By: ABP Desam | Updated at : 28 Apr 2022 06:31 AM (IST)
Guppedantha Manasu 28th April 436 (Image Credit: Star Maa/Hot Star)
వసుధారను ఎందుకు తీసుకొచ్చావని రిషిని మహేంద్ర అడుగుతాడు. జగతి వారిస్తున్న ఆగడు. దేవయాని సోపోర్ట్ చేస్తుంటుంది. జవాబు చెప్పాలని నిలదీస్తుంది. ఈ పరిస్థితి చూసి వసుధార వెనక్కి వెళ్లిపోతుంది. ఆమెను చేయి పట్టుకొని ఆపుతాడు రిషి. నువ్వు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదని చెప్తాడు. ఆమె చేతిలోని బ్యాగ్ తీసుకొని.. చేయి పట్టుకొని పెద్దమ్మ దగ్గరకి తీసుకొచ్చి వసుధార ఇక్కడే ఉంటుందని చెప్తాడు. ఆమె ఇంకా ఏదో చెప్తుండగా ఫణీంద్ర కలుగు జేసుకొని ఏదైనా పొద్దున్న మాట్లాడుకుందామంటూ రిషిని పంపించేస్తాడు. అసలు ఎవరికి ఏదీ అర్థం కాదు. అందరూ క్వశ్చన్ మార్క్ ఫేస్‌లు పెట్టి చూస్తుంటారు. ఏమైందో వసుధారను అడిగి ధరణికి చెప్తాడు ఫణీంద్ర.
వసుధార వద్దకు వచ్చి జగతి అన్ని విషయాలు తెలుసుకుంటుంది. జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. ఇదంతా కావాలనే ఎవరో చేస్తున్నారని ఇద్దరిలో అనుమానం మొదలైంది. మహేంద్ర, ధరణి కూడా వస్తారు. జరిగింది తెలుసుకొని ధైర్యం చెప్తారు. వసుధార, ధరణి వెళ్లిపోయాక హాల్‌లో జరిగిన వాగ్వాదం గురించి మహేంద్రను అడుగుతుంది జగతి. తాను అడిగిన ప్రశ్నలు సమాధానాలు దాట వేసే ప్రశ్నలని, కచ్చితంగా సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు అంటాడు. ఇంకా ఎవరైనా అడగకుండా ముందు జాగ్రత్త అంటాడు.
వసుధార విషయంలో రిషి చేసిందాన్ని గౌతమ్ కూడా తప్పుపడతాడు. గౌతమ్‌పై కోప్పడతాడు. ఇప్పుడు వివరణలు అవసరం లేదని గదమాయిస్తాడు. ఇంతలో అక్కడకు వచ్చిన మహేంద్ర ఎంత మంది నోళ్లు మూయిస్తావని నిలదీస్తాడు. వదిన అలా అడిగితే నాక్కూడా డౌట్స్ వచ్చాయని అడుగుతాడు. సాయం చేస్తే ఇన్ని అనుమానాలా అని ఆశ్చర్యపోతాడు రిషి. ఇది అందరి అనుమానం అన్న మహేంద్ర, ఈ విషయంలో నీకు క్లారిటీ ఉండాలి అంటాడు. నీకు నీవే ప్రశ్నించుకో అని వెళ్లిపోతాడు.
అందరూ వెళ్లిపోయాక రిషి ఆలోచనలో పడతాడు. వసుధార మంచి చెడులు ఆలోచించడానికి ఆమెపై ఉన్నది ప్రేమా... బంధమా, స్నేహమా అంటూ ఆలోచనల్లో మనిగిపోతాడు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా ఏదో రోజు నాకు నేను చెప్పుకోవాలి కదా అనుకుంటాడు. ఇదేంటీ నా మనసులో ఉన్నది ఏదో చదివినట్టు జగతి మేడం ఎప్పుడో చెప్పేశారు. నిజంగానే వసుధారను ప్రేమిస్తున్నానా అనే ఊగిసలాటతో ఆ సీన్ ముగుస్తుంది.
కిచన్‌కి వసుధారతో కలిసి వస్తాడు రిషి. నీకు ఇప్పుడు కాఫీ అవసరం ఉందని అంటాడు. ఏదో చెప్తుంటే.. అప్పుడప్పుడు చెప్పింది కూడా అర్థం చేసుకో వసుధార అంటాడు. వసుధార చాలా ఫీల్ అయినట్టు ఉందని... ఎక్కువ మాట్లాడకపోవడమే బెటర్ అనుకుంటాడు రిషి. కాఫీ ఎలా ఉందని అడుగుతాడు. బావుందని చెప్తుంది. దీన్ని దేవయాని చూస్తుంది. అప్పుడు జగతిని ఇంటికి తీసుకొచ్చాడు... ఇప్పుడు జగతి శిష్యురాలిని ఇంటికి తీసుకొచ్చాడని రగిలి పోతుంది. వెంటనే జగతికి ఫోన్ చేస్తుంది.. ఎలా ఉన్నావని ఆరా తీసి సంతోష పడుతున్నావా అని అడుగుతుంది. వసుధార రమ్మంటుందని చెప్తుంది. ఈవిడ కొత్త తలనొప్పి తెచ్చినట్టు ఉందని అనుకొని వసుధార రూమ్‌కి బయల్దేరుతుంది.
వసుధార రూమ్‌కి వెళ్లి రమ్మన్నావంటా అని జగతి అడుగుతుంది. లేదని సమాధానం చెప్పే లోపు దేవయానికి అక్కడకు వస్తుంది. నేనే పిలిచానని చెప్తుంది. ఎపిసోడ్ పూర్తవుతుంది.
రేపటి ఎపిసోడ్
వసుధార రూమ్‌లో ముగ్గురి మధ్య డిస్కషన్ జరుగుతుంది. సూటిపోటి మాటలతో హింసిస్తుంది దేవయానికి. వాటిని తట్టుకోలేక ఇంటి నుంచి బయల్దేరుతుంది వసుధార. ఇంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు. వసుధారను పిలుస్తాడు.
Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్
Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?
Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి
Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య
Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?
Russia Ukraine War : ఉక్రెయిన్పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!
Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !