అన్వేషించండి

Guppedanta Manasu Serial Today July 17th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మహేంద్రను ఇంటికి తీసుకొచ్చిన ఫణీంద్ర – సరోజ పెళ్ళిచూపులు చెడగొట్టేందుకు బుజ్జి ప్లాన్

Guppedanta Manasu Today Episode:

Guppedanta Manasu  Serial Today Episode: పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని పెళ్లిచూపులకు వచ్చే ఎవరినైనా ఊరి పొలిమేరల్లోనే పాతిపెడతానని రంగతో  కరాకండిగా చెప్పి వెల్లిపోతుంది సరోజ. మరోవైపు శైలేంద్ర, దేవయానితో బాధపడతాడు. అసలు ఎండీ సీటులో కూర్చునే యోగ్యత ఉందో లేదోనని డౌట్‌ వస్తుందని బాధపడతాడు. ఇంతలో ధరణి వస్తుంది.

ధరణి: నేను ఎప్పుడో చెప్పాను కదా? ఎండీ పదవి చేపట్టాలంటే మంచి చెడు తెలియాలి. చాకచక్యంగా ఎదుటివాళ్లతో మసులుకోవాలి. టైం పంక్చువాలిటీ ఉండాలి. కానీ మీలాగా కుట్రలు పన్నుతూ కుతంత్రాలు చేసేవాళ్లకు ఆ అర్హత ఉండదు.

దేవయాని: ఏ ధరణి నిన్నేం చేయలేనని అనకుంటున్నావా?  నువ్వు నా కొడలివి అని ఊరుకున్నాను

అని దేవయాని, ధరణికి వార్నింగ్‌ ఇస్తుంటే ఫణీంద్ర, మహేంద్రను తీసుకుని ఇంటికి వస్తాడు.

మహేంద్ర: అన్నయ్యా ప్లీజ్‌ నేను ఇక్కడ ఉండలేను. నా దారిన నన్ను వదిలేయండి

ఫణీంద్ర: అదేం కుదరదు మహేంద్ర నీ దారిన నిన్ను వదిలేయడం ఏంటి? నువ్వు నా తమ్ముడివి నువ్వు బాధపడుతూ అక్కడ ఒంటరిగా ఉండటం నేను చూస్తూ ఉండలేను. దేవయాని శైలేంద్ర ఇక నుంచి మహేంద్ర మనతోనే ఉంటారు.

దేవయాని: ఎవరు వద్దంటారండి. నేను కూడా చాలా సార్లు పిలిచాను కానీ అప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు వచ్చాడు.

ఫణీంద్ర: సరే మీరు మహేంద్ర ముందు అనవసరమైనవి మాట్లాడినా ఆరా తీసినా నేను ఊరుకోను.

అని చెప్పి ఫణీంద్ర వెళ్లిపోతాడు. శైలేంద్ర, దేవయాని హ్యాపీగా ఫీలవుతారు. ఈసారి మన గోల్‌ అస్సలు మిస్‌ అవ్వకూడదని అనుకుంటారు. మరోవైపు బుజ్జిని తీసుకుని పక్కకు వెళ్లిన సరోజ నా పెళ్లిచూపులు ఆపడానికి ఏదైనా ప్లాన్‌ ఉంటే చెప్పమని అడుగుతుంది. బుజ్జి ఏవేవో ఐడియాలు చెప్తుంటే సరోజ తిడుతుంది. అవన్నీ వద్దు కానీ నేను బావను ప్రేమిస్తున్నానని వాళ్లకు హింట్‌ ఇద్దామని అంటుంది. మరోవైపు రంగానే చూస్తూ ఉన్న వసుధారను

రంగ: ఏంటి మేడం గారు అలా చూస్తున్నారు. మీరు ఏం అనుకుంటున్నారో నేను చెప్పనా?

వసుధార: చెప్పండి సార్‌

రంగ: ఇంతకు ముందు నేను సరోజతో చెప్పిన మాటలు అచ్చం మీ రిషి సార్‌ మాట్లాడినట్టే ఉన్నాయని అనుకుంటున్నారు కదా?

వసుధార: అవును సార్‌ అవి మాటలు కాదు మన జీవితంలో జరిగిన సంఘటనలు సార్‌.

రంగ: ఇక చాలు ఆపుతారా? అసలేంటండి మీరు నేనేం చేసినా ఏం చెప్పినా మీ రిషి సార్‌తో ముడిపెడతారు. అసలు ఏంటి మేడం మీ రిషి సార్‌ గొప్ప. ఇంతకీ మీది లవ్‌ మ్యారేజా? అరెంజ్డ్‌ మ్యారేజా?

  అని రంగ అడగ్గానే వసుధార రంగ మీద కోప్పడుతుంది. మనం ఎలా పెళ్లి చేసుకున్నామో మీకు తెలియదా? అంటూ నిలదీస్తుంది. దీంతో రంగా అమ్మో మీతో ఏం మాట్లాడినా ఇబ్బందే అని లోపలికి వెళ్లిపోతాడు. మరోవైపు మహేంద్ర, అనుపమ తన నుంచి దూరం కావడానికి మీరే కారణం అని దేవయానితో అంటాడు.

దేవయాని: ఏంటి మహేంద్ర నన్ను అనుమానిస్తున్నావా?

మహేంద్ర: మిమ్మల్ని అనుమానించకపోతే తప్పు కానీ అనుమానించడంలో ఆశ్యర్యం ఏముంది వదినగారు.

శైలేంద్ర: దిస్ ఈజ్‌ టూ మచ్‌ బాబాయ్‌. మామ్‌తో నువ్విలా మాట్లాడం కరెక్టు కాదు. కనీసం వదిన అన్న రెస్పెక్ట్‌ అని లేకుండా మాట్లాడుతున్నావు.

మహేంద్ర: రెస్పెక్ట్‌ ఉంది కాబట్టే వదిన గారు అని గౌరవంగా పిలుస్తున్నాను. నువ్వే రెస్పెక్ట్‌ లేకుండా నన్ను నువ్వు అని పిలుస్తున్నావు.

అనగానే శైలేంద్ర అనుపమ వెళ్లిపోతే మాకేం సంబంధం అంటాడు. పొద్దున లేచిన దగ్గర నుంచి నీతో కలిసుండే అనుపమ సీక్రెట్స్‌ నీకే తెలియనప్పుడు మాకెలా తెలుస్తాయని దేవయాని ప్రశ్నిస్తుంది. అవునవును మీకెలా తెలుస్తాయి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు మహేంద్ర. ఇంతలో ధన్‌రాజ్ శైలేంద్రకు ఫోన్‌ చేసి తన పెళ్లి విషయంలో హెల్ప్‌ చేయాలని అడుగుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget