అన్వేషించండి

Jagadhatri Serial Today August 17th: ‘జగధాత్రి’ సీరియల్‌: పరంధామయ్య ఇంటికి వెళ్లిన కౌషికి – గుమ్మం దగ్గర నుంచే వెళ్లగొట్టిన పరంధామయ్య

Jagadhatri Today Episode: ఆదిలక్మీ కోసం ఇంటికి వచ్చిన కోడలిని పరంధామయ్య ఇంటి గుమ్మం దగ్గర నుంచే వెళ్లగొట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: మీనన్‌ కోసం యువరాజ్‌, కమలాకర్‌ పని చేస్తున్నారని తెలిసి ధాత్రి, కేదార్‌ బాధపడతారు. యువరాజ్‌, కమలాకర్‌ ను మీనన్‌ మాయ నుంచి బయటకు తీసుకురావాలని ధాత్రి అంటుంది. అయితే  ఇద్దరూ మీనన్‌ దగ్గర ఇష్టపడి పని చేస్తున్నారో.. లేక ఇరుక్కుపోయి పని చేస్తున్నారో తెలుసుకుంటేనే సమస్యకు సమాధానం వెతకగలం అంటాడు కేదార్‌. అయితే ముందు ఆ సమాధానాన్ని వెతకాలని మీనన్‌ నాశనం వజ్రపాటి వంశానికి శాపం కాకుడదని అంటుంది ధాత్రి. తర్వాత ధాత్రి, కేదార్‌ వచ్చి కౌషికిని ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడగుతుంది. సురేష్‌ వచ్చి ఊరికి వెళ్దామన్నావు కదా? అంటాడు.

కౌషికి: సారీ సురేష్‌. వద్దామనే చాలా ట్రై చేస్తున్నాను. కానీ నా వల్ల కావడం లేదు. నేను రాలేను.

కేదార్‌: అదేంటక్కా అలా అంటున్నావు. వస్తామని చెప్పాము కదా. అత్తయ్య గారు ఎంతో ఆశతో ఇక్కడి నుంచి వెళ్లారు. ఇప్పుడు నువ్వు రావడం లేదంటే చాలా బాధపడతారు అక్క.

ధాత్రి: ఇప్పుడు మీరు వెళ్లకపోయినా ఫంక్షన్‌ జరుగుతుంది వదిన. మీకే నష్టమూ జరగదు కానీ మీరు లేని వెలితి, రాలేదన్న బాధ ఆదిలక్ష్మీ గారికి జీవితాంతం ఉంటుంది.

 అంటూ అందరూ కలిసి కౌషికిని కన్వీన్స్‌ చేస్తారు. దీంతో కౌషికి వెళ్లడానికి ఒప్పుకుంటుంది. దీంతో వైజయంతి, నిషిక బాధపడతారు. రామచంద్రాపురం వెళ్లడానికి కౌషికి ఒప్పుకోవడంతో యువరాజ్‌, కమలాకర్‌ హ్యాపీగా ఫీలవుతారు. అక్కడ ఉన్న విగ్రహం కొట్టేయడానికి ఈజీగా ఉంటుందని ప్లాన్‌ చేస్తారు. దీంతో కమలాకర్‌, యువరాజ్‌ ఇద్దరూ అక్కతో పాటు మనందరం వెళ్తున్నాం అని చెప్పడంతో నిషిక వద్దని వారిస్తుంది. ధాత్రి మాత్రం అనుమానిస్తుంది. కౌషికి హ్యాపీగా ఫీలవుతుంది. నన్ను అర్థం చేసుకున్నందుకు థాంక్స్‌ చెప్తుంది. తర్వాత యువరాజ్‌, కమలాకర్‌, నిషిక, వైజయంతి పక్కకు వెళ్తారు. తర్వాత అందరూ కలిసి సురేష్‌ వాళ్ల ఇంటికి వెళ్తారు. ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది కౌషికి. సురేష్‌ నచ్చజెప్పి కౌషికిని లోపలకి తీసుకెళ్తుంటే అందరూ లోపలికి వెళ్తుంటే పరంధామయ్య వచ్చి  ఆగండి అంటూ కేకలేసి మీకు నా ఇంట్లోకి వచ్చే అర్హత లేదు.  ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోండి. అంటూ తిడతాడు.

సురేష్‌: మీ అర్థం లేని కోపాల వల్లే విషయం ఇంతదూరం వచ్చింది.

పరంధామయ్య: నువ్వు నాకు పుట్టావా? నేను నీకు పుట్టానా? ఎలా ఉండాలో? ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నువ్వు మాట్లాడకు.

ఆదిలక్ష్మీ: ఏంటండి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన కోడలిని గుమ్మం బయటి నుంచే పొమ్మంటావా?

పరంధామయ్య: కోడలా? ఎవరు కోడలు..? ఎవరికి కోడలు? నా కొడుకుతో కలిసి ఉంటుందా? కాపురం చేస్తుందా? నాకు కోడలు అవ్వడానికి. ఎన్ని మాటలు అంది నన్ను. విన్న మీరు మర్చిపోయినా.. అన్న ఈ అమ్మాయి మర్చిపోయినా.. నేను మర్చిపోను.

కౌషికి: నేను అన్న మాట గుర్తున్న మీకు మీ నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ ఏం కోల్పోయిందో మర్చిపోయారా? మామయ్యగారు.

   అంటూ కౌషికి నిలదీయడంతో పరంధామయ్య ఆ బిడ్డ ఇలా అవ్వడానికి కారణం నేను కాదు అంటాడు. దీంతో వైజయంతి భయపడుతుంది. కీర్తిని కిందపడేలా చేసింది గుర్తు చేసుకుంటుంది. నిషిక, వైజయంతి, ఆదిలక్ష్మీని తిడతారు. ఇంతలో ధాత్రి, పరంధామయ్యను కన్వీన్స్‌ చేయాలని చూస్తుంది.  కౌషికి వెళ్లిపోతుంది. సురేష్‌ కడుపుతో ఉన్న కోడలిని ఇలా అవమానిస్తావా? నాన్నా అంటూ అనడంతో పరంధామయ్య  సంతోషంగా నిజమా? నువ్వు తండ్రివి కాబోతున్నావా? ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడా? అంటూ అందరినీ ఇంట్లోకి రమ్మని పిలుస్తాడు. అందరూ లోపలికి వెళ్తారు. తర్వాత వైజయంతి, నిషిక ఎలాగైనా పరంధామయ్యా మళ్లీ కౌషికిని ఇంట్లోంచి వెళ్లగొట్టేలా చేయాలని ప్లాన్ చేస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: పొరపాటు దిద్దుకున్న 'మిస్టర్‌ బచ్చన్‌' టీం - సినిమా నిడివి తగ్గింపు...

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 26th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఇంట్లో వినిపించిన లక్ష్మీ పేరు! పద్మాక్షి సిరి పాప గొడవ పడటానికి కారణమెవరు?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఇంట్లో వినిపించిన లక్ష్మీ పేరు! పద్మాక్షి సిరి పాప గొడవ పడటానికి కారణమెవరు?
Godavari Serial Today June 26th: 'గోదావరి' సీరియల్: రసీదులు ఎక్కడ అంకుల్.. అంత టైం లేదు.. నేనే తేల్చుకుంటా.. సింహాద్రిని వణికించేసిన జాను!
'గోదావరి' సీరియల్: రసీదులు ఎక్కడ అంకుల్.. అంత టైం లేదు.. నేనే తేల్చుకుంటా.. సింహాద్రిని వణికించేసిన జాను!
Nindu Manasulu Serial Today June 26th: నిండు మనసులు: లంచం కేసులో గణ అరెస్ట్! హనీమూన్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్!
నిండు మనసులు: లంచం కేసులో గణ అరెస్ట్! హనీమూన్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్!
Nuvvu leka Neanu Lenu Serial Today June 26th: విక్కీ ఇంట్లో నుంచి పారిపోయేలా చేసేందుకు రాధ చేసిన ప్రయత్నాలు ఏంటి...?
నువ్వులేక నేను లేను: విక్కీ ఇంట్లో నుంచి పారిపోయేలా చేసేందుకు రాధ చేసిన ప్రయత్నాలు ఏంటి...?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Sentiment vs AP Development: ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
Nandyal SI Bigg Boss 10 Selfie Video: బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
Pune Ketan Agrawal Murder Case: పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
Varanasi Update : వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
Mollywood Times OTT : ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ram Mandir Donation Theft: అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
Khairatabad Ganesh Idol 2026: 2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
Ketan Agarwal Murder Case: 'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
Embed widget