అన్వేషించండి

Jagadhatri Serial Today April 1st: ‘జగధాత్రి’ సీరియల్‌: ఫంక్షన్‌ లోకి రౌడీలను తీసుకెళ్లిన యువరాజ్‌ - ఫంక్షన్‌ లో కేదార్‌, ధాత్రిని పట్టుకున్న నిషిక

Jagadhatri Today Episode: మీనన్ మనుషులను ఘట్టమనేని ఇంట్లోకి యువరాజ్ తీసుకెళ్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: కౌషికి జ్యువెల్లరీ, బట్టలు తీసుకొచ్చి కేదార్‌, ధాత్రికి ఇస్తుంటే నిషిక, వైజయంతి వచ్చి అడ్డుచెప్తారు. వదిన నువ్వు వాళ్లను బాగా వెనకేసుకొస్తున్నావు అంటూ నిషిక కోపంగా కౌషికిని తిడుతుంది. దీంతో కౌషికి కూడా నిషికను తిడుతుంది. వాళ్లకు బట్టలు ఇవ్వడానికి నీ పర్మిషన్‌ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో ధాత్రి తాము ఆ ఫంక్షన్‌కు రావడం లేదని చెప్పడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు అఖిలాండేశ్వరి ఇంట్లో ఫంక్షన్‌ మొదలవుతుంది.

అఖిల: మా ఆహ్వానాన్ని మన్నించి దేవా, పార్వతీల పెళ్లి రోజుకు, నా కొడుకులాంటి చరణ్‌ హేమల నిశ్చిర్థానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నా విజయానికి కారణం నా పెద్ద కొడుకు దేవ.

అని అఖిలాండేశ్వరి చెప్పగానే దేవ, పార్వతి వచ్చి కేక్‌ కట్ చేస్తారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి మేడం వజ్రపాటి కౌషికి వాళ్ల ఫ్యామిలీ వస్తుంది. అని చెప్తాడు.

హేమ: అదే చెప్పాను కదా.. నిషి అని నా ఫ్రెండ్ వస్తుందని వాళ్ల ఫ్యామిలీనే

అఖిల: ఓ అయితే నిషిక వజ్రపాటి కౌషికి గారి బంధువా? కౌషికి గురించి తన బిజినెస్‌ ల గురించి చాలా విన్నాను. ఇన్ని రోజులకు కలిసే అవకాశం వచ్చింది. పెద్దబాబు నువ్వు పార్వతి వెళ్లి  ఆహ్వానించండి.

బయట కౌషికి ఫ్యామిలీ లోపలికి వస్తుంటే.. మీనన్‌ మనుషులు యువరాజ్‌కు ఫోన్‌ చేస్తారు.

యువరాజ్‌: హలో ఎక్కడరా?

రౌడీలు: భాయ్‌ మీరు చెప్పిన చోటికే వచ్చాము కానీ లోపలికి అందరిని చెక్‌ చేసే పంపిస్తున్నారు.

యువరాజ్‌: సరే అయితే నేను సైగ చేసినప్పుడు వచ్చేయండి.

అని చెప్పి యువరాజ్‌ గేటు దగ్గరకు వెళ్లి రౌడీలను పిలుస్తాడు. సెక్యూరిటీ ఆపితే వాళ్లను మేమే తీసుకొచ్చాము వంటవాళ్లు అని యువరాజ్‌ చెప్పగానే సెక్యూరిటీ సరే వెళ్లండి అని చెప్తాడు. వాళ్ల వెనకాలే మాస్కులు పెట్టుకుని కేదార్‌, ధాత్రి వంటవాళ్లమేనని చెప్పి లోపలికి వెళ్తారు. కౌషికి ఫ్యామిలీకి స్వాగతం చెప్పడానికి దేవేంద్రతో వచ్చిన పార్వతిని చూసి ధాత్రి షాక్‌ అవుతుంది.

ధాత్రి: పార్వతి ఏంటి ఇక్కడ ఉంది. ఇక్కడ జరుగుతుంది. పార్వతి వాళ్ల పంక్షనా?

కేదార్‌: ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? ధాత్రి.

ధాత్రి: తెలియడం ఏంటి కేదార్‌. అది ఊర్లో నా బెస్ట్‌ ఫ్రెండ్‌ మా అమ్మ ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఒకటే ఊర్లో ఉండేవాళ్లం.

కేదార్‌: అంటే ఇప్పుడు మీనన్‌ టార్గెట్‌ చేస్తుంది పార్వతీ వాళ్లనా? మీనన్‌ ను ఎలాగైనా ఆపాలి ధాత్రి.

అంటూ ఇద్దరూ లోపలికి వెళ్లిపోతారు. మరోవైపు రౌడీలు పార్వతిని కిడ్నాప్‌ చేయడానికి రెడీ అవుతుంటారు. మరోవైపు మీనన్‌ మనుషులను కనిపెట్టిన ధాత్రి, కేదార్‌ వాళ్లను చితక్కొడుతుంటారు. కొంత మంది రౌడీలు తప్పించుకుని లోపలికి వెళ్లిపోతారు. మరోవైపు కౌషికి, అఖిలాండేశ్వరి ఒకరి ఫ్యామిలీని ఒకరు పరిచయం చేసుకుంటారు. ఇంతలో మీనన్‌, అఖిలాండేశ్వరికి ఫోన్‌ చేసి బెదిరిస్తాడు. మీ వాళ్లందర్ని చంపేస్తాననడంతో అఖిల అరుస్తుంది. దేవ ఫోన్‌ తీసుకుని మీనన్‌కు వార్నింగ్‌ ఇస్తాడు.

కేదార్‌: స్నేహితుడి గుణాలు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. శత్రువు బలాలు తెలుసుకోవడం అంతే ముఖ్యం. మీనన్‌ను దేవ తక్కువ అంచనా వేస్తున్నాడు.

ధాత్రి: మనం నిజం చెప్పలేము. అలాగని ఆ ఫ్యామిలీకి ఆపద కలుగుతుంటే చూస్తూ ఊరుకోలేం. మీనన్‌ మనుషులను కనిపెట్టి ఎవ్వరికీ తెలియకుండా వాళ్లను సైడ్‌ చేయాలి.

అంటూ ఇద్దరూ వెళ్లి మీనన్‌ మనుషులను వెతుకుతుంటారు. ఇంతలో ఫోన్‌ మాట్లాడుతూ బయటకు వచ్చిన నిషిక చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అనుమానిస్తుంది. ఎవరు మీరు అని అడుగుతుంది. దీంతో షాక్‌ అయిన ధాత్రి, కేదార్‌ తర్వాత తేరుకుని తాము చెవిటి మూగ అని సైగ చేస్తారు. దీంతో నిషిక వెళ్లిపోతుంది. వెనక నుంచి పార్వతి చూస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటూ అడగ్గానే లేదని సైగ చేస్తుంది ధాత్రి. ఇంతలో పార్వతిని ఎవరో పిలవడంతో లోపలికి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఈటీవీ విన్‌లో కొత్త సిరీస్ - ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా ‘శర్మ అండ్ అంబానీ’

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక వల్ల వారసుడికి ప్రమాదం ఉందని తెలుసుకున్న లక్ష్మీ! కొడుకు, కూతుళ్లని చూసి మురిసిపోయిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక వల్ల వారసుడికి ప్రమాదం ఉందని తెలుసుకున్న లక్ష్మీ! కొడుకు, కూతుళ్లని చూసి మురిసిపోయిన విహారి!
Karthika Deepam 2 Serial Today May 23rd: కార్తీకదీపం సీరియల్: తల్లితో దీపకు మధురమైన అనుభవం! బుజ్జమ్మకి ఇచ్చి పడేసిన అక్క, బావలు!
కార్తీకదీపం సీరియల్: తల్లితో దీపకు మధురమైన అనుభవం! బుజ్జమ్మకి ఇచ్చి పడేసిన అక్క, బావలు!
Godavari Serial Today May 23rd: 'గోదావరి' సీరియల్: సింహాద్రి శంకర్‌ని మోసం చేస్తున్నాడా.. మురళీ లవ్‌కి సూర్య సపోర్ట్! లవ్ లెటర్ చిక్కులు తెస్తుందా!
'గోదావరి' సీరియల్: సింహాద్రి శంకర్‌ని మోసం చేస్తున్నాడా.. మురళీ లవ్‌కి సూర్య సపోర్ట్! లవ్ లెటర్ చిక్కులు తెస్తుందా!
Nindu Noorella Saavasam Serial Today May 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ - రణవీర్‌ తో వెళ్లనున్న అంజు   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ - రణవీర్‌ తో వెళ్లనున్న అంజు   

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Embed widget