Illu Illalu Pillalu Serial Today July 24th: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: నర్మద, ప్రేమలకు వల్లి టార్చర్! ఇంట్లో కొత్త రూల్స్, శిక్షలు!
Illu Illalu Pillalu Serial Today Episode July 24th శ్రీవల్లి నర్మద, ప్రేమల్ని టార్చర్ చేయడం, ఇంటిలో అందరూ తనని చెప్పి బయటకు వెళ్లాలని రూల్స్ పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode శ్రీవల్లి తోడికోడళ్ల మీద తన శాడిజం మొదలు పెడుతుంది. ప్రేమ ముఖం మీద నీళ్లు విసిరేసి నిద్ర లేపి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేయమని అంటుంది. అవన్నీ నా వల్ల కాదు అని ప్రేమ అంటే మామయ్య గారికి చెప్తానని శ్రీవల్లి బెదిరిస్తుంది. దాంతో ప్రేమ ఏం చేయలేక వెళ్తుంది.
శ్రీవల్లి తనతో తాను ఈ కుందేలు చెవులు విరిచేశాం ఇక ఆ పోట్ల గిత్త నర్మద కొమ్ములు విరిచేస్తే ఓ పనైపోతుంది అనుకుంటుంది. నర్మద ఆఫీస్‌కి లేటు అయిపోతుందని త్వరగా రెడీ అవ్వాలని స్నానానికి వెళ్తుంది. వేడి నీటి కోసం గీజర్ ఆన్ చేస్తుంది. కానీ ఆఫ్‌లో ఉంటుంది. బయటకు వెళ్లి చూస్తే స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఎవరు ఆపేసుంటారని నర్మద అనుకుంటే నేను అంటూ శ్రీవల్లి ఎంట్రీ ఇస్తుంది. కంట్రోల్ కంట్రోల్‌లో పెడుతున్నా అంటుంది. ఏంటి అని నర్మద అంటే కరెంట్ బిల్‌ని కంట్రోల్ చేస్తున్నా.. నీలాగే అందరూ గీజర్ వేసేస్తే కరెంట్ బిల్ తడిచి మోపెడవుతుంది. అందుకే ఈ రోజు నుంచి మామయ్య, అత్తయ్య తప్ప ఇంట్లో అందరూ చల్లని నీటితోనే స్నానం చేయాలి అంటుంది.
నర్మద వల్లితో నాకు చిన్నప్పటి నుంచి వేడి నీరే అలవాటు అంటుంది. ఎక్కువ మాట్లాడకు అక్క అంటుంది. దానికి వల్లి ఎక్కువ మాట్లాడట్లేదు.. మామయ్య గారు చెప్పిన రూల్స్ చెప్తున్నా ఇక నుంచి నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నా అంటుంది. దానికి నర్మద మామయ్య గారు నీకు ఇచ్చిన పెత్తనం ఇచ్చారు కదా అని దాన్ని వాడుకొని నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోను అని అంటుంది. ఏం చేయాలో అది చేసుకో కానీ ఇవే మాటలు మామయ్య గారికి చెప్పు అంటుంది. దాంతో నర్మద నువ్వు ఎక్కువ చేస్తున్నావ్ టైం వస్తుంది అప్పుడు చెప్తా నీ పని అని అంటుంది.
ప్రేమ బయట వాకిలి ఊడ్చి తిప్పలు పడుతూ కల్లాపి చల్లుతుంది. ఇక చల్లని నీటితో నర్మద స్నానం చేసి వణుకుతూ వస్తే వల్లి నర్మదని ఉడికిస్తుంది. నర్మద వల్లితో ఎగురు ఎగురు అన్నీంటికీ సమాధానం చెప్పకపోతే నా పేరు నర్మదే కాదని అంటుంది. శ్రీవల్లి అత్తని చూసి నర్మదతో నువ్వు నాకు ఎదురు చెప్పడం అంతే మామయ్య గారి మాటకి ఎదురు చెప్పడమే అని అంటుంది. ఇక వేదవతి ప్రేమ ముగ్గు పెట్టడం చూసి ఏం చూడనట్లు వెళ్లిపోతుంది. వల్లి చూసి అత్తయ్య గారు కూడా ఏం అనడం లేదు మామయ్య గారి పేరు వాడేసి ఇద్దరితో ఆడుకోవాలి అనుకుంటుంది.
శ్రీవల్లి దేవుడికి పూజ చేస్తుంది. వేదవతి దేవుడికి దండం పెడుతుంది. నర్మద, ప్రేమలు కూడా దండం పెట్టుకుంటారు. అత్త దగ్గరకు వెళ్లి మీరు రోజు పూజ చేసి మామయ్య గారికి తాళాలు ఇచ్చేవారు ఈ రోజు నేను పూజ చేయాల్సి రావడం బాధగా ఉంది కానీ మామయ్య గారి మాట దాటలేక ఇలా చేస్తున్నా నన్ను అర్థం చేసుకోండి అని నటిస్తుంది. ప్రేమ నర్మదతో చూడక్కా దీని ఊసరవెల్లి నాటకాలు.. పెత్తనం వచ్చినందుకు తెగ సంబరపడిపోతూ మనల్ని టార్చర్ చేస్తూనే అత్తయ్యని బుట్టలో వేసుకోవాలని తెగ నటించేస్తూ మొసలి కన్నీళ్లు కార్చుతుందని అంటుంది. దానికి నర్మద నిన్నటి నుంచి దాని అసలు రంగు బయట పెట్టింది.. తన ఫ్యామిలీ కోసం గుట్టు రట్టు చేస్తే సరిపోతుందని అంటుంది.
శ్రీవల్లి వేదవతితో ఈ పరిస్థితికి ప్రేమనే కారణం అని అంటుంది. ప్రేమ వల్లితో అమ్మా తల్లీ ముందు పూజ చేయ్ తర్వాత నా మీద తాలింపు వేద్దువు అంటుంది. శ్రీవల్లి నీ వల్లే ఇదంతా అని అంటుంది. నర్మద వల్లితో అమ్మా తల్లీ నీకు అంటే ఏం పనీ పాట లేదు మేం ఆఫీస్‌కి వెళ్లాలి త్వరగా పూజ పూర్తి చేయమని అంటుంది. అత్త చెప్పడంతో వల్లి పూజ చేస్తుంది. వల్లి తాళాలు పట్టుకొని చూస్తూ మురిసిపోతుంటే నర్మద జాగ్రత్త మింగేస్తామో అంటుంది. వల్లి చూడగానే ప్రేమ జాగ్రత్త జుట్టు నోట్లోకి వెళ్లిపోతుందని అంటుంది. నర్మద పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది.
రామరాజు వల్లీకి బ్యాగ్, తాళాలు ఇవ్వమని అంటాడు. వల్లీ తాళాలను నడుముకి తగిలించుకుంటుంది. ఇక మామయ్యకి తాళాలు ఇస్తుంది. మామయ్యతో మామయ్యగారండీ ఇంటికి సంబంధించిన రూల్స్ అన్నీ మీ ముందే చెప్పేస్తా మీరు ఉంటే బాగుంటుందని అంటుంది. రామరాజు సరే చెప్పమ్మా అంటాడు. శ్రీవల్లి ఇంట్లో ఇన్ని గొడవలు జరగడానికి కారణం ప్రేమ ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి డ్యాన్స్ క్లాస్‌లకు వెళ్లడమే అని అంటుంది. అయిపోయిన విషయం ఎందుకు అని ప్రేమ అంటే అయిపోలేదు అక్కడే అసలు కథ మొదలైంది.. ఈ ఇంట్లో వాళ్లు ఎవరి ఇష్టారీతిన ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లడానికి వీళ్లేదు.. నాకు చెప్పే వెళ్లాలి..రాత్రి పది గంటల తర్వాత ఎవరు ఇంటికి వచ్చినా మెయిన్ డోర్ తీసే పని లేదు.. ఇది ఉమ్మడి కుటుంబం కాబట్టి అందర్నీ దారిలో పెట్టాలని నేను మామయ్య ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నామని అంటుంది. రూల్స్ అతిక్రమిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని మామయ్య గారు చెప్పారని అంటుంది. అంతే కదండీ మామయ్య గారండీ అంటే ఊ అని రామరాజు అంటాడు.
శ్రీవల్లి అందర్నీ ఎక్కడికి వెళ్తున్నారు చెప్పి వెళ్లమని ఒక్కొక్కరిని అడుగుతుంది. అమూల్య, ధీరజ్‌లు కాలేజ్‌కి వెళ్తున్నామని.. చందు ఆఫీస్‌కి వెళ్తున్నానని సాగర్, తిరుపతి రైస్ మిల్‌కి వెళ్తున్నామని చెప్తారు. ఇక ప్రేమతో చెప్పమ్మా ప్రేమమ్మా అని అడుగుతుంది. దానికి ప్రేమ కోపంగా కోచింగ్‌కి వెళ్తున్నా అని అంటుంది. ఎంత టైంలో వస్తున్నావ్ అని అడుగుతుంది. రెండు గంటలు అని ప్రేమ అంటే కచ్చితంగా రెండు గంటల్లో ఇంట్లో ఉండాలి అంతే అంటుంది. నీవల్లే ఇదంతా కాబట్టి నీ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుందని జాగ్రత్త అని అంటుంది. ఇక శ్రీవల్లి నర్మదని అడుగుతుంది. నర్మద నీకు చెప్పాల్సిన అవసరం నాకులేదు అని అంటే నువ్వు డైరెక్ట్‌గా మామయ్య గారిని అంటున్నావ్ అంటుంది. దాంతో నర్మద ఆఫీస్‌కి వెళ్తున్నా అని చెప్తుంది. అందరూ తన మాట వింటున్నారని గెంతులేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















