసుకెళ్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: పాకిస్థాన్‌లో నాగార్జునను పోలిన వ్యక్తి - వీడియోలతో లక్షల్లో సంపాదన

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today November 17th: 'గోదావరి' సీరియల్: జాను సేవలో సంజయ్.. శివుడు పారు ఫిదా! దీపావళి సంబరాల్లో ఫ్యామిలీ.. ఒంటరైన నందు!
'గోదావరి' సీరియల్: జాను సేవలో సంజయ్.. శివుడు పారు ఫిదా! దీపావళి సంబరాల్లో ఫ్యామిలీ.. ఒంటరైన నందు!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 17:భరత్ నిజస్వరూపం తెలుసుకుని రాధ షాక్‌...అనసూయకు పెళ్లి ఇష్టంలేదని విక్కీకి చెప్పేసిన రాధ
నువ్వులేక నేను లేను: భరత్ నిజస్వరూపం తెలుసుకుని రాధ షాక్‌...అనసూయకు పెళ్లి ఇష్టంలేదని విక్కీకి చెప్పేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today November 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నెత్తిన బుట్ట పెట్టి కూరగాయలు అమ్ముతున్న వల్లీ! లంచం తీసుకున్న సాగర్‌ని ఫ్రెండ్ పట్టించేస్తాడా?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నెత్తిన బుట్ట పెట్టి కూరగాయలు అమ్ముతున్న వల్లీ! లంచం తీసుకున్న సాగర్‌ని ఫ్రెండ్ పట్టించేస్తాడా?
Podarillu Serial Today NoV 17:ఊరిలో ఉన్న బైక్‌లన్నీ పాడు చేసి కేశవ్‌ షాపుకు వచ్చేలా చేస్తుంది శైలూ...అది తెలుసుకుని బుస్సుపై కస్సుబుస్సులాడతాడు కేశవ్
పొదరిల్లు: ఊరిలో ఉన్న బైక్‌లన్నీ పాడు చేసి కేశవ్‌ షాపుకు వచ్చేలా చేస్తుంది శైలూ...అది తెలుసుకుని బుస్సుపై కస్సుబుస్సులాడతాడు కేశవ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Bigg Boss Season 10 Today November 16th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
Embed widget