అన్వేషించండి

Jagadhatri Serial Today August 31st: ‘జగధాత్రి’ సీరియల్‌: డ్రగ్స్ మాఫియాలోకి యువరాజ్ – టోనీని అనుమానించిన ధాత్రి

Jagadhatri Today Episode: యువరాజ్ ఫ్రెండుగా వచ్చిన మీనన్ తమ్ముడు టోనీని ధాత్రి అనుమానించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: ఇంటికి వచ్చిన కౌషికిని చూసి సుధాకర్‌ ఎమోషనల్‌ గా ఫీలవుతాడు. నిషిక, వైజయంతి వెటకారంగా కౌషికితో మాట్లాడతారు. తర్వాత జేడీ గురించి మాట్లాడుకుంటారు. జేడీని అందరూ మెచ్చుకుంటారు. ధాత్రి మాత్రం ఆ జేడీ తన డ్యూటీ తాను చేసిందని చెప్తుంది. దీంతో నిషిక, వైజయంతి ధాత్రిని తిడతారు. మరోవైపు మీనన్‌, యువరాజ్‌ తో మరో కొత్త బిజినెస్‌ చేయాలని చెప్తాడు. ఏ బిజినెస్‌ అని అడగ్గానే మాదకద్రవ్యాల బిజినెస్‌ అని చెప్తాడు. మా తమ్ముడు టోని నీ కోసం వస్తున్నాడని మీరిద్దరు కలిసి ఆ బిజినెస్‌ చేయాలని చెప్తాడు. యువరాజ్‌ సరే అని ఫోన్‌ కట్‌ చేస్తాడు. టోని మీనన్‌ కంటే డేంజర్‌. ఇప్పుడు వాడొస్తే ఎన్ని ప్రాబ్లమ్స్‌  ఫేస్‌ చేయాలో ఏంటో అనుకుంటాడు. ఇంతలో టోని వస్తాడు. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. అందరి ముందు టోనిని తన ఫ్రెడుగా పరిచయం చేస్తాడు యువరాజ్‌.

వైజయంతి: ఈ అబ్బాయి..

యువరాజ్‌: నా ఫ్రెండు అమ్మా.. నిన్ననే దుబాయ్‌ నుంచి వచ్చాడు.

టోని: అవునండి. ఒకసారి మిమ్మల్ని అందర్ని కలిసి వెళ్దామని వచ్చాను.

వైజయంతి: అవునా.. ఆత్మీయులు మాత్రమే భోజనం సమయంలో వస్తారు అంటారు. ఎట్టాగో వచ్చావు కదా మాతో పాటు భోం చేసి వెళ్లు బాబు.

టోని: అలాగే ఆంటీ..

 అని అంటూనే ధాత్రి, కేదార్‌ లను వీళ్లెవరు అని అడగ్గానే వాళ్లు మా దూరపు బంధువులు వాళ్ల ఆఫీసుకు దగ్గరగా ఉందని ఇక్కడ ఉంటున్నారు. దీంతో ధాత్రి యువరాజ్‌, మీనన్‌ ను మీరు ఎక్కడ ఫ్రెండ్స్‌ స్కూల్‌ లోనా? కాలేజీలోనా? అని అడగ్గానే ఒకరేమో స్కూల్‌ అని.. ఒకరేమో కాలేజీ అని చెప్తారు. తర్వాత ఏ గ్రూప్‌ అని అడిగితే చెరో గ్రూప్‌ చెప్తారు. దీంతో మీరిద్దరూ క్లోజ్‌ ఫ్రెండ్సా.. అని అడగ్గానే అవునని అంటాడు యువరాజ్‌. దీంతో యువరాజ్‌ ను అతని ఫోన్‌ నెంబర్‌ చెప్పు అనగానే యువరాజ్‌ తడబడతాడు. టోని కూడా యువరాజ్‌ నెంబర్‌ చెప్పడు. దీంతో ధాత్రి, కేదార్‌ టోనీని అనుమానిస్తారు. ఇంతలో ఏదోలా మేనేజ్‌ చేసి యువరాజ్‌, టోని వెళ్లిపోతారు.  

నిషిక: ఏంటే.. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు. నీ వెదవ డౌట్లతో వచ్చిన గెస్టుల ముందు ఆయన పరువు తీస్తావా? అసలు మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వడమే మేము చేసిన పెద్ద తప్పు.

వైజయంతి: అవునమ్మీ పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గీరిందని వీళ్లను ఇంట్లో ఉండనిచ్చినందుకు బాగా బుద్ది చెప్పారు. జగధాత్రి ఎవరి హద్దుల్లో వాళ్లుండటం మంచిది.

 అని వైజయంతి చెప్పి తాను మాత్రమే తినడానికి కూర్చుంటుంది. తర్వాత ఎవరి మానాన వాళ్లు వెళ్లిపోతారు. ధాత్రి, కేదార్‌ టోని గురించి ఆలోచిస్తుంటారు. ఇంతలో సాధు తన కూతురు ఆరాధ్య కలిసి వస్తారు.  ఆయన్ని చూసిన ధాత్రి, కేదార్‌ ఎదురు వెళ్లి స్వాగతం చెప్తారు. పక్కకు వెళ్లి మాట్లాడుకుందాం రండి అని పక్కకు వెళ్తుంటే నిషిక వచ్చి ఏంటి అంత సీక్రెటా అని అడుగుతుంది. ఏం లేదని పక్కు వెళ్లిపోతారు ధాత్రి దగ్గరే ఆరాధ్యను వదిలేసి సాధు వెళ్లిపోతాడు.

    మరోవైపు టోని, యువరాజ్‌ బిజినెస్‌ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో టోని చేతిలో బ్రౌన్‌ షుగర్‌ కింద పడటంతో యువరాజ్‌ పేపర్‌ ఎత్తి కిందపడేస్తాడు. అది బూచి దగ్గర పడుతుంది. బూచి అది తింటాడు. మరోవైపు టోని వెళ్లిపోతుంటే ధాత్రి, మీ చిన్నప్పటి ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గానే యువరాజ్‌ అలాంటివేం లేవని చెప్పి టోనిని పంపిచేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.   

ALSO READ:  ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్, కావ్యను విడదీసేందుకు రుద్రాణి ప్లాన్ – స్వప్నను పూల్ చేసిన రాహుల్

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today October 17th: కార్తీకదీపం 2 సీరియల్: మాలినికి జ్యోత్స్న వార్నింగ్! కార్తీక్‌ ఇంటి దగ్గర సూరజ్ గొడవ!
కార్తీకదీపం 2 సీరియల్: మాలినికి జ్యోత్స్న వార్నింగ్! కార్తీక్‌ ఇంటి దగ్గర సూరజ్ గొడవ!
Brahmamudi Serial Today October 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంట్లో రచ్చ రచ్చ చేసిన ఐషు – అపర్ణను తిట్టిన సుభాష్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంట్లో రచ్చ రచ్చ చేసిన ఐషు – అపర్ణను తిట్టిన సుభాష్‌
Nindu Noorella Saavasam Serial Today October 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కొత్త ప్లాన్‌ - కోల్‌కతా నుంచి వచ్చిన నన్స్‌    
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కొత్త ప్లాన్‌ - కోల్‌కతా నుంచి వచ్చిన నన్స్‌    
Jagadhatri Serial Today October 16: నిషిక గొంతునులిమి చంపబోయిన యువరాజు..కోడలిని కాపాడిన వైజయంతి
జగద్ధాత్రి సీరియల్: నిషిక గొంతునులిమి చంపబోయిన యువరాజు..కోడలిని కాపాడిన వైజయంతి

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget