Guppedantha Manasu మే 3 ఎపిసోడ్: వసుధార ఏం చెప్పబోతుంది- రిషికి షాక్ ఇస్తుందా? సీరియల్ మరో టర్నర్ తీసుకుంటుందా?
గుప్పెడంత మనసు సీరియల్‌లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ మంచి ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. వసుధార కోసం రిషి...రిషి కోసం సాక్షి చేస్తున్న ప్రయత్నాలు ఇంట్రస్టింగ్‌గా సాగుతున్నాయి.
![Guppedantha Manasu మే 3 ఎపిసోడ్: వసుధార ఏం చెప్పబోతుంది- రిషికి షాక్ ఇస్తుందా? సీరియల్ మరో టర్నర్ తీసుకుంటుందా? Guppedantha manasu May 3rd Episode 440, Know today Episode In Details Guppedantha Manasu మే 3 ఎపిసోడ్: వసుధార ఏం చెప్పబోతుంది- రిషికి షాక్ ఇస్తుందా? సీరియల్ మరో టర్నర్ తీసుకుంటుందా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/03/7fdc7b3b2da0dcea3e97a007ecb259b5_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నేను టెన్షన్ పడుతుంటే నువ్వు హ్యాపీగా ఆడుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు రిషి. మీ పెద్దమ్మ ప్రశ్నలకు సమాధానం దొరకదనే ఇక్కడికి వచ్చేశానని చెబుతుంది వసుధార. అసలు ఆ ప్లేస్ ఎలా కనిపెట్టాడో చెప్తాడు రిషి. తర్వాత తన రూమ్‌కి రిషిని తీసుకెళ్తుంది వసుధార.
సాక్షిని ఆయుధంగా ఎలా వాడాలో ఆలోచిస్తుంది దేవయాని. ఇంతలో సాక్షినే ఫోన్ చేస్తుంది దేవయానికి. కాలేజీలో జరిగింది చెప్తుంది. రిషిని బుట్టలో వేసుకోవడానికి ఏం చేయాలో దేవయాని చెబుతుంది.
తన కొత్త రూమ్‌కి రిషిని తీసుకెళ్తుంది వసుధార. ఎందుకు నాకు చెప్పాలని పించలేదా అని అడుగుతాడు రిషి. అక్కడి మాటలు అక్కడే వదిలేయండని వసుధార చెబుతుంది. నీ జీవిత లక్ష్యం మరచిపోకని రిషి సూచనలు ఇస్తాడు. ఇద్దరూ కలిసి అల్లం టీ తాగుతారు. కాలేజీలో కలుద్దామని వెళ్లిపోతాడు రిషి.
జగతి, మహేంద్ర ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటారు. రిషి భవిష్యత్ గురించి మాట్లాడుకుంటారు. సాక్షి వచ్చాక హర్ట్ అయ్యి ఎక్కడికి వెళ్లాడో అని తెలుసుకోమంటుంది జగతి. ఇంతలో కారు వచ్చి ఆగుతుంది. ఇద్దరూ వెళ్లి చూస్తారు. మంచి హుషారుగా వస్తుంటాడు రిషి. చూసి షాక్ అవుతారు. చాలా మంచి టీ తాగానని ఇప్పటిలో టీ అవసరం లేదని వదిన ధరణికి చెప్తాడు రిషి.
ఏంటో ఉత్సాహంగా కనిపిస్తున్నావని రిషిని మహేంద్ర అడుతాడు. మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని చెప్పి వెళ్లిపోతూ.. మీరూ వెళ్లి అల్లం టీ తాగండని చెప్తాడు రిషి. వసుధారను కలిసి ఉంటాడని జగతి, మహేంద్ర ఇద్దరూ అనుకుంటారు. రిషి మొహం చూస్తే వసుధార సంతోషంగా ఉందని తెలుస్తుందని అంచనాకు వస్తారు.
మార్నింగ్ తమ బెడ్‌రూంలో మాట్లాడుతుంటారు మహేంద్ర, జగతి. ఇంతలో వసుధారకు జగతి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావ్ ఎలా ఉన్నావ్ అని ఆరా తీస్తుంది జగతి. మహేంద్ర, జగతి కలిసి వసుధార గురించి ఆరా తీస్తారు.
గౌతమ్ తన రూంలో వసుధార స్కెచ్ చూసి మురిసిపోతుంటాడు. ఎక్కడికి వెళ్లావో... దర్శనం లేదని అంటా ఉంటాడు. ఇంతలో రిషి వచ్చేషాక్ ఇస్తాడు. స్కెచ్‌ను చూసి ఏంటని ప్రశ్నిస్తాడు. కాసేపు వసుధార అందం గురించి వివరిస్తుంటాడు గౌతమ్. రిషికి మండుతుంటుంది. వసుధారను చాలా మిస్ అవుతున్నానని గౌతమ్ చెప్తాడు. ఇంతలో సాక్షి ప్రస్తావన తీసుకొస్తాడు గౌతమ్. అంతే రిషి మొహం ఒక్కసారిగా మారిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ అయిపోతుంది..
రేపటి ఎపిసోడ్
బస్తీలో వసుధార కోసం కారుతో వెయిట్ చేస్తుంటాడు రిషి. వసుధార చూసి కాస్తే ఆశ్చర్యపోతుంది. మీకో విషయం చెప్పాలని ఊరిస్తుంటుంది. ఏంటని కాస్త ఆత్రుత పడుతుంటాడు రిషి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)