అన్వేషించండి

Punch Prasad: ‘జబర్దస్త్’ పంచ్ ప్రసాద్‌కు ఏమైంది? రెండు కిడ్నీలు పాడవ్వడానికి కారణం అదేనా?

పంచ్ ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి చెప్పుకొచ్చాడు. తనకు ముందు నుంచీ బిపీ(బ్లడ్ ప్లెజర్) ఉందని. బీపీ ఉన్న సంగతి తనకు తెలియలేదని అన్నాడు. దాని వల్లే..

Punch Prasad: ‘జబర్దస్త్’ పంచ్ ప్రసాద్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో ఎప్పటికప్పుడు డయాలసిస్ చేయించుకుంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నాడు ప్రసాద్. మధ్యలో ఒకటి రెండు సార్లు ఆరోగ్యం కాస్త సహకరించడంతో జబర్దస్త్ లో కొన్ని స్కిట్ లలో కనిపించాడు. మళ్లీ ఇప్పుడు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. అసలు పంచ్ ప్రసాద్ ఆరోగ్యం ఇంతలా పావడానికి గల కారణాలను ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పాడు ప్రసాద్. 

బిపి ఉందని నాకు తెలియదు, అదే కారణం: పంచ్ ప్రసాద్

పంచ్ ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి చెప్పుకొచ్చాడు. తనకు ముందు నుంచీ బిపీ(బ్లడ్ ప్లెజర్) ఉందని. బీపీ ఉన్న సంగతి తనకు తెలియలేదని అన్నాడు. అసలు వయసులో ఉన్న వాళ్లకు బీపీ ఎందుకు వస్తుంది అనే భ్రమలో ఉండేవాడినని అన్నాడు. స్కిట్ లు చేస్తున్నపుడు కూడా తనకు కోపం ఎక్కువగా వచ్చేదని, అయితే స్కిట్ లలో టెన్షన్ ల వల్ల అలా వస్తుంది అని అనుకునేవాడినని చెప్పాడు. తనకు అప్పుడప్పుడు ముక్కులోనుంచి కూడా రక్తం వచ్చేదని అయితే అలా చాలా సార్లు వచ్చిందని ఇది మామూలుగానే వస్తుందని అనుకున్నానని అన్నాడు. అయితే సునీతతో ఎంగెజ్మెంట్ అయిన తర్వాత ఓ సారి ముక్కులోనుంచి రక్తం వచ్చిందని, అది సునీత భయపడి ఆసుపత్రికి తీసుకెళ్లిందని, తర్వాత అసలు విషయం బయటపడిందని చెప్పాడు. రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయని డాక్టర్లు చెప్పారని చెప్పాడు. తర్వాత తన ఆరోగ్యం బాగా పాడైందని చెప్పుకొచ్చాడు ప్రసాద్. అయితే పెళ్లికి ముందే తనకు ఈ సమస్య ఉందని తెలిసినా కూడా సునీత తనను పెళ్లి చేసుకుందని, ఇప్పటికీ తనకు అండగా ఉంటూ వస్తుందని అన్నాడు. తన వల్ల తన భార్య చాలా కష్టాలు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

సర్జరీ చేయకపోతే కష్టం..

పంచ్ ప్రసాద్ కు ఎప్పటికప్పుడు డయాలసిస్ చేస్తూ వస్తున్నారు. డయాలసిస్ చేయించుకుంటూనే పలు సార్లు స్కిట్ లు కూడా చేశాడు ప్రసాద్. అయితే ఇప్పుడు పంచ్ ప్రసాద్ ఆరోగ్యం పూర్తిగా పాడైందని డాక్టర్లు చెప్పారు. ఈ విషయాన్ని ఇటీవల కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ మధ్య కాలంలో ప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లామని ప్రసాద్ కు వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయాలని చెప్పారని చెప్పాడు. ఆపరేషన్ చేయకపోతే ఏ క్షణం ఏమైనా జరగవచ్చని డాక్టర్లు చెప్పినట్టు తెలిపాడు. దీంతో పంచ్ ప్రసాద్ ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు.

పంచ్ ప్రసాద్ కు అండగా ఏపీ ప్రభుత్వం..

పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కోసం చాలా డబ్బు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారని నూకరాజు చెప్పాడు. అందుకే దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. కిడ్నీలు పూర్తిగా పాడవడంతో కొత్త సమస్యలు కూడా వస్తున్నాయని ఎన్ని ఆసుపత్రులు తిప్పినా ప్రయోజనం లేదని అన్నాడు. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాలను పర్యవేక్షించే డాక్టర్ మామిడి హరికృష్ణకు ట్యాగ్ చేశాడు. దీనిపై హరికృష్ణ స్పందించారు. ఇప్పటికే తమ టీమ్ పంచ్ ప్రసాద్ ఫ్యామిలీ తో మాట్లాడుతుందని వెల్లడించారు. అతని ఫ్యామిలీతో  లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లూ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పారు. దీంతో పంచ్ ప్రసాద్ కు ఆ సాయం అంది త్వరలోనే ఆపరేషన్ జరిగి ఆయన పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నారు నెటిజన్స్.

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today November 20th: నిండు మనసులు: సిద్ధూని నమ్మించడానికి తండ్రినే అరెస్ట్ చేయనున్న ప్రేరణ! సిద్ధూ ప్రేరణతో కలిసిపోతాడా!
నిండు మనసులు: సిద్ధూని నమ్మించడానికి తండ్రినే అరెస్ట్ చేయనున్న ప్రేరణ! సిద్ధూ ప్రేరణతో కలిసిపోతాడా!
Godavari Serial Today November 20th: 'గోదావరి' సీరియల్: నందు బాస్‌కి దొరికిపోయిందా! అలతో సంతకం పెట్టించేసిన ఆకర్ష్‌! నల్లపూసల తంతుకి జాను రెడీ!
'గోదావరి' సీరియల్: నందు బాస్‌కి దొరికిపోయిందా! అలతో సంతకం పెట్టించేసిన ఆకర్ష్‌! నల్లపూసల తంతుకి జాను రెడీ!
Illu Illalu Pillalu Serial Today November 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అంజలి ఇంట్లో చందు! నర్మద, సాగర్‌ల ఎడబాటు! తిరుపతి రొమాన్స్‌!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అంజలి ఇంట్లో చందు! నర్మద, సాగర్‌ల ఎడబాటు! తిరుపతి రొమాన్స్‌!
Karthika Deepam 2 Serial Today November 20th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని గెంటేసిన దక్షిణామూర్తి, సూరజ్! వాయిస్ మెసేజ్‌లో ఉన్న సందేశమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని గెంటేసిన దక్షిణామూర్తి, సూరజ్! వాయిస్ మెసేజ్‌లో ఉన్న సందేశమేంటి?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget