అన్వేషించండి

Guppedanta Manasu Serial Today July 13th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మనుతో కలిసి ఎక్కడికైనా వెళ్లిపోతానన్న అనుపమ – రంగా ఇంట్లోనే సెటిల్ అయిన వసుధార

Guppedanta Manasu Today Episode: దేవయాని వార్నింగ్ ఇవ్వడంతో మనును తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనుపమ నిర్ణయించుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: శారీలో వచ్చిన వసుధారను చూసి రంగ ఈ శారీ మీకు బాగుంది.. ఇది ఎప్పుడు కొన్నారు అని అడుగుతాడు. ఉదయం సరోజ గిఫ్టుగా ఇచ్చింది ఇదే శారీ అని వసుధార చెప్పడంతో సరోజ షాక్‌ అవుతుంది. సరోజ ఇచ్చిన శారీనా చాలా బాగుంది అంటాడు రంగ.

సరోజ: ఏయ్‌ మళ్లీ ఎందుకు వచ్చాను. హైదరాబాద్‌లో చూడటానికి చాలా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ అక్కడే ఉండకా మళ్లీ ఎందుకొచ్చావు. బావ దీన్ని మళ్లీ ఎందుకు తీసుకొచ్చావు.

వసుధార: హలో నీ ప్రాబ్లమ్‌ ఏంటి? ఈ ఊరికి బయటి వాళ్లు రాకూడదని ఏమైనా రూల్‌ ఉందా? ఎవరైనా ఎక్కడైనా బతికే హక్కు ఉంది.

సరోజ: అయితే ఎక్కడైనా బతుకొచ్చు కదా? మా ఊరికి ఎందుకు వచ్చావు. మా బావ ఇంటికి ఎందుకు వచ్చావు.

వసుధార: నేనేం ఊరికే రాలేదు. మీ బావ ఇంట్లోనే టెర్రస్‌ మీద అద్దెకు ఉంటున్నాను.

సరోజ: అద్దెకు ఉంటున్నావా? నీ ముష్టి అద్దె మాకేం వద్దులే

వసుధార: ఆవేశపడకు సరోజ. ఆల్‌రెడీ రెంట్‌కు ఉంటున్నట్లు అగ్రిమెంట్‌ కూడా అయింది.

  అనగానే సరోజ కోపంగా తిడుతూ రంగాను ఎందుకు అద్దెకు ఇచ్చావని అడుగుతుంది. మీ నాన్నకు వడ్డీ డబ్బులు ఇవ్వడానికి మాకు డబ్బులు కావాలి కదా ఈ రకంగానైనా మాకు డబ్బులు మిగులుతాయి కదా అంటాడు రంగ. మేడం గారు ఇక్కడే ఉంటారు అని చెప్పి వెళ్లిపోతాడు రంగ. ఎందుకు సరోజ నామీద నీకు అంత కోపం అని నీ బావ రంగా అయితే నన్ను అక్కడే వదిలేసి వచ్చేవారు. కానీ తను నా రిషి సర్‌ అని చెప్పి వసుధార వెళ్లిపోతుంది. మరోవైపు అనుపమ తమ పెద్దమ్మ దగ్గర తనకు ఫోన్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది దేవయాని అని వసుధార వెళ్తూ మనుకు నిజం చెప్పడానికి లెటర్‌ రాసిందని ఆ లెటర్‌ వాళ్లకు దొరికిందని చెప్తుంది. దేవయాని తనకు వార్నింగ్‌ ఇచ్చిందని ఇక తను మను ఇక్కడి నుంచి వెళ్లిపోతామని చెప్తుంది. ఇంతలో మహేంద్ర ఫోన్‌ చేస్తాడు.

మహేంద్ర: ఏంటి అనుపమ ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదు..

అనుపమ: ఏం లేదు..

 మహేంద్ర: సరే ఎక్కడ ఉన్నావు.

అనుపమ: ఉన్నాను..

మహేంద్ర: సరే త్వరగా ఇంటికి రా..

అనుపమ: మహేంద్ర ఇక నుంచి నువ్వు నా కోసం ఎదురుచూడకు.. ఇక నుంచి నువ్వు ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకో.. నేనే నీకు ఫోన్‌ చేస్తాను. నేను రావాలనుకున్నప్పుడే వస్తాను.

ALSO READ: రజినీకాంత్ ఆఫ్‌ స్క్రీన్‌ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా? అంబానీ ఇంట పెళ్లంటే అంతే మరి!

అంటూ ఫోన్‌ కట్‌ చేస్తుంది. తర్వాత మను ఏదో ఆలోచిస్తుంటే మహేంద్ర వస్తాడు.

మహేంద్ర: మను ఎప్పుడొచ్చావు..

మను: ఇప్పుడే వచ్చాను సార్‌

మహేంద్ర: మీ అమ్మ కోసం చూస్తున్నావా? తను ఇంట్లో లేదు. ఫోన్‌ చేసి అడిగితే తను వింతగా మాట్లాడుతుంది. అసలు తను అలా ఎందుకు మాట్లాడిందో నాకు అర్థం కావడం లేదు.

మను: మీరు మేడం గారిని ఏమైనా అన్నారా? సార్‌..

 మహేంద్ర: అలాంటిదేం లేదు మను. అయినా నేను తననెందుకు అంటాను. నేనే బాధలో ఉంటే నాకు అండగా ఉంటున్న తనని నేను కష్టపెడతానా? తను ఎక్కడుందో కూడా చెప్పలేదు.

మను: తను ఎక్కడుంటారో నాకు తెలుసు సార్‌. మీరేం కంగారు పడకండి.

అని మను వాళ్ల బామ్మకు ఫోన్‌ చేసి అనుపమ మేడం ఉన్నారా? అని అడగ్గానే ఉందని చెప్తుంది. దీంతో మహేంద్ర సార్‌ బాధపడతున్నారు ఇక్కడికి రమ్మనండి అని మను చెప్పగానే అనుపమ ఫోన్‌ తీసుకుని నువ్వే ఇక్కడికి రా అంటుంది. మను సరే అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు. మరోవైపు వసుధార చుట్టుపక్కల పేద పిల్లలకు ఉచితంగా ట్యూషన్‌ చెప్తుంది. దీంతో అందరూ వచ్చి వసుధారను మెచ్చుకుంటారు. సరోజ కుళ్లుకుంటుంది. మరోవైపు మను అనుపమ దగ్గరకు వస్తాడు. మనం ఇక్కడే ఉందామని మహేంద్ర దగ్గరకు ఇక వెళ్లొద్దని అనుపమ చెప్పగానే.. ఒంటరిగా ఉన్న మహేంద్ర సార్‌ను నేను వదిలేయలేనని మాట తప్పనని మను చెప్పడంతో.. నువ్విప్పుడు నా మాట వినకపోతే నేను చచ్చినంత ఒట్టు అని అనుపమ అనగానే మను షాక్‌ అవుతాడు.  ఇక్కడితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Embed widget