అన్వేషించండి

Guppedanta Manasu Serial Today August 9th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: శైలేంద్రకు వార్నింగ్ ఇచ్చిన రిషి – రంగాగా ఎందుకు నటించావని నిలదీసిన బుజ్జి

Guppedanta Manasu Today Episode: రిషిగా నటిస్తున్న రంగాను త్వరలో చంపేయాలని శైలేంద్ర, దేవయాని ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: రంగ అవసరం తీరాక వాణ్ని చంపేయాలని దేవయానితో చెప్తాడు. శైలేంద్ర. లేదంటే వాడు మన రహస్యాలు ఎప్పుడైనా బయటపెడితే మనకే ప్రమాదం అంటాడు. అయితే చాటు నుంచి ధరణి వింటుంది. ఎవ‌రిని చంపేయ‌బోతున్నార‌ని శైలేంద్ర‌, దేవ‌యానిల‌ను అడుగుతుంది. దీంతో శైలేంద్ర ధరణిని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్తాడు. మరోవైపు మ‌ను కోసం తాను రాసిన లెట‌ర్‌ను శైలేంద్ర‌నే దొంగిలించాడ‌ని వ‌సుధార అనుమాన‌ప‌డుతుంది. కాలేజీ సీసీటీవీ ఫుటేజ్‌లో శైలేంద్ర లెటర్‌ తీసుకోవడం చూసి షాక్‌ అవుతుంది. ఇంతలో రిషి వస్తాడు. రిషిని గమనించిన వసుధార లాప్‌టాప్‌ క్లోజ్‌ చేస్తుంది. ఏం చూస్తున్నావ‌ని వ‌సుధార‌ను అడుగుతాడు రిషి. వ‌సుధార త‌డ‌బ‌డుతుంది. రిషి ప‌ట్టుబట్ట‌డంతో వీడియో చూపిస్తుంది.

రిషి: ఆ లెటర్‌లో ఏం రాశావు వసుధార.

వసుధార: ఆ లెటర్‌ లో ఉన్న విషయం మనుకు తప్ప ఇంకెవరికి చెప్పకూడదు.

రిషి: నువ్వు చెప్ప‌లేను...చెప్ప‌కూడ‌దు అనుకుంటే నేను నిన్ను ఇబ్బంది పెట్ట‌ను. కానీ ఒక్క‌టి అడుగుతాను. ఆ లెట‌ర్‌లో ఉన్న ఇన్ఫ‌ర్మేష‌న్ నాకు చెప్ప‌డం వ‌ల్ల ఏదైనా ప్రాబ్లెమ్ అవుతుందా? ఎవ‌రికైనా ప్ర‌మాదం జ‌ర‌గుతుందా?

 అని అడుగుతుండగానే బుజ్జి ఫోన్‌ చేస్తాడు. రిషి బయటకు వెళ్లి ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తాడు. నాన్న‌మ్మ‌కు ఆరోగ్యం బాగాలేద‌ని, వెంట‌నే ఆప‌రేష‌న్ చేయాల‌ని డాక్ట‌ర్లు అన్నార‌ని బుజ్జి చెప్తాడు. నువ్వు నిజంగానే రిషి అని నాకు ఎప్పుడో డౌట్ వ‌చ్చింద‌ని బుజ్జి చెప్తాడు. నువ్వు రిషివే అయితే రంగాగా ఎందుకు న‌టించావ‌ని రిషిని ప్రశ్నిస్తాడు బుజ్జి. త్వ‌ర‌లో వాటికి స‌మాధానాలు తెలుస్తాయ‌ని రిషి చెప్తాడు. మరోవైపు తాను మను కోసం రాసిన లెటర్‌ ఎందుకు దొంగిలించావని వసుధార, శైలేంద్రను నిలదీస్తుంది. వ‌సుధార ఎంత తిట్టినా శైలేంద్ర ప‌ట్టించుకోడు. ఆ లెట‌ర్ నా ద‌గ్గ‌రే భ‌ద్రంగా ఉంద‌ని చెప్తాడు. బాధ్య‌త లేకుండా కాలేజీ వ‌దిలిపెట్టి వెళ్లిపోయిన వాళ్ల‌తో మాట్లాడాలంటే కంప‌రంగా ఉంద‌ని శైలేంద్ర అంటాడు. ఇంతలో రిషి అక్కడకు వస్తాడు.

రిషి: నా భార్య‌ను నువ్వు ఏవేవో మాట‌లు అంటుంటే చూస్తూ ఊరుకోను. వ‌సుధార ఏదైనా ప‌ద‌వి తీసుకుంటే ఎన్ని క‌ష్టాలు ఎదురైన వాటిని దాటుకుంటూ ఆ బాధ్య‌త‌కు న్యాయం చేస్తుంది. ఇంకోసారి నా భార్య‌ను ఒక్క మాట‌ అన్న ఊరుకునేది లేదు.

వసుధార: శైలేంద్ర నేను మను కోసం రాసిన లెటర్‌ ఇవ్వు.

శైలేంద్ర: ఇవ్వను గాక ఇవ్వను . అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఆ లెట‌ర్‌ను అస్త్రంగా వాడుకుంటాను. టైం చూసి ఆ లెటర్‌ మ‌నుకు ఇస్తాను. అప్పుడు మహేంద్ర ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.

వసుధార: ఆ లెట‌ర్‌ను నువ్వు మ‌నుకు ఇస్తే...మ‌హేంద్ర‌, మ‌ను కలిసిపోతారు. అప్పుడు నీ గొయ్యినువ్వే త‌వ్వుకున్న‌ట్లు అవుతుంది.

అని చెప్పి వసుధార వెళ్లిపోతుంది. శైలేంద్ర షాకింగ్‌గా అలాగే చూస్తుండిపోతాడు. మరోవైపు రంగాకు స‌రోజ ఫోన్ చేస్తుంది. ఫోన్ వసుధార లిఫ్ట్ చేయ‌డంతో స‌రోజ షాక్‌ అవుతుంది. తర్వాత  ధ‌న్‌రాజ్ ద్వారా రంగా అడ్రెస్ క‌నిపెట్టాల‌ని స‌రోజ అనుకుంటుంది. తర్వాత అనుపమను కలవడానికి వసుధార వెళ్తుంది. వసుధారను అనుపమ మెచ్చుకుంటుంది. రిషిని తీసుకొచ్చి నువ్వు అనుకున్నది సాధించావని అభినందిస్తుంది. అయితే మీరు మాతో పాటు ఉంటే మేము మ‌రింత సంతోషంగా ఉంటామ‌ని అనుప‌మను అడుగుతుంది వ‌సుధార‌. మీరు మ‌హేంద్ర‌ను ఒంట‌రిగా వ‌దిలిపెట్టి అక్కడి నుంచి దూరంగా ఎందుకు వ‌చ్చార‌ని అడుగుతుంది. అయితే దేవ‌యానికి మ‌ను తండ్రి ఎవ‌ర‌న్న‌ది తెలిసింద‌ని, అది అడ్డం పెట్టుకొని త‌న‌ను బ్లాక్‌మెయిల్ చేసింద‌ని వ‌సుధార‌తో చెబుతుంది అనుప‌మ‌. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today June 29th:దివ్యాంక చెంప పగులగొట్టిన నిషిక....కోడలిలో వచ్చిన మార్పు చూసి షాక్‌ తిన్న వైజయంతి
జగద్ధాత్రి సీరియల్: దివ్యాంక చెంప పగులగొట్టిన నిషిక....కోడలిలో వచ్చిన మార్పు చూసి షాక్‌ తిన్న వైజయంతి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 29th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఇంటికొచ్చిన లక్ష్మీ! పండుని మామయ్య అంటూ ఏడిపించేసిన సిరి పాప!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఇంటికొచ్చిన లక్ష్మీ! పండుని మామయ్య అంటూ ఏడిపించేసిన సిరి పాప!
Godavari Serial Today June 29th: 'గోదావరి' సీరియల్: శంకర్ ఇంటిని వేలం వేయిస్తున్న సింహాద్రి! జాను ఏం చేయనుంది?
'గోదావరి' సీరియల్: శంకర్ ఇంటిని వేలం వేయిస్తున్న సింహాద్రి! జాను ఏం చేయనుంది?
Nindu Manasulu Serial Today June 29th:నిండు మనసులు: బెయిల్ మీద వచ్చేసిన గణ! ప్రేరణ, సిద్ధూ, విజయానంద్‌లకు వార్నింగ్‌!
నిండు మనసులు: బెయిల్ మీద వచ్చేసిన గణ! ప్రేరణ, సిద్ధూ, విజయానంద్‌లకు వార్నింగ్‌!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget