అన్వేషించండి

Guppedanta Manasu Serial Today August 5th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: శైలేంద్ర ఇంటికొచ్చిన సరోజ – వసు రూంలోకి వెళ్లిన రిషి

Guppedanta Manasu Today Episode: రంగాను వెతుక్కుంటూ ఫణీంద్ర ఇంటికి వచ్చిన సరోజ, శైలేంద్ర కాలర్ పట్టుకుని రంగా ఎక్కడని నిలదీయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: రిషినే రంగాలా యాక్ట్‌ చేస్తున్నాడేమోనని దేవయాని అనుమానిస్తుంది. అది నిజమా కాదా తెలుసుకోవడానికి రిషిని వసుధార రూంలోకి పంపిస్తుంది. అయితే శైలేంద్ర వచ్చి దేవయానిని తిడతాడు. ఎందుకు రంగాను వసుధార రూంలోకి పంపించావని ప్రశ్నిస్తాడు. దీంతో వాడు రిషినో, రంగానో తెలుసుకోవ‌డానికి ఆ ప‌ని చేశాన‌ని.. రిషి అయితే వ‌సుధార రూమ్‌లోనే ఉంటాడని... రంగా అయితే రూమ్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాడ‌ని.. వాడి ప్రవర్తన చూస్తుంటే తనకు అనుమానంగా ఉందని చెప్తుంది దేవయాని. అయితే అతను పక్కాగా రంగానే అంటాడు శైలేంద్ర. మరోవైపు వీఆర్‌ అని రాసిన రింగ్‌ను చూస్తూ వసుధార ఎమోష‌న‌ల్ అవుతుంది. ఇంతలో రిషి వస్తాడు.

వసుధార: మనది రిషిధారల బంధం సర్‌. మనం ఎప్పటికి ఒక్కటిగానే ఉండాలి. ఈ రింగ్‌ నా వేలికి తొడగండి సర్‌. జీవితాంతం మీ కౌగిలిలో ఒదిగిపోవాల‌నిపిస్తుంది. మీ లాల‌న‌, పాల‌న‌, మీ గుండెచ‌ప్పుడు, ప్రేమ..నా జీవితానికి ఇవి చాలు సర్‌.

రిషి: నువ్వు కోరుకుంటున్న ప్రేమ‌ను నీకు అందించాల‌ని, జీవితాంతం నీ పెదాల‌పై చిరున‌వ్వు, క‌ళ్ల‌లో కాంతిని, ముఖంలో ఆనందాన్ని చూస్తూ బతకాలనిపిస్తుంది. ఆ వసుధార ఇక నేను వెళ్తాను.

వసుధార: అదేంటి సర్‌ అప్పుడే వెళ్తారా? ఇంకాసేపు ఉండొచ్చు కదా?

రిషి: శైలేంద్ర దృష్టిలో నేను రంగను.. ఇప్పుడు నీ రూమ్‌లోనే ఉంటే శైలేంద్రకు అనుమానం వస్తుంది.

 అని చెప్పి రిషి బయటకు వస్తాడు. రిషి బ‌య‌ట‌కు రావ‌డం చూసి శైలేంద్ర ఆనంద‌ప‌డ‌తాడు. అత‌డు రంగానేన‌ని దేవయానితో చెప్తాడు. బయటకు వచ్చిన రిషి తాను వసుధార భర్తగా నటించలేనని తాను ఊరెళ్లిపోతాన‌ని శైలేంద్రకు చెప్తాడు. నువ్వు వెళ్లిపోతాను  అంటుంటే నా ప్రాణం పోయేలా ఉంద‌ంటాడు శైలేంద్ర. తర్వాత మ‌హేంద్ర రూమ్‌లో ప‌డుకోవ‌డానికి వెళ‌తాడు రిషి. కొడుకును చూసి మ‌హేంద్ర ఎమోష‌న‌ల్ అవుతాడు. క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. తండ్రిని ఓదార్చుతాడు రిషి.

మహేంద్ర: ఇవీ క‌న్నీళ్లు కాదు రిషి. ఆనంద బాష్పాలు. నువ్వు ఎప్ప‌టికా రావ‌ని, నిన్ను చూడ‌లేన‌ని ఇన్నాళ్లు ఎంతో బాధ‌ను అనుభ‌వించాను. జీవితం మీదే విర‌క్తి పుట్టింది. ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా మొండిగా బ‌తికాను.

రిషి: డాడ్‌ మిమ్మ‌ల్ని చాలా బాధ‌పెట్టాను నన్ను క్షమించండి.

అంటూ రిషి ఎమోషనల్‌ అవుతుంటాడు. మరోవైపు మను ఆలోచిస్తుంటాడు. ఏం ఆలోచిస్తున్నావని కొడుకుని అడుగుతుంది అనుపమ.

మ‌ను: రిషిని మ‌హేంద్ర సార్‌ కలిసిశారు. నేను మాత్రం నా తండ్రిని క‌లిసేది ఎప్పుడా అని ఆలోచిస్తున్నాను.

అనుపమ: నాన్నా మను నీ ఎదురుచూపులకు.. నీ ఓపిక‌కు ఫ‌లితం ద‌క్కేరోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంది నాన్నా.

మను: అమ్మా నాకు ఒక‌సారి రిషి, వ‌సుధార‌ల‌ను క‌ల‌వాల‌ని ఉంది.

అనుపమ: ఇప్పుడు వ‌ద్దలే మను. మనం  కొన్నాళ్లు తర్వాత  వెళ‌దాం.

మను: ప్రతి చిన్న విష‌యానికి ఏవేవో కార‌ణాలు చెప్పి ఎందుకు న‌న్ను ఆపుతున్నావమ్మా?

అనుపమ: నీకంటే ఎక్కువ‌గా నాకు వారిని క‌ల‌వాల‌ని అనిపిస్తుంది మను. కానీ ఎందుకు ఆగ‌మంటున్నానో అర్థం చేసుకో నాన్నా.

అని అనుపమ, మనుకు సర్ది చెప్తుంది. మరోవైపు రంగాను వెతుక్కుంటూ ఫణీంద్ర ఇంటికి వస్తుంది సరోజ. ఇంట్లో ఉన్న ధరణితో మా బావ ఎక్కడని అడుగుతుంది. సరోజ అరుపులకు మహేంద్ర, ఫణీంద్ర కిందకు వస్తారు. అప్పుడే శైలేంద్ర అక్క‌డికి వ‌స్తాడు. నువ్వు మా రంగా బావ‌ను ఏం చేశావ‌ని శైలేంద్ర కాల‌ర్ ప‌ట్టుకుంటుంది స‌రోజ‌. అది చూసి అంద‌రూ షాక‌వుతారు. అప్పుడే రిషి వ‌స్తాడు. రిషిని చూసి స‌రోజ ఆనంద‌ప‌డుతుంది. న‌న్ను వ‌దిలేసి ఎందుకెళ్లావు.. అమ్మ‌మ్మ కూడా నీ మీద బెంగ‌పెట్టుకుంద‌ని రిషితో అంటుంది సరోజ. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Central Taxes: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
Telugu States IAS IPS : కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
Vettaiyan box office Day 1 prediction: 'వేట్టయన్'కు సాలిడ్ ఓపెనింగ్... కానీ 'జైలర్'ను రికార్డును బీట్ చేసిందా?
'వేట్టయన్'కు సాలిడ్ ఓపెనింగ్... కానీ 'జైలర్'ను రికార్డును బీట్ చేసిందా?
Ratan Tata: 1998లోనే మేడ్ ఇన్ ఇండియా కారు - రతన్ టాటా విజన్ అంత గొప్పది!
1998లోనే మేడ్ ఇన్ ఇండియా కారు - రతన్ టాటా విజన్ అంత గొప్పది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్‌ ఫ్రెండ్Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదేRatan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Central Taxes: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
Telugu States IAS IPS : కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
Vettaiyan box office Day 1 prediction: 'వేట్టయన్'కు సాలిడ్ ఓపెనింగ్... కానీ 'జైలర్'ను రికార్డును బీట్ చేసిందా?
'వేట్టయన్'కు సాలిడ్ ఓపెనింగ్... కానీ 'జైలర్'ను రికార్డును బీట్ చేసిందా?
Ratan Tata: 1998లోనే మేడ్ ఇన్ ఇండియా కారు - రతన్ టాటా విజన్ అంత గొప్పది!
1998లోనే మేడ్ ఇన్ ఇండియా కారు - రతన్ టాటా విజన్ అంత గొప్పది!
Ratan Tata: రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు - వర్లి శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు
రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు - వర్లి శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు
Entertainment Top Stories Today: రజనీకాంత్ ‘వేట్టయన్’ రివ్యూ, ‘దేవర 3’పై కొరటాల కామెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
రజనీకాంత్ ‘వేట్టయన్’ రివ్యూ, ‘దేవర 3’పై కొరటాల కామెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
KTR: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
Tata Nexon CNG Review:  టాటా నెక్సాన్ సీఎన్‌జీ ఎలా ఉంది? - మైలేజీ ఎంత ఇస్తుంది?
టాటా నెక్సాన్ సీఎన్‌జీ ఎలా ఉంది? - మైలేజీ ఎంత ఇస్తుంది?
Embed widget