అన్వేషించండి

Jagadhatri Serial Today December 7th: ‘జగధాత్రి’ సీరియల్‌:  ధాత్రి మీద దొంగతనం మోపిన నిషిక – నిషికను కొట్టిన కౌషికి  

Jagadhatri Today Episode:  కౌషికి చెక్కో బుక్ లోంచి మిస్సయిన కోటి రూపాయల చెక్‌ జగధాత్రి తీసుకుందేమోనని నిషిక అనడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:   టీవీలో కావ్య గురించి బాడ్‌ న్యూస్‌ వస్తుంది. అది చూసిన నిషిక జగధాత్రిని తిడుతుంది. విషం కక్కే పాము పిల్లలు కూడా విషం కక్కుతాయే కానీ పాలు ఇస్తాయా..? అంటూ తిడుతుంది. రేపు రోడ్డు మీద వెళ్తుంటే అందరూ దేశద్రోహి కూతురు మీ ఇంట్లో ఉందట కదా అని అడిగితే ఏం చెప్తాం అంటుంది. దీంతో సుధాకర్‌ కోపంగా నిషికను తిడతాడు. జగధాత్రి మనకేం ద్రోహం చేసింది అంటూ నిషికను తిట్టగానే నిషిక కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఒంటరిగా కూర్చున్న ధాత్రి టీవీలో వచ్చిన న్యూస్‌ గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది.

ధాత్రి: మా అమ్మ చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఇంకా అవమానాలు పడుతూనే ఉంది. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పులు మర్చిపోయే వరకు అవమానాలు పడతారు. మా అమ్మ మాత్రం ఏ తప్పు చేయకపోయినా.. ప్రాణాలతో మనుషుల మధ్య లేకపోయినా ఇంకా అవమానాలు ఎదుర్కొంటూనే ఉంది. ఏ డిపార్టమెంట్‌ అయితే మా అమ్మను అవమానిస్తుందో అదే డిపార్ట్‌మెంట్‌ మొత్తం మా అమ్మకు సెల్యూట్‌ కొట్టేలా చేయాలి.

కేదార్‌: మనం అదే పనిలో ఉన్నాం కదా ధాత్రి. త్వరలోనే మీ అమ్మగారి సిన్సియారిటీని నిరూపిద్దాం. నిజం నిప్పు లాంటిది ధాత్రి. ఎవరు దాయాలనుకున్నా దాగదు. బయటకు వస్తుంది. ఆరోజు అవమానించిన నోళ్లన్నీ పొగడ్తలతో ముంచెత్తుతాయి.

ధాత్రి: ఆ రోజు తొందరలోనే వస్తుంది కేదార్‌.

కేదార్‌: చాన్స్‌ దొరికింది కదాని అనేశారు. వాళ్లు తప్పు చేయకపోరు మనకు దొరక్కపోరు.

అని కేదార్‌ చెప్పగానే ధాత్రి ఆలోచిస్తుంది. మరోవైపు కౌషికి ఫోన్‌కు తన అకౌంట్‌ నుంచి కోటి రూపాయలు డెబిట్‌ అయినట్టు మెసేజ్‌ వస్తుంది. అది చూసిన కౌషికి బ్యాంకు కు ఫోన్‌ చేసి అడుగుతుంది. మీ చెక్‌ నుంచే డ్రా అయిందని చెప్తారు. వెంటనే చెక్‌ బుక్‌ చూసి.. నిషిక చెప్పిన మాటలు గుర్తు చేసుకుని బయటకు వచ్చి నిషికను కోపంగా గట్టిగా పిలుస్తుంది.

సుధాకర్‌: ఏంటమ్మా కౌషి ఏమైంది…

వైజయంతి: ఏమై ఉండాదమ్మీ అట్టా అరుస్తా ఉండావు..

కౌషికి: నిషిక నా చెక్‌ బుక్‌ లోంచి చెక్‌ చింపుకుంది. నా సంతకం ఫోర్జరీ చేసి ఆ ఆక్షన్‌కు వెళ్లింది పిన్ని.

నిషిక: ఏం మాట్లాడుతున్నావు వదిన

కౌషికి: అవును నువ్వు నా చెక్‌ తీసుకుని ఆక్షన్‌కు వెళ్లావు.

యువరాజ్‌: నీ రూంలో ఉన్న చెక్‌ ఎలా తీసుకుంటుంది అక్కా.. నీ సంతకాన్ని ఫోర్జరీ ఎలా చేస్తుంది. అసలు నిషిక తన సంతకాన్నే ఒకసారి చేసినట్టు మరోసారి చేయదు.

వైజయంతి: నాకు తెలియకుండా నిషిక అడుగు కూడా బయట పెట్టదు. అటువంటిది వేలం పాట దగ్గరకు ఎలా వెళ్తుంది అమ్మీ. నువ్వే ఎవరికైనా ఇచ్చావేమో చూడు.

కౌషికి: పిన్ని నేను అన్ని క్రాస్‌ చెక్‌ చేసుకునే నిషికను అడుగుతున్నాను.

నిషిక: ఊరికో నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు వదిన. ఆ చెక్కును జగధాత్రి తీసి ఉండొచ్చు కదా..?

వైజయంతి: తీసినా తీసి ఉండొచ్చు ఎంతైనా దొంగ కూతురు కదా..? ఆ లక్షణాలు యాడికి పోతాయి.

యువరాజ్‌: అవును అక్కా ఉదయం నుంచి వాళ్లు కూడా ఇంట్లో లేరు కదా.. ఆ చెక్కును వాళ్లే తీసుకుని వెళ్లి ఉండొచ్చు కదా..?

కేదార్‌: అవునక్కా యువరాజ్‌ చెప్పింది కరేక్టే.. మేము కూడా ఉదయం నుంచి ఇంట్లో లేము.. ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లాము. ఆ పని కూడా మీ దగ్గర మిస్సయిన చెక్‌ గురించే

 అని కేదార్‌ తన ఫోన్‌ లో ఉన్న వీడియోలను ఫోటోలను కౌషికికి చూపిస్తాడు. అవి చూసిన కౌషికి కోపంగా నిషికను కొడుతుంది. సొంత ఇంట్లో దొంగతనం చేస్తారా..? అంటూ తిడుతుంది కౌషికి. దీంతో నిషికను కొట్టే హక్కు నీకు లేదని వైజయంతి అంటుంది. దీంతో వైజయంతిని సుధాకర్‌ తిడతాడు. తర్వాత జగధాత్రి నిషిక, వైజయంతిలను మిమ్మల్ని ఏమనాలి.. దొంగలనాలా..? మోసగాళ్లు అనాలా అంటూ తిడుతుంది. తర్వాత కావ్య కేసు గురించి కేదార్‌, జగధాత్రి ఆలోచిస్తారు.   ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today October 11th: ‘మేఘసందేశం’ సీరియల్‌: సంగీత్‌కు రెడీ అయిన భూమి, సూర్య – స్వామిజీని కొట్టిన అపూర్వ  
‘మేఘసందేశం’ సీరియల్‌: సంగీత్‌కు రెడీ అయిన భూమి, సూర్య – స్వామిజీని కొట్టిన అపూర్వ  
Nindu Noorella Saavasam Serial Today October 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కోమాలోకి వెళ్లిన సీతారాం – అయోమయంలో వైజయంతి   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కోమాలోకి వెళ్లిన సీతారాం – అయోమయంలో వైజయంతి   
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!
Nindu Manasulu Serial Today October 10th: నిండు మనసులు: ప్రేరణకి విడాకుల నోట్! సిద్ధూ నిజంగానే విడిపోవాలని అనుకుంటున్నాడా! విజయ్‌ కుట్రేనా!
నిండు మనసులు: ప్రేరణకి విడాకుల నోట్! సిద్ధూ నిజంగానే విడిపోవాలని అనుకుంటున్నాడా! విజయ్‌ కుట్రేనా!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget