అన్వేషించండి

Jabardasth Latest Promo: జగన్‌పై మళ్లీ పంచ్ - మంగళవారం అంటూ నోరుజారిన రోహిణి, హోటల్ ముందు ఫైమా రచ్చ

ఎప్పటి లాగే ఈ వారం కూడా ‘జబర్దస్త్’ బుల్లితెర ప్రేక్షకులను ఓ రేంజిలో అలరించబోతోంది. ఆయా టీమ్ లో వేసిన పంచులు నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. తాజాగా విడుదలైన వారం ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.

Jabardasth Latest Promo Out: ‘బుల్లితెర’ ప్రేక్షకులను వారం వారం నవ్వుల్లో ముంచెత్తుతున్న ‘జబర్దస్త్’ కామెడీ షో ఈ వారం కూడా అలరించబోతోంది. రాబోయే ఎపిసోడ్ కు సంబంధించి విడుదలైన ప్రోమో ఫుల్ ఫన్ తో ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాపై రాఘవ పంచులు, కుష్బూ రివర్స్ పంచ్

ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రాఘవను చెప్పాపెట్టకుండా వచ్చారేంటని భార్య అడుగుతుంది. “మధ్యాహ్నం మా బాస్ లేడు వచ్చేస్తున్నానని ట్విట్టర్ లో పెట్టాను కదా.. ఇన్ స్టాలో కూడా పెట్టాను. ఆ రెండు మిస్సైనా తెలుసుకోవాలని వాట్సాప్ లో పెట్టాను. అది కూడా చూడలేదా?” అంటూ ఒంటికాలు మీద లేస్తాడు. “సరేగానీ..బాగా ఆకలిగా ఉంది. అర్జంటుగా వెళ్లి వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు పంపించు” అంటాడు రాఘవ. “వాటిని వాట్సాప్ లో పంపించు చాలు” అని  కుష్బూ రివర్స్ పంచ్ వేయగానే అందరూ నవ్వుతారు.    

తాగుబోతు రమేష్ పై నూకరాజు పంచులు, నోరు జారిన రోహిణి

‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ స్పూస్ చేసి నవ్వించాడు నూకరాజు. “ఉదయాన్నే లేచి నవ్వితే షుగర్ తగ్గుతుందట. ఆ విషయం తనకు షుగర్ వచ్చాకే తెలిసింది” అంటూ నూకరాజు చెప్పడంతో అందరూ నవ్వుతారు. ఇక తాగుబోతు రమేష్ పై నూకరాజు వేసిన పంచ్ లు కడుపుబ్బా నవ్విస్తాయి. “హాస్యంలో వందకు వంద మార్కులు తెచ్చుకున్న నువ్వు ఇక్కడేంటి 8, 8 మార్కులు వస్తున్నాయి” అనడంతో అందరూ నవ్వుతారు. ఫ్యామిలీ హోటల్ పేరుతో ఆటో రాం ప్రసాద్ వేసిన స్కిట్ పటాసులా పేలింది. హోటల్ కు వచ్చిన కస్టమర్లకు ఫ్యామిలీ  అట్మాస్పియర్ ఏర్పాటు పేరుతో చేసే మోసం అందరినీ నవ్విస్తుంది. కస్టమర్లకు భార్యగా యాక్ట్ చేస్తూ రోహిణి వేసిన పంచులు ఓ రేంజిలో అలరిస్తున్నాయి.

బట్టల దుకాణంలో కెవ్వు కార్తిక్ టెన్షన్, హోటల్ ముందు రచ్చ చేసిన ఫైమా

ఇక బట్టల షాప్ లో ఎంప్లాయిగా కెవ్వు కార్తిక్ చేసిన ఫన్ అందరినీ ఆకట్టుకుంది. డిస్ ప్లే బొమ్మల మధ్యలో నిజమైన అమ్మాయిని పెట్టి, ఎక్కడ తన ఓనర్ కు తెలిసిపోతుందోనని ఆయన పడే టెన్షన్ ఫుల్ ఫన్ జెనరేట్ చేస్తుంది.  బుల్లెట్ భాస్కర్, ఫైమా, నాటీ నరేష్ చేసిన కామెడీ అందరినీ ఆకట్టుకుంది. నరేష్ బాగా చదివి 100కు 100 మార్కులు తెచ్చుకున్నా బుల్లెట్ భాస్కర్ కొట్టడం నవ్విస్తుంది. “అన్ని సబ్టెక్టులు బాగా చదివితే టీచర్లు నన్ను స్కూల్‌కు పిలవరు. అదే జీరో తెచ్చుకుంటే అందరూ టీచర్లు పిలుస్తారు” అని నవ్విస్తాడు. భాస్కర్ ఫైమాను కాదని మరో అమ్మాయితో ఓ హోటల్ గదిలో ఉండగా, ఫైమా అక్కడికి పోలీసులతో వచ్చి చేసిన రచ్చ అందరినీ అలరిస్తుంది. మీడియా ముందు ఆమె ఏడ్చే ఏడ్పులు నవ్వుల పువ్వులు పూయిస్తాయి.

మరోసారి జగన్ మీద పంచ్ వేసిన రింగ్ రియాజ్

ఎప్పటిలాగే ఇమ్మాన్యుయేల్ వర్షాతో డబుల్ మీనింగ్ డైలాగులతో స్కిట్ చేశాడు. తాను ఇంట్లో లేనప్పుడు ఏవో సౌండ్లు వస్తున్నాయంటూ భార్యను అనుమానిస్తాడు. “అవునండీ మీరు ఇంట్లో లేనప్పుడు వస్తువులు వాటంతట అవే పడుతున్నాయి. ఏదో ఆత్మ ఉందని భయమేస్తుంది” అంటుంది వర్ష. “ హైదరాబాద్ లో ఉన్న వాళ్లు అందరూ అయిపోయారు ఆత్మల దగ్గరికి కూడా వెళ్లావా?” అంటూ అతడు వేసే పంచ్ అందరినీ నవ్వించింది. ఇక దయ్యాన్ని తరిమికొట్టేందుకు మాంత్రికుడు రియాజ్ ను పిలిపిస్తాడు. పదింటికి వస్తానని 11 గంటలకు వచ్చారేంటి? అని అడుగుతాడు ఇమ్మూ. “నేను పదికి రాను, పదకొండుకే వస్తా” అంటూ వైఎస్ జగన్ పై వేసిన పంచ్ అందరినీ నవ్విస్తుంది.     

Read Also: చ‌ర‌ణ్‌, రానా, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. 140 మందితో వాట్సాప్ గ్రూప్ దాంట్లో ఏం మాట్లాడుకుంటామంటే? - మంచుల‌క్ష్మీ

టాప్ హెడ్ లైన్స్

Abhishek Yannam: 'ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
Jaya Chiravuri: యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget