అన్వేషించండి

Gruhalakshmi November 8th : రత్నం కేసు వాపసు తీసుకుంటుందా? జాను వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యిందా?

విక్రమ్, దివ్యల హనిమూన్ భగ్నం చేసేందుకు జాను వాళ్ల డాడీ ముస్లీం గెటప్ లు వేసుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ ఫన్నీగా సాగింది.

జాను వాళ్ల  డాడీ ఇద్దరూ కలిసి ముస్లీం వేషాలేసుకుని వాళ్లను ఎవరైనా  గుర్తుపడతారో లేదో టెస్ట్ చేసుకుందామని  విక్రమ్‌ వాళ్ల రూం దగ్గరకు వచ్చి వాళ్లను ఇరవై రూపాయలకు ఛేంజ్‌ అడుగుతారు. విక్రమ్‌, దివ్య నవ్వుకుంటూ ఇరవై రూపాయలకు ఛేంజ్‌ ఏంటి? అంటూ అడుగుతారు. ఛేంజ్‌ లేకపోతే పర్వాలేదు మీరు గుర్తు పట్టలేదు మాకదే చాలు అన్నట్లు తిరిగి వెళ్తారు.

లాస్య కోపంగా అరుస్తూ.. రత్నను పిలుస్తుంది. రత్న నింపాదిగా పైనుంచి దిగివచ్చి

రత్న: ఏంటా కేకలు..

లాస్య: దీన్నే అంటారు అవసరానికి మనుషుల్ని వాడుకోవడం అని.

రత్న: ఇప్పుడేం జరిగింది.

లాస్య: ఏం  జరిగిందా? మీకు అవసరం ఉన్న టైంలో నన్ను వాడుకున్నారు. ఇప్పుడు మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదేనా మీరు నాకిచ్చే విలువ.

రత్న: హని విషయంలో నువ్వు మాకు సపోర్టుగా నిలబడ్డావు అందుకు థాంక్స్‌. అలా అని మాకు సంబంధించిన ప్రతి ఇష్యూలోనూ నీ సలహా తీసుకోవాలని ఏం లేదుగా?   

అనగానే తులసి సరేలే కానీ హని విషయంలో వేసిన కేసు ఎందుకు వాపస్‌ తీసుకున్నారు. అంటూ లాస్య అడగ్గానే ఈ విషయంలో మేము మా నిర్ణయం తీసుకున్నాం. తులసి ఉండగా హనిని కానీ కంపెనీని కానీ ఏమీ చేయలేమని అర్థం అయ్యింది. అందుకే కేసు వాపసు తీసుకున్నాం. అలాగే మేమే తిరిగి యూఎస్‌ వెళ్లిపోతున్నాం అంటూ చెప్తారు. దీంతో లాస్య అసహనంగా చూస్తుండిపోతుంది.

నందగోపాల్‌ లెటర్‌ తీసుకుని చదువుకుంటూ లోపలికి వస్తూ..

నంద: తులసి గుడ్‌ న్యూస్‌ ఈ రోజుతో మనకో పెద్ద తలనొప్పి వదిలిపోయింది. ఈరోజు నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు.

అనగానే అందరూ ఏంటా గుడ్‌ న్యూస్‌ అని అడుగుతారు. రత్న వాళ్లు హని విషయంలో వేసిన కేసును వాపసు తీసుకున్నారు. కోర్టు నుంచి ఇంటిమేషన్‌ వచ్చింది. అంటూ నంద చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. హనీ చాక్లెట్‌ తీసుకుని నందగోపాల్‌కు ఇస్తుంది. తర్వాత కొత్త ఆంటీ వాళ్లు ఇల్లు ఖాళీ చేసి పోయారు మనం అక్కడికి వెళ్దాం అని అడుగుతుంది హని. వద్దని తులసి పాత విషయాలు గుర్తు చేసుకుంటుంది.

జాను వాళ్ల డాడీ రూంలో ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో విక్రమ్‌ వాళ్ల రూంలోంచి అరుపులు వినిపిస్తాయి. వెంటనే విక్రమ్‌ వాళ్ల రూంలోకి జాను వాళ్ల డాడీ పరిగెత్తుకొస్తారు. దీంతో విక్రమ్‌ కోపంగా

విక్రమ్‌: మా రూం తలుపులు తోసుకుని వచ్చేయడమేనా? కాలింగ్‌ బెల్‌ కొట్టాలన్న మర్యాద తెలియదా?  

జాను డాడీ: నీది మొగుడు గరంగా ఉంది ఏం జరిగింది బేటీ?

విక్రమ్‌: బేటీ లేదు లాటీ లేదు వెళ్లిపో.. మొగుడు పెళ్లాలన్న తర్వాత మాకు సవాలక్ష ఉంటాయి. అన్నీ మీకు చెప్పాలా? ఏంటయ్యా మీ డౌటు మేమేదో సరసాలాడుకుంటున్నాం చాలా..!

జాను: పప్ప సరసాలు ఆడుకుంటున్నాయి అంట మరి ఆ అరుపులు

విక్రమ్‌: నీకు పెళ్లయింది. కానీ నీ మొగుడు పారిపోయిండు. అరుపుల సంగతి నీకేం తెలుస్తాయి. చాచా నా బాష కూడా మారిపోతుంది.

వెళ్లండి అనగానే వాళ్లు బయటికి వెళ్లిపోతారు. తులసి వాళ్ల అమ్మకు ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడుగుతుంది. ఇంతలో తులసి వాళ్ల తమ్ముడు వచ్చి ఫోన్‌ తీసుకుని అమ్మ ఆరోగ్యం అసలు బాగాలేదని నిన్నటి నుంచి గుండె దడగా ఉందని పడుకుందని చెప్తాడు. నేను ఎన్ని చెప్పినా వినటం లేదని నువ్వైనా చెప్పు అంటాడు. దీంతో వాళ్ల అమ్మ తులసితో వాడి మాటలు పట్టించుకోవద్దని టైంకు టాబ్లెట్స్‌ వేసుకుంటున్నానని చెప్తుంది. ఇక్కడ అంత సర్దుకున్నాక నిన్ను మా ఇంటికి తీసుకొచ్చుకుంటానమ్మ అంటూ తులసి చెప్పడంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ అయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu Nov16:రోడ్డుమీద మరోసారి గొడవపడిన బాలు,అరుణ్..సుమతి చెప్పడంతో వెనక్కి తగ్గిన అరుణ్‌
గుండెనిండా గుడిగంటలు:రోడ్డుమీద మరోసారి గొడవపడిన బాలు,అరుణ్..సుమతి చెప్పడంతో వెనక్కి తగ్గిన అరుణ్‌
Podarillu Serial Today NoV 16:దీపావళిలో టపాసులు పేలి చెలరేగిన మంటలు..కన్నాకు దెబ్బలు తగలకుండా పొదివిపట్టుకున్న నారాయణ
పొదరిల్లు: దీపావళిలో టపాసులు పేలి చెలరేగిన మంటలు..కన్నాకు దెబ్బలు తగలకుండా పొదివిపట్టుకున్న నారాయణ
Illu Illalu Pillalu Serial Today November 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు పుత్రోత్సాహం! వల్లీని కలిసిన అంజలి.. చందు గురించి ఏం మాట్లాడుకున్నారంటే?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు పుత్రోత్సాహం! వల్లీని కలిసిన అంజలి.. చందు గురించి ఏం మాట్లాడుకున్నారంటే?
Karthika Deepam 2 Serial Today November 16th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ నిర్ణయం జ్యోత్స్న జీవితాన్ని మలుపు తిప్పుతుందా! పారుని అడ్డు పెట్టుకొని మాలిని ఆడుతున్న నాటకం!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ నిర్ణయం జ్యోత్స్న జీవితాన్ని మలుపు తిప్పుతుందా! పారుని అడ్డు పెట్టుకొని మాలిని ఆడుతున్న నాటకం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Candidates: ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
AP Panchayat Elections 2026 : ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
Telangana Phone Tapping Case: త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
Viral News: అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
AP Panchayat Elections 2026: పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
Denza D9: లగ్జరీ కారుకి కొత్త అర్థం.. 7 సీట్లు, మసాజ్ ఫీచర్‌, 730 కి.మీ. రేంజ్‌తో వచ్చిన 'డెంజా D9'
కదిలే స్టార్‌ హోటల్‌ లాంటి Denza D9.. ఈ కారు మీ దగ్గరుంటే ప్రతి ఒక్కరి కళ్లూ మీ మీదే!
Dry Fruits Benefits : బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్.. ఏవి ఏ సమయంలో తింటే మంచిది? నిపుణుల సూచనలు ఇవే
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్.. ఏవి ఏ సమయంలో తింటే మంచిది? నిపుణుల సూచనలు ఇవే
Bigg Boss Season 10 Today November 15th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శ్వేత ఎలిమినేట్! టాప్ 3.. లీస్ట్ త్రీ వాళ్లే! సెలబ్రిటీల బెస్ట్ హింట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శ్వేత ఎలిమినేట్! టాప్ 3.. లీస్ట్ త్రీ వాళ్లే! సెలబ్రిటీల బెస్ట్ హింట్స్!
Embed widget