అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 30th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీని ఇచ్చేయ్‌మని మిత్రకి ఫోన్ చేసిన పార్వతి.. మిత్ర కఠిన నిర్ణయం!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్కీని ఇవ్వమని పార్వతి మిత్రకు కాల్ చేయడం మిత్ర ఏడుస్తూ లక్ష్మీని కౌగిలించుకొని లక్కీ కావాలని ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ పొలం కోసం ఊరిలోని రౌడీలు లక్ష్మీ వాళ్లతో కబడ్డీ ఆడుతారు. లక్ష్మీ వాళ్లు ఓడిపోతే పొలం అమ్మాలని గెలిస్తే తాము పొలం కోసం ఇబ్బంది పెట్టమని ఒప్పందం పెట్టుకుంటారు. లక్ష్మీ వాళ్లు రౌడీలను పట్టుకొని పాయింట్స్ సంపాదిస్తారు. ఇక మిత్ర వెళ్లి పాయింట్ తీసుకొచ్చిన తర్వాత లక్ష్మీ కూతకు వెళ్తుంది. లక్ష్మీ కూడా ఒక్కోక్క రౌడీని తోసేసి ఫైటింగ్ చేస్తూ ఒకేసారి ఇద్దరిని ఔట్ చేస్తుంది. మరో ఇద్దరు లక్ష్మీ పట్టుకుంటారు. అయినా లక్ష్మీ గెలవడానికి ప్రయత్నిస్తుంది. అందరూ లక్ష్మీకి సపోర్ట్ చేయడంతో కోర్ట్ మొత్తం క్లియర్ చేసేస్తుంది. దాంతో లక్ష్మీ వాళ్లు గెలుస్తారు.

లక్ష్మీ టీమ్‌ని గెలిపించిందని వివేక్, జాను, జయదేవ్‌లు లక్ష్మీని పొగిడేస్తారు. రౌడీలకు తమ పొలం జోలికి రావొద్దని చెప్పి లక్ష్మీ వార్నింగ్ ఇచ్చి పంపేస్తుంది. లక్ష్మీ నిజంగా లక్ష్మీ బాంబే అని దేవయాని అంటుంది. దానికి మనీషా నేను ఆటం బాంబ్ అంటీ అని అంటుంది. ఇక సరయు ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు అనుకుంటుంది. లక్ష్మీ వాళ్లు తన తాతయ్య సమాధి దగ్గరకు వెళ్తారు. ఇక సరయు మనీషాకి కాల్ చేసి పార్వతి రెడీ అని చెప్తుంది. మన ఇద్దరినీ మించిన నటి అని చెప్తుంది. 

మనీషా: మిత్రకు చిన్న డౌట్ వచ్చినా నేను అయిపోతాను.
సరయు: మిత్రకే కాదు లక్ష్మీకి కూడా డౌట్ రాదు అంత గొప్పగా నటిస్తుంది.
మనీషా: ఏదైనా తేడా వస్తే నా చేతిలో నువ్వు అయిపోతావు. ఇక్కడ ఆ మిత్ర, లక్ష్మీల రొమాన్స్ చూడలేక చస్తున్నా ముందు కాల్ చేయించు
సరయు: మనీషా నోటికి అడ్డూ అదుపు లేదు టైం చూసి దానికి చావు దెబ్బ కొడతా.

లక్ష్మీ వాళ్లు తాతయ్య సమాధి దగ్గరకు వెళ్తారు. లక్ష్మీ, జానులు ఎమోషనల్ అయి ఏడుస్తారు. లక్ష్మీ తాతయ్య అచ్చుత రామయ్య సమాధి దగ్గర దీపం వెలిగిస్తుంది. జాను పూల దండ వేస్తుంది. అందరూ సమాధి మీద పూలు వేసి నివాళులు అర్పిస్తారు. వివేక్ ఏడుస్తున్న జానుని దగ్గరకు తీసుకొని ఓదార్చుతాడు. ఇక లక్ష్మీ కూడా ఏడుస్తుంటే చూసిన మిత్ర లక్ష్మీ దగ్గరకు వెళ్లి లక్ష్మీని దగ్గరకు తీసుకొని ఓదార్చుతాడు. లక్ష్మీ మిత్ర మీద తల వాల్చి ఏడుస్తుంది. మనీషా, దేవయాని షాక్ అయిపోతారు. రాత్రి ఇక అందరికి లక్ష్మీ, జానులు వడ్డిస్తారు. అందరూ కలిసి సంతోషంగా భోజనం చేస్తారు. తాతయ్య పార్థసారథి పిల్లలకు గోరు ముద్దలు తినిపిస్తారు. ఇక పెద్దాయన లక్ష్మీ వంటని పొగుడుతారు. ఇంతలో సరయు పార్వతితో మిత్రకు కాల్ చేయిస్తుంది. నేను పార్వతిని లక్కీ కన్న తల్లిని అని చెప్తే మిత్ర షాక్ అయిపోతాడు. 

పార్వతి: నేను మీ ఇంటి దగ్గరకు వస్తే మీరు బయటకు వెళ్లారని చెప్పారు మీరు ఎప్పుడు వస్తారు. ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో నా పాపని వదిలి వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు నాకు నా పాప కావాలి. (మిత్ర ఏం మాట్లాడకుండా ఏడుస్తాడు) 
మిత్ర: నేను తర్వాత కాల్ చేస్తాను.
లక్ష్మీ: ఏమైందండి. ఏమైంది అంటే చెప్పరేంటి.
దేవయాని: మనం కొట్టింది చావు దెబ్బ కదా ఆ మాత్రం ఉంటుంది.
లక్ష్మీ: ఆ కన్నీళ్లేంటి మిత్ర గారు ఏం జరిగిందో చెప్పండి.
మిత్ర: లక్కీ వాళ్ల అమ్మ ఫోన్ చేసింది. అందరూ షాక్ అయిపోతారు. లక్కీ తనకు కావాలంట. లక్కీ లేకుండా నేను ఎలా బతకను.
మనీషా: లక్కీ మీద నీకున్న ప్రేమ ఎవరూ కాదనలేరు మిత్ర కానీ లక్కీ కన్న తల్లిని నువ్వు కాదలేవు కదా ఆవిడ అడిగితే నువ్వు తిరిగి ఇవ్వాల్సిందే.
దేవయాని: అలా ఎలా ఇస్తాడు మనీషా. ఇన్నాళ్లు ప్రేమగా ప్రాణంగా పెంచుకున్నాడు.
మనీషా: నిజమే ఆంటీ కానీ లక్కీకి మన మీద హక్కులేదు కదా. పైగా లక్కీ అనాథ అని దత్తత తీసుకున్నాం ఇప్పుడు కన్న తల్లి అడిగితే ఇవ్వాల్సిందే.
మిత్ర: ఇవ్వను లక్కీ కన్నతల్లే కాదు ఆ దేవుడు అడిగినా ఇవ్వను నా నుంచి లక్కీని ఎవరూ వేరు చేయలేరు. నాకు లక్కీ కావాలి లక్ష్మీ నాకు లక్కీ కావాలి అని లక్ష్మీ హగ్ చేసుకొని ఏడుస్తాడు. లక్కీ లేకుండా నేను బతకలేను నా లక్కీని నాకు దక్కించు నా ప్రాణం నిలబెట్టు.
మనీషా: ఏంటి ఆంటీ నన్ను హగ్ చేసుకోకుండా ఆ లక్ష్మీని హగ్ చేసుకున్నాడు. 
దేవయాని: వాళ్లది పవిత్ర బంధం. నీది ప్రేమ బంధం పెళ్లిలో ఉన్న బంధం ప్రేమలో ఉండదు. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: కబడ్డీ ఆడుతూ మిత్ర, లక్ష్మీల రొమాన్స్.. కుళ్లుకున్న మనీషా.. లక్కీ తల్లి ఎంట్రీ ఎప్పుడో?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
Best Earbuds Under Rs 3000: రూ.మూడు వేలలోపు బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - వన్‌ప్లస్ నుంచి బోట్ వరకు!
రూ.మూడు వేలలోపు బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - వన్‌ప్లస్ నుంచి బోట్ వరకు!
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
Best Earbuds Under Rs 3000: రూ.మూడు వేలలోపు బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - వన్‌ప్లస్ నుంచి బోట్ వరకు!
రూ.మూడు వేలలోపు బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - వన్‌ప్లస్ నుంచి బోట్ వరకు!
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Pushpa 2: ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
Anantapuram News: అమ్మా నాన్న క్షమించండి అంటూ ఫోన్ కాల్ - ఎంబీబీఎస్ సీటు రాలేదని రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య
అమ్మా నాన్న క్షమించండి అంటూ ఫోన్ కాల్ - ఎంబీబీఎస్ సీటు రాలేదని రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
Pushpa 2 Collection: ఇండియన్  బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్... పుష్ప 2 డే 1 @ 294 కోట్లు
Embed widget