అన్వేషించండి

Jagadhatri Serial Today August 13th: ‘జగధాత్రి’ సీరియల్‌: కౌషికి బిడ్డను చంపేందుకు నిషిక ప్లాన్ – అత్త, ఆడపడుచును ఇంట్లోంచి గెంటి వేసిన కౌషికి

Jagadhatri Today Episode: కౌషికి ప్రెగ్నెంట్ అని తెలియడంతో ఎలాగైనా కౌషికి కడుపులో బిడ్డను చంపేయాలని నిషిక ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: కౌషికి స్పృహ తప్పి పడిపోతుంది. డాక్టర్‌ వచ్చి పరీక్షించి తను ప్రెగ్నెంట్‌ అని చెప్పడంతో నిషిక, వైజయంతి, కమలాకర్‌, యువరాజ్‌ షాక్‌ అవుతారు. సుధాకర్‌, సురేష్‌, ధాత్రి, కేదార్‌ హ్యాపీగా ఫీలవుతారు.  కౌషికి మాత్రం ఆందోళన పడుతుంది. సురేష్‌ చాలా హ్యాపీగా కౌషికికి థాంక్స్‌ చెప్తాడు. డాక్టర్‌ జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతుంది. అందరూ వచ్చి కంగ్రాట్స్‌ చెప్తుంటారు. కమలాకర్‌, యువరాజ్‌, వైజయంతి వాళ్లకు విష్‌ చేయమని సుధాకర్‌ చెప్పడంతో ముభావంగా కంగ్రాట్స్‌ చెప్పి వెళ్లిపోతారు. తర్వాత అందరూ కలిసి బాధపడుతూ ఉంటారు.

వైజయంతి: తల తిక్క నాయాలా? ఎప్పుడు ఏదో ఒక తింగరి పని చేయడం. అందరి దగ్గర దెబ్బలు తింటావు.

బూచి: అది కాదు అత్తయ్యా..?

వైజయంతి:  నువ్వు మాట్లాడకుండా? ఆ మూలన కూర్చో..

బూచి: మూల అని అంత తక్కువ చేసి మాట్లాడకండి అత్తయ్యా? మనం ఏం చేయకుండా జరిగేవి చూస్తూ ఊరుకుంటే మీరు రావాల్సింది కూడా ఆ మూలకే..

నిషిక: వినడానికి కష్టంగా ఉన్నా..? ఊహించుకోవడానికి భయంకరంగా ఉన్నా..? అన్నయ్య చెప్పింది నిజమే అత్తయ్యా?

కాచి: అసలు అక్క నెల తప్పడం ఏంటి? పెద్దమ్మా విడ్డూరం కాకపోతే…

వైజయంతి: రెండు నెలల ముందు వరకు ఆ సురేష్‌ పేరు చెబితేనే కౌషికి మండిపోయేది. ఇప్పుడు నెల తప్పడాలు ఏంటి?

  అని అందరూ మాట్లాడుకుంటుంటారు. కౌషికికి మగ పిల్లాడు పుడితే మన పరిస్థితి ఏంటని ఆలోచిస్తారు. ఇంతలో ఆ బిడ్డను పైలోకానికి పంపించాలని నిషిక చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. తర్వాత వైజయంతి మంచి ఐడియా అని ముందు ఆ పనిలో ఉందామని వెళ్లిపోతారు. తర్వాత ధాత్రి హారతి తీసుకొచ్చి కౌషికికి దిష్టి తీస్తుంది. వైజయంతి, నిషిక మాత్రం మీ సంతోషం ఎన్ని రోజులుంటుందో చూస్తామని అనుకుంటారు. ధాత్రి అందరికీ స్వీట్స్‌ ఇస్తుంది. ధాత్రి మాకు బుజ్జి మేనల్లుడిని ఇవ్వాలని అడుగుతుంది. దీంతో సురేష్‌ కూడా మా సంగతి సరే మీరు కూడా మాకో బుజ్జి మేనకోడలును ఇవ్వాలని అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటుంటే వైజయంతి ముందు బిడ్డను పుట్టనివ్వండి అనగానే అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో నిషిక మాట మార్చి  అందరికీ ఏదో సర్ధి చెప్తుంది. తర్వాత సురేష్‌ వాళ్ల అమ్మ ఆదిలక్ష్మీ, చెల్లి భాగ్యలక్ష్మీ వస్తారు. వాళ్లను చూసి వైజయంతి షాక్‌ అవుతుంది.

వైజయంతి: ఆదిలక్ష్మీ వచ్చిందేంటి? చీర సారే తీసుకుని కోడలితో కలిసిపోవడానికి వచ్చిందా? ఇంతదూరం వచ్చి ఇంట్లోకి వచ్చేసిందంటే పరిస్థితి చేజారిపోయినట్లే..

కమలాకర్‌: వదిన అదే జరిగితే మన ఇన్నేళ్ల కష్టానికి ఫలితం లేకుండా పోతుంది వదిన. అందరూ కలిసిపోతే ఇక ఆ కౌషికికి మనతో అవసరం ఉండదు. ఈ కోటలో మనం ఉండలేం.

యువరాజ్‌: వాళ్లు ఎంత ప్రేమతో వచ్చినా..? పశ్చాతాపంతో వచ్చినా అక్క వాళ్ళ ముఖం కూడా చూడదు.

ధాత్రి: అన్నయ్యా ఎవరొచ్చారో చూడండి..

ఆదిలక్ష్మీ: వైజయంతి గారు ఎలా ఉన్నారు..?

వైజయంతి: బాగుండాములే కానీ చాలా రోజులకు గుర్తొచ్చినట్లున్నాము..

సుధాకర్‌: వైజయంతి…  బాగున్నారా? అక్కయ్య గారు..

ఆదిలక్ష్మీ: బాగున్నామండి.. ఎలా ఉన్నావు కౌషికి..?

కౌషికి: ఎందుకొచ్చారు..?

భాగ్యలక్ష్మీ: అదేంటి వదిన అలా అంటున్నారు?

వైజయంతి: ఇంకేం అనాలి అమ్మీ.. ప్రేమగా పలకరించాలా? హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలా?

 అంటూ వైజయంతి కోపంగా ఆదిలక్ష్మీ, భాగ్యలక్ష్మీలను తిడుతుంది. అయితే రెండు రోజుల్లో అమ్మా నాన్నా షష్టి పూర్తి వదిన అందుకే మిమ్మల్ని పిలవడానికి వచ్చాము. అనగానే కౌషికి ఏంటిది కొత్తగా బయటకు వెళ్లండి. మీరు ఇంట్లోంచి వెళ్లగొట్టినా నేను నా కూతురు బాగానే ఉన్నాము అంటూ తిడుతుంది కౌషికి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ప్రభాస్ గంటన్నర నవ్వాడు, నా గెటప్ చూసి నేనే షాక్ - అలీ

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని కాపాడిన మహా ఉగ్రరూపం! లక్ష్మీ తిరిగి రావాల్సిందే అంటోన్న యమున!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని కాపాడిన మహా ఉగ్రరూపం! లక్ష్మీ తిరిగి రావాల్సిందే అంటోన్న యమున!
Godavari Serial Today November 3rd: 'గోదావరి' సీరియల్: సింహాద్రి, నిత్యలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జాను, మురళీ! నందుకి పెళ్లి టెన్షన్!
'గోదావరి' సీరియల్: సింహాద్రి, నిత్యలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జాను, మురళీ! నందుకి పెళ్లి టెన్షన్!
Nindu Manasulu Serial Today November 3rd: నిండు మనసులు: గణ, ప్రేరణలకు ఛాన్స్ ఇచ్చిన సిద్ధూ! ఆ సీన్ అదుర్స్!
నిండు మనసులు: గణ, ప్రేరణలకు ఛాన్స్ ఇచ్చిన సిద్ధూ! ఆ సీన్ అదుర్స్!
Illu Illalu Pillalu Serial Today November 3rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు కాలర్ పట్టుకొని నిలదీసిన భాగ్యం! వల్లీతో కలిసి బతకనని తేల్చేసిన చందు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు కాలర్ పట్టుకొని నిలదీసిన భాగ్యం! వల్లీతో కలిసి బతకనని తేల్చేసిన చందు!

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Murala Jyothi: చర్చిపేట నుంచి ఛైర్ పర్సన్ స్థాయికి.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
చర్చిపేట నుంచి ఛైర్ పర్సన్ స్థాయికి.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Andhra Pradesh Rains Update: తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
The Grand Master OTT : చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Embed widget