అన్వేషించండి

Guppedanta Manasu Serial Today July 12th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: రౌడీలను చితక్కొట్టిన వసుధార - వసుధారను శారీలో చూసి షాకైన రంగ

Guppedanta Manasu Today Episode: వసుధారను కిడ్నాపర్లను నుంచి సేవ్ చేయబోయి రంగ ప్రమాదంలో పడిపోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: వసుధారను రౌడీలు కిడ్నాప్‌ చేసి ఒక రూంలో వేసి చంపబోతుంటే రంగ వస్తాడు. రౌడీలను కొట్టి వసుధారను విడిపించుకుని వెళ్తుంటే వెనక నుంచి రౌడీలు రంగాను గట్టిగా కొట్టడంతో రంగా కిందపడిపోతాడు. వెంటనే రంగాను రూంలో వేసి బంధిస్తారు. తర్వాత వసుధారను చంపబోతూ.. ఆగి వసుధార చావడం రంగా చూడాలని ఇద్దరు రౌడీలు రూంలోకి వెళ్లి రంగాను లేపి కిటికీ దగ్గరకు తీసుకొచ్చి పట్టుకుంటారు. కిటికీలోంచి రంగా చూస్తూంటే వసుధారను చంపబోతుంటారు. వసుధార.. రిషి సర్‌ అంటూ ఏడుస్తుంది. ఇంతలో రంగ గట్టిగా చంపేయండి అంటాడు. వసుధార షాక్‌ అవుతుంది.

రంగ: అవును చంపేయండి. భయపడేవాళ్లకి ఈ భూమ్మీద బతకడానికి హక్కే లేదు. చంపేయండి.

వసుధార: రిషి సర్‌

రంగ: అవును చచ్చిపో.. లేదా బతకాలంటే చావుకు ఎదురెళ్లు.. పోరాడు వసుధార.. పోరాడితే పోయేదేం లేదు. ఎదవ ప్రాణాలు తప్పా.. పోరాడు.

 అని చెప్పగానే వసుధార కోపంగా లేచి రౌడీలతో ఫైట్‌ చేస్తుంది.

రంగ: అద్ది.. వసుధార నిన్ను దెబ్బ  కొట్టాలనుకున్నవాడికి నీ పిడికిలి పవర్‌ ఏంటో చూపించు.. నిన్ను అణగదొక్కాలనుకున్న వాణ్ని పాతాళానికి తొక్కేయ్‌.. ఆ టైర్‌ తీసుకుని తిప్పేసెయ్‌..

అని చెప్తుంటే వసుధార రౌడీలను పిచ్చకొట్టుడు కొడుతుంది. వసుధార దెబ్బకు రౌడీలు పారిపోతారు. వసుధార రంగా దగ్గరకు వెళ్తుంది.

వసుధార: సార్‌ మీకు ఏం కాలేదు కదా?.

రంగ: మేడం గారు మీరు చాలా బాగా ఫైట్‌ చేశారు. చాలా రోజుల తర్వాత ఒక మాస్‌ ఫైట్‌ చూశాను. పదండి ఇక... మేడం గారు అటు వెళ్తున్నారు ఏంటి..?

వసుధార: నేను ఎక్కడో ఒక చోటికి వెళ్తాను సర్‌. మీ వెంట అయితే నేను రాలేను సర్‌. వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినదాన్ని అవుతాను. మిమ్మల్ని బాధపెట్టినదాన్ని అవుతాను కదా సర్‌.

రంగ: అదేంటి మేడం అలా అంటున్నారు.

వసుధార: నేను అనడం లేదు సర్‌ మీరు అలా ఫీలవుతున్నారు కదా? పైగా నేను మీ వెంట రాకూడదని మీ మీద ఒట్టేసుకున్నారు కదా?

రంగ: నా మీద నేనే ఎక్కడ ఒట్టేసుకున్నానండి. మీ రిషి సార్‌ మీద వేశాను కదా?

వసుధార: అంటే మీ మీద మీరు ఒట్టేసుకున్నట్టే కదా సార్‌.

రంగ: సరే మీరు అలా అనుకుంటే అలాగే అనుకోండి

వసుధార: అనుకున్నాను కాబట్టే మీకు దూరంగా వెళ్లిపోతున్నాను సర్‌.

రంగ: ఎక్కడికి మేడం మీ ఇంటికా?

వసుధార: ఇంటికి వెళ్లలేను సర్‌

రంగ: ఎందుకు మేడం దారి మర్చిపోయారా?

వసుధార: లేదు సర్‌ వాళ్ల దగ్గర నుంచి వచ్చేటప్పుడు.. మళ్లీ తిరిగి వస్తే రిషి సర్‌ తోనే వస్తాను లేదంటే రాను అన్నాను. అలా రాలేని పక్షంలో నేను కూడా చనిపోయాను అనుకోండి అన్నాను. అందుకే ఒంటరిగా వెళ్లలేను.

  అంటూ వసుధార వెళ్తుంటే రంగ మరి ఎక్కడికి వెళ్తారు అని అడగ్గానే ఏట్లోకి వెళ్తాను అంటుంది. దీంతో రంగ ఆ పాపం నాకు అంటుకుంటుంది అనగానే మీరు మునుపటిలా మారండి సర్‌ అని వసుధార అడుగుతుంది. లేదంటే మీరు ఎక్కడికి వెళితే అక్కడికి నన్ను తీసుకెళ్లండి అంటుంది. తర్వాత రంగ ఇంటి దగ్గర ఆటో క్లీన్‌ చేస్తుంటే సరోజ వచ్చి తనని వదిలేసి వచ్చావా? నువ్వు మళ్లీ వెనక్కి వచ్చి ఇచ్చిన మాట మీద నిలబడ్డావు అని హ్యాపీగా ఫీలవుతుంటే వసుధార ఇంట్లోంచి వస్తుంది. వసుధారను చూసిన సరోజ షాక్‌ అవుతుంది. శారీలో వచ్చిన వసుధారను చూసి రంగ ఈ శారీ మీకు బాగుంది అని ఇది ఎప్పుడు కొన్నారు అని అడుగుతాడు. ఉదయం సరోజ గిఫ్టుగా ఇచ్చింది ఇదే శారీ అని వసుధార చెప్పడంతో సరోజ షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget