అన్వేషించండి

Guppedanta Manasu Serial Today May 29th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మను తండ్రి గురించి ఆరా తీసిన మహేంద్ర – చెడామడా తిట్టేసిన అనుపమ

Guppedanta Manasu Today Episode: మను తండ్రి గురించి ఆరా తీస్తున్న మహేంద్రను అనుపమ చెడామడా తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: ఎంజేల్‌ మనుకు కన్ను కొడుతుంది. దీంతో మను ఇక్కణ్నుంచి వెళ్లిపో అంటాడు. తాను వెళ్లనని నువ్వు నా అత్తకొడుకువి అని చెప్తుంది. నీ మూడు చేంజ్‌ చేద్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. దీంతో నేను అందరిలాంటి వాణ్ని కాదని నీ ఉద్దేశ్యం ఏంటో నాకు అర్థం అయిందని నా జీవితంలో ఎవ్వరికీ చోటు లేదని చెప్తాడు. ఇది అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్తాడు మను. వెళ్లకపోతే ఏం చేస్తావు అని అడుగుతుంది ఎంజేల్‌. అయితే నేనే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అని మను అనగానే ఎంజేల్‌ సరేలే నేనే వెళ్లిపోతాను అంటూ అక్కడి నుంచి బయటకు వస్తుంది. బయట ఎంజేల్‌, మనులను గమనిస్తున్న వసుధార ఎంజేల్‌ను మనుపై నీ అభిప్రాయం ఏంటని అడుగుతుంది. దీంతో చాలా మంచి వాడని కానీ ఎప్పుడూ మూడీగా ఉంటాడని  ఎంజేల్‌ చెప్తుంది. తర్వాత మహేంద్ర, వసుధార, మను వాళ్ల బామ్మ దగ్గరకు వెళ్తారు.

బామ్మ: చెప్పండి మహేంద్ర గారు ఏదో అర్జెంట్‌గా మాట్లాడాలి అని చెప్పారు. ఏ విషయం గురించి

మహేంద్ర: మను గురించి..

బామ్మ: మను గురించా? ఏం మాట్లాడాలి?

మహేంద్ర: నేను తండ్రి స్థానంలో ఉండి మనుకు ఒక మాటిచ్చాను.

 అని మహేంద్ర చెప్పగానే నువ్వు తండ్రి స్థానంలో ఉండటం ఏంటి? నువ్వేగా వాడి తండ్రివి అని మనసులో అనుకుంటుంది. మను కన్నతండ్రిని తీసుకొస్తానని మనుకు నేను మాటిచ్చాను అని చెప్తాడు. దీంతో బామ్మ షాక్‌ అవుతుంది. నా దగ్గరున్న ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పాలని మహేంద్ర అడుగుతాడు.  మీకు మను తండ్రి ఎవరో తెలిస్తే చెప్పండి అని సూటిగా అడుగుతాడు మహేంద్ర.

మహేంద్ర: అనుపమకు పెళ్లి కాలేదు కదా

బామ్మ: అవును కాలేదు..

మహేంద్ర: మరి అనుపమను మోసం చేసింది ఎవరు నాకు చెప్పండి వాడు ఎక్కడ ఉన్నా కాలర్‌ పట్టుకుని తీసుకొస్తాను.

బామ్మ: కన్నతల్లే తండ్రి గురించి చెప్పనప్పుడు నేనెందుకు చెప్పాలి.

మహేంద్ర: ప్లీజ్‌ మను బాధ మీరు చూడటం లేదా? మను తండ్రి ఎవరో నాకైనా చెప్పండి

బామ్మ: నేను చెప్పను చెప్పలేను..

 అనగానే అక్కడికి అనుపమ వస్తుంది. నీకేం చెప్పాలని నిలదీస్తుంది. ఏకంగా ఇప్పుడు మా పెద్దమ్మ దగ్గరకు వచ్చావు నీకు ఎలా చెప్పాలి అంటూ కోప్పడుతుంది. దీంతో వాడ్ని పాతికేళ్లు పెంచిన తల్లే చెప్పడం లేదు అని బామ్మ అనగానే దీంతో మహేంద్ర పెంచిన తల్లా? అని డౌట్‌ పడతాడు. దీంతో అనుపమ మహేంద్ర మీద కోప్పడుతుంది. ఇంకా ఇక్కడే ఉంటే గొడవ పెద్దది అయ్యేలా ఉంది అని మనసులో అనుకుని మహేంద్రను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార.

మహేంద్ర: మను మనకు ఎంత సాయం చేశాడు. నువ్వు తనని అపార్థం చేసుకున్నా తను మాత్రం నీకు గౌరవం ఇస్తూనే వచ్చాడు.

వసు: నేను కాదనడం లేదు మామయ్య. మను వ్యక్తిత్వం గురించో మంచితనం గురించో చెప్పడం లేదు. తన పర్సనల్‌ విషయంలోకి వెళ్లొద్దు అంటున్నాను.

మహేంద్ర: మన అవసరాల కోసం తనని ఉపయోగించుకుని.. తర్వాత వదిలేద్దాం అంటున్నావా?

అంటూ మహేంద్ర అనగానే మీతో నెనెప్పుడూ ఇలా ఆర్గ్యూ  చేశానా అర్థం చేసుకోండి అని వసు అనగానే మను తండ్రి ఎవరో నీకు తెలుసు కదా? అంటే అనుపమ నీకు చెప్పింది కానీ తన కొడుకుకు చెప్పలేదంటే అంటూ అడుగుతాడు. దీంతో వసు మహేంద్రను మీరు మళ్లీ  కాలేజీకి రండి అని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: 'టిల్లు 3’లో రాధిక ఉంటుందా? - నేహా శెట్టి సమాధానం ఇదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Balagam Mogilaiah: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Balagam Mogilaiah: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Look Back 2024: అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
Jammu And Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌, ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం  
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌, ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం  
Oil Pulling Benefits : ఆయిల్ పుల్లింగ్ రోజూ చేస్తే కలిగే లాభాలివే.. అందానికి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటోన్న నిపుణులు
ఆయిల్ పుల్లింగ్ రోజూ చేస్తే కలిగే లాభాలివే.. అందానికి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటోన్న నిపుణులు
Embed widget