![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Jagadhatri Serial Today March 12th: ‘జగధాత్రి’ సీరియల్: సూసైడ్ చేసుకోబోయిన సిరి – సిరిని కాపాడిన ధాత్రి, కేదార్
Jagadhatri Today Episode: కాల్ మనీ ట్రాప్ లో ఇరుక్కున్న సిరి సూసైడ్ చేసుకోబోతుంటే ధాత్రి, కేదార్ వెళ్లి కాపాడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
![Jagadhatri Serial Today March 12th: ‘జగధాత్రి’ సీరియల్: సూసైడ్ చేసుకోబోయిన సిరి – సిరిని కాపాడిన ధాత్రి, కేదార్ Jagadhatri serial today episode March 12th written update Jagadhatri Serial Today March 12th: ‘జగధాత్రి’ సీరియల్: సూసైడ్ చేసుకోబోయిన సిరి – సిరిని కాపాడిన ధాత్రి, కేదార్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/11/0a3b66585f61eb072576dbd42d4ae6dd1710172590474879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jagadhatri Serial Today Episode: నిషికను ఇంటికి తీసుకెళ్లడానికి కౌషికితో పాటు వచ్చిన ధాత్రిని పైకి తీసుకెళ్తుంది సుబ్బు. సిరి ఇంతకముందు లాగా లేదని ఒంటరిగా కూర్చుంటుందని.. తనలో తానే బాధపడుతుందని ఏం తినడం లేదని పిలిస్తే పలకడం లేదని చెప్తుంది. ఇదే విషయం మీ నాన్నకు చెబితే కాలేజీలో ఏదో గొడవ అయ్యుంటుందని రెండు రోజులు కాలేజీకి వెళ్లోద్దను అదే సర్దుకుంటుందని చెపారని సుబ్బు చెప్పడంతో ధాత్రి ఆలోచనలో పడిపోతుంది.
ధాత్రి: ఎప్పుడూ సరదాగా ఉండే సిరి అంత సైలెంట్ అయిపోయింది అంటే కచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. నువ్వేం కంగారుపడకు ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకు. సిరి ఎక్కడుందో మేం చూస్తాము.
అని ధాత్రి, కేదార్ వెళ్లిపోతారు. సుబ్బు బాధపడుతుంది. బయటకు వెళ్లి ధాత్రి, కేదార్.. సిరి కోసం మొత్తం వెతుకుతుంటారు. ఇంతలో సిరి ఫ్రెండ్ కావ్యను కలుస్తారు. సిరి గురించి అడుగుతే ఇవాళ కాలేజ్‌కు కూడా రాలేదని చెప్తుంది. వారం రోజుల నుంచి కూడా కాలేజీలో డల్‌గా ఉందని కావ్య చెప్తుంది. ఇందాక క్వారీ సైడ్ డల్‌గా నడుచుకుంటూ వెళ్లిందని ఫ్రెండ్స్ చెప్పారు అనగానే ధాత్రి కేదార్ క్వారీ సైడ్ వెళ్తారు. సూసైడ్ చేసుకోబోతున్న సిరిని కాపాడి కొడుతుంది ధాత్రి
కేదార్: ధాత్రి కొట్టొద్దు
ధాత్రి: చస్తుందట బతికే అర్హత లేదట. చిన్న పిల్లవని నీకందరూ ప్రేమను పంచినందుకు ఇంట్లో వాళ్లకు నువ్విచ్చే బహుమతి ఇదా?
కేదార్: చూడు సిరి నీకు చచ్చేంత బాధ ఏమోచ్చిందో కానీ నీకొచ్చిన సమస్యను మీ అక్కతో చెప్పి ఉంటే నీకోసం ప్రపంచంతో యుద్దమైనా సంతోషంగా చేసి ఉండేది.
అని ఏమైందని కేదార్, ధాత్రి అడగ్గానే నా ఫ్రెండ్ అర్జెంట్ అవసరం ఉందని నా ఫోన్ నుంచి యాప్‌లో లోన్ తీసుకున్నాం... నా ఫ్రెండ్ ఇప్పుడు ఈఎంఐ కట్టడం లేదని వాళ్లు నన్ను టార్చర్ పెడుతున్నారని.. డబ్బులు మొత్తం ఒకేసారి కట్టకపోతే తన న్యూడ్ ఫోటోస్ సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారని చెప్తుంది.
ధాత్రి: ఏడవకు ఈ అక్క వచ్చేసింది కదా నేను చూసుకుంటాను.
సిరి: సారీ అక్క ఇదంతా నేను కావాలని చేయలేదు. ప్రెండ్‌కు హెల్ప్ కావాలంటే చేశానంతే..
ధాత్రి: నాకు తెలుసు అయినా నీ సమస్యను ఈ అక్క దగ్గరకు వచ్చి చెప్పుకునేంత స్వేచ్చ కూడా లేదనుకున్నావా? అర్థం చేసుకునే మనసు లేదనుకున్నావా నాకు. వాడు ఎక్కడున్నా ఎంత డేంజరస్ అయినా నేను చూసకుంటాను.
అంటూ సిరిని ఓదార్చి నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్లు అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పడంతో సిరి ఇంటికి వెళ్తుంది. తర్వాత కేదార్, ధాత్రి ఆఫీసులో తమ బాస్‌కు సిరి విషయంలో జరిగిందంతా చెబుతారు. అప్పుడు ఆయన ఇలాంటి కేసులు ఇప్పుడే కొత్త కాదు. ఇలాంటి కేసులెన్నో ఇప్పటికే జరుగుతున్నాయి అని చెప్తాడు.
కేదార్: ఇంటర్నెట్లోనే అన్నీ చేస్తే వాళ్లని మనం పట్టుకోలేమా? సార్..
ధాత్రి: వాళ్లు చాలా తెలివిగా ఈ దందా నడుపుతున్నారు కేదార్. సిరికి వచ్చిన కాల్స్ అన్నీ ఇంటర్నెట్ ద్వారా చేయబడినవే ఆ నంబర్‌ను మనం ట్రేస్ చేస్తూ వెలితే మనకు నార్త్ లో ఒక చిన్న విలేజ్ చూపిస్తుంది.
అని ధాత్రి చెప్పగానే నువ్వు చెప్పింది నిజమే ధాత్రి అంటూ వాళ్ల బాస్ ఈ కేసు నువ్వే హ్యండిల్ చెయ్ అని ధాత్రికి చెప్పగానే ధాత్రి కేసు రెండు రోజుల్లో క్లోజ్ చేస్తానని చెప్పి బయటకు వెళ్లి రంగంలోకి దిగుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: అశ్విన్ బాబు కొత్త మూవీ టైటిల్ అదుర్స్ - మరో ‘హను మాన్’ అవుతుందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)