అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today may 1st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీ చేతికి బెల్..! అత్తా, తోటికోడళ్లకు పరుగులు పెట్టిస్తున్న గయ్యాలి!

Illu Illalu Pillalu Today Episode may 1st గర్భవతి అయిన వల్లీ కాలు కింద పెట్టకుండా అన్నీ సౌకర్యాలు మీరే చేయాలి అని రామరాజు వేదవతి, నర్మద, ప్రేమలకు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode సాగర్ ఆస్తి వాటాల గురించి మాట్లాడటం గుర్తు చేసుకొని ధీరజ్ చాలా బాధ పడతాడు. ప్రేమ ధీరజ్ దగ్గరకు వచ్చి నా మీద నీకు చాలా కోపం ఉంది కదరా.. నువ్వు చెప్పకపోయినా నీ బాధ నాకు తెలుస్తుంది. దీని అంతటికీ నేనే కారణం.. నన్ను క్షమించురా అని అంటుంది. జరిగిన దాంట్లో నీ తప్పే లేదు నువ్వు బాధ పడకు.. నేనే తప్పు చేశాను.. అనవసరంగా బావని సాక్షి సంతకం పెట్టమని తీసుకెళ్లాను అని అంటాడు. మీ బావకి అడిగింది నేనే కదరా నాదే తప్పు అని ప్రేమ అంటుంది. నా నగలు తీసుకోమని చెప్తే తీసుకోవు.. మీ అక్కకి తెలిస్తే ఇంత పెద్ద గొడవ జరుగుతుందని అనుకోలేదురా.. మర్చిపోనురా నా భర్తకి జరిగిన అవమానం మర్చిపోను.. కారు డౌన్ పేమెంట్‌ కోసం కూడా డబ్బులు లేవు అని ఎవరు అయితే అవమానించారో వాళ్ల ముందే నా భర్తని గర్వంగా తలెత్తుకునేలా చేస్తాను.. రేపే నువ్వు డబ్బులు కడుతున్నావ్ కారు కొంటున్నావ్ అని అంటుంది. డబ్బులు ఎక్కడివి ప్రేమ అని అడుగుతాడు. ఏదో ఒకటి చేస్తా రేప్ కారు కొని అందరికీ చూపించకపోతే నా పేరు ప్రేమే కాదు.. అని ఛాలెంజ్ చేస్తుంది. 

సాగర్ ఆఫీస్‌కి వెళ్తుంటే నర్మద ఆపుతుంది. నీతో కొంచెం మాట్లాడాలి అని నర్మద అంటే ఏంటి ఆస్తి పంచమని మీ మామయ్యకి రాత్రి చెప్పిన విషయం గురించా దాని కోసం అయితే నాకు మాట్లాడే మూడ్ లేదు అని అంటాడు. నీ మనసులోకి ఆస్తి పంచాలనే ఆలోచన రావడం ఏంటి సాగర్ బుద్ధి లేకుండా..ఈ ఆలోచన నీదేనా లేక ఇంకెవరిదైనానా అని నర్మద అడుగుతుంది. ఆస్తి ముక్కలైపోతే మీ నాన్న తట్టుకోగలరా అని నర్మద అడుగుతుంది. ఏయ్ ఆపు ఆయనకే గుండె ఉందా.. అదే ముక్కలైపోతుందా.. ఎంత సేపు మీ నాన్న బాధ పడతాడు.. మీ నాన్న బాధ పడతాడు అంటున్నావ్ కానీ నా బాధ నీకు అవసరం లేదా.. నీకు దండం పెడతా తల్లీ క్లాస్‌లు పీకి చంపకు. ఆయన దృష్టిలోనే కాదు.. నీ దృష్టిలో కూడా నేను చవటని అయిపోయా అని అంటాడు. నర్మద బాక్స్‌ ఇస్తే అవసరం లేదు అని వెళ్లిపోతాడు. 

ప్రేమ చూసి నర్మదతో ఏమైంది అక్క బావ ఇంకా అదే కోపంతో ఉన్నాడా అని అడిగితే కోపంతో కాదు మొండిగా ఉన్నాడు.. ఇంతకు ముందు ఏమైనా అయితే ఇంటి నుంచి వెళ్లిపోదాం అనేవాడు,,. కానీ ఇప్పుడు ఆస్తి పంపకాలు అంటున్నాడు.. అని అంటుంది. ఏమైనా అయితే చూసుకోవడానికి అత్తయ్యా గారు ఉన్నారు అక్క నువ్వు భయపడకు అని అంటుంది ప్రేమ. ఇక అత్తయ్య గారు ఎక్కడ అని నర్మద అంటుంది. ఆరు బయట వేదవతి  ముగ్గు వేస్తూ వీడియోలో చూసిన ముగ్గు అలాగే రాలేదు అని  ఫీలవుతుంది. తిరుపతి వేదవతితో వీడియోలు చూసి ఎంజాయ్ చేయాలి కానీ ఇలా ప్రయోగాలు చేయకూడదు అని అంటాడు. నర్మద, ప్రేమ వచ్చి అత్త మీకు అసలు మనసు ఉందా.. రాత్రి అంత పెద్ద గొడవ జరిగింది కదా.. కొడుకులు కోపంగా ఉంటారు.. కోడళ్లు  బాధ పడుతుంటారు.. వాళ్లకి సర్దిచెప్పాలి అని కొంచెం అయినా ఉందా అని అడుగుతారు. గవర్నమెంట్ కోడలా నా కొడుకు కోపాన్ని తగ్గించి సమస్య సర్దుమణిగేలా నేను చేస్తా కానీ ఈ ముగ్గు తేడా కొట్టేసింది ముగ్గురం కలిసి పని పడదాం రండి అని పిలుస్తుంది. 

నర్మద, ప్రేమ పాత ముగ్గు తుడిచేసి మళ్లీ  ముగ్గు వేస్తారు. ముగ్గురు కలిసి రంగులు వేస్తారు. వల్లీ దూరం నుంచి చూసి అత్తయ్య గారు ఊరి నుంచి అలా వచ్చారో లేదో ఈ కోడళ్లతో కలిసిపోయారు.. నేను కడుపుతో ఉన్నా నన్ను పట్టించుకోవడం లేదు.. వీళ్లని ఏలా అయినా తిట్టించాలి అని కిచెన్‌లోకి వెళ్లి వంట చేస్తూ కష్టపడుతున్నట్లు బిల్డప్ ఇస్తుంది. కిచెన్‌లో గిన్నెలు పడేసి సౌండ్ చేయడంతో రామరాజు వెళ్లి చూస్తాడు. అమ్మా వల్లీ ఏంటమ్మా అంటే నేను గర్భవతిని కదా మామయ్యగారు నాకు బోలెడంత ఆకలి వేస్తుంది. అందుకే ఏమైనా చేసుకొని తిందామని కిచెన్‌కి వచ్చా అని అంటుంది. దాంతో రామరాజు వేదవతి, నర్మద, ప్రేమల్ని పెద్ద పెద్దగా పిలుస్తాడు. బయట ఉన్న ముగ్గురు ఏంటి ఇలా అరుస్తున్నారు అని పరుగులు తీస్తారు. 

వేదవతి వాళ్లు రావడంతో మీకు బుద్ధుందా.. ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారు కడుపుతో ఉన్న ఆడపిల్లకి ఏం కావాలో చూసుకోవాలని తెలీదా అని అడుగుతాడు. మాకు పిలవాలి కదా నీకు ఎవరు కిచెన్‌లోకి వెళ్లమన్నారు అని వేదవతి అంటే ముగ్గురికి పిలిచాను.. మీరు ముగ్గు వేసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అని అంటుంది. మనల్ని ఎప్పుడు పిలిచింది అని ముగ్గురు అనుకుంటారు. రామరాజు ఓ బెల్ తీసుకొచ్చి వల్లీ చేతికి ఇచ్చి ఇది నువ్వు సౌండ్ చేస్తే ముగ్గురిలో ఎవరో ఒకరు వస్తారు అని చెప్తాడు. వల్లీ ముగ్గురిని వంట గదిలోకి పంపి బెల్ కొడుతుంది. ముగ్గురు వచ్చి ఏమైంది అని అంటే నాకు బాగా ఆకలి అని అంటుంది. ఇక్కడే ఉన్నాం చెప్పొచ్చు కదా అని అంటే టెస్ట్ చేస్తున్నా అని అంటుంది. ముగ్గురు వల్లీ కోసం రకరకాల టిఫెన్లు చేస్తారు. అది కావాలి ఇది కావాలి అని వల్లీ నర్మద, ప్రేమల్ని తిప్పుతుంది. దాని వాలకం చూస్తుంటే కావాలనే చేస్తున్నట్లు ఉందని ప్రేమ అంటే పోనీలెండే కడుపుతో ఉంది కదా వదిలేయండి అని వేదవతి అంటుంది. 

ధీరజ్ బాధ పడుతూ ఉంటే వాడిని ఆ మూడ్ నుంచి మార్చాలి అనుకుంటూ ప్రేమ ధీరజ్ దగ్గరకి వెళ్లి రేయ్ నా తల తుడవరా అంటుంది. నీకు బుద్ధుందా నేను నీ తల తుడవటం ఏంటే అని ధీరజ్ అంటే బుక్ చేసేయ్‌రా మా పుట్టింటికి టికెట్ బుక్ చేసేయ్‌రా అని ప్రేమ అంటుంది. ఈ ఇంటి ఎదురుగానే మీ పుట్టిళ్ల ఉంది కదా.. ఏదో ఫారెన్‌లోనే పరాయి రాష్ట్రంలో ఉన్నట్లు టికెట్ బుక్ చేయడం ఏంటి అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 

టాప్ హెడ్ లైన్స్

Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget