అన్వేషించండి

Chinni Serial Today January 29th: చిన్ని సీరియల్: ప్రమీల మ్యాడీకి ఏం చెప్పింది? మధు మాటలు మ్యాడీ వినేశాడా! వరుణ్‌ లోహితకు సలహా!

Chinni Serial Today Episode January 29th చిన్నిని పూర్తిగా మర్చిపోయి మధుతోనే జీవితం పంచుకోమని సంతోషంగా ఉండమని ప్రమీల మ్యాడీకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు మ్యాడీతో ఈ వ్రతం నీకు ఇష్టం లేదు అన్నావ్ కానీ నన్ను ఎత్తుకొని తిప్పుతూ ఉంటే నీకు వ్రతం నచ్చేసిందని అంటుంది. అంత సీన్ లేదు నాకు వ్రతం ఇష్టం లేదు అని మ్యాడీ అంటాడు. మరి ఇష్టం లేకుండా ఎత్తుకున్నావ్‌ కదా మధ్యలో దించేస్తావ్ అనుకుంటే దించలేదు.. నువ్వు నన్ను ఎత్తుకున్నప్పుడు నీ కళ్లల్లో నా మీద ప్రేమ కనిపించిందని మధు అంటుంది. దానికి మ్యాడీ నేను మా పెద్దమ్మ కోసం మాత్రమే చేశా.. మా అమ్మలా మా పెద్దమ్మ నన్ను చూసింది అందుకే తన మీద ప్రేమతో చేశా.. నేను నిన్ను ఇష్టపడటం కానీ ప్రేమించడం కానీ భార్యలా అంగీకరించడం కానీ ఎప్పటికీ జరగవు.. ఆ దేవుడే దిగి వచ్చినా ఆ పని చేయలేదు. నా మనసులో నీకు ఎప్పటికీ స్థానం ఉండదు గుర్తుంచుకో అని అంటాడు.

మ్యాడీ మాటలు ప్రమీల, స్వరూప వింటారు. స్వరూప ప్రమీలతో మ్యాడీ బాబు ఇలా మాట్లాడేశాడు ఏంటి వదిన గారు.. అని అంటుంది. తలరాతని మనం మార్చలేం కదా అని ప్రమీల అనేస్తుంది. ఇక వరుణ్ ఓ చోట కొబ్బరి చిప్ప తింటూ ఉంటే వరుణ్ దగ్గరకు లోహిత వెళ్లి నా మీద నీకు ప్రేమ లేదు.. నాకు అర్థమైపోయింది.. నన్ను ఎత్తుకోలేకపోయావ్ అంటుంది. నేను ప్రేమ లేక మోయలేదు అనుకోకు.. నీ బరువు మోయలేక దించేశా అంటాడు. నిజంగా నువ్వు వ్రతం చేయడానికి గుడికి వచ్చావా లేదంటే కుళ్లుకోవడానికి వచ్చావా.. అందరూ ఒకరి కళ్లలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటే నువ్వు మాత్రం మ్యాడీ వాళ్ల జంటనే చూస్తున్నావ్.. అందుకే మోయలేక దించేశా అంటాడు. అంతే కోపంతో దించేశావా నా మీద ప్రేమ లేక దించలేదన్నమాట అని అంటుంది. ఒకటి గుర్తించుకో ఎదుటి వాళ్లని చూసి ఏడిస్తే ఆ కుళ్లు మనకే తగులుతుంది అని వరుణ్ అంటాడు. లోహిత మనసులో వీడేంటి నాకు క్లాస్‌లు పీకుతున్నాడు అయినా నేను నాగవల్లి ఆంటీ పార్టీ కదా ఈజీగా వరుణ్ని గ్రిప్‌లో పెట్టుకోవచ్చు అనుకుంటుంది. 

ప్రమీల డల్‌గా ఉంటే ఏమైందని మ్యాడీ అడుగుతాడు. చిన్నప్పటి నుంచి చిన్నీని ప్రేమించావు కదా.. తర్వాత మధుని ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్ కదా మళ్లీ నీ మనసు మారిపోతుందా.. మధుని జీవితాంతం ప్రేమగా చూసుకుంటావా లేదా అని నా భయం అని అంటుంది. ప్రతి ఆడపిల్ల భర్తే జీవితం అనుకుంటుంది. అలాంటి మధు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి ఎంత ప్రేమగా బాధ్యతగా నమ్మకంగా నీతో ఉందో అలాగే నువ్వు ఉండాలి.. అలా జరగాలి అంటే నీ మనసులో నుంచి చిన్నిని నువ్వు తీసేయాలి.. మధు నీ జీవితం అనుకోవాలి అని చెప్తుంది. నువ్వే జీవితం అనుకునే మధు నువ్వు బాధ పెడితే భరించలేదు.. నువ్వు తనని బాధ పెట్టకూడదు అంటే గతాన్ని మర్చిపోవాలి అని అంటుంది. 

మధు మ్యాడీ మాటలు తలచుకొని బాధ పడుతూ ఆంజనేయస్వామి దగ్గరకు వెళ్లి.. ఏంటి స్వామి ఇది ఎందుకు మా జీవితాలు మారిపోయావి.. చిన్నప్పుడు నేను మ్యాడీ ఎంత సంతోషంగా ఉండేవాళ్లం అని మాట్లాడుతూ ఉంటుంది. లోహిత అది చూసి ఇప్పుడే మ్యాడీని పిలవాలి ఇక్కడికి ఇక్కడే తనని తన్నితరిమేస్తాడని అనుకొని మ్యాడీని పిలుస్తుంది. మధు మ్యాడీమీద తనకు ప్రేమ పుట్టిందని అది పెరిగి పోయిందని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ అక్కడికి వెళ్తాడు. ఆ మాటలు విని మ్యాడీ హ్యాపీగా ఫీలవుతాడు. లోహిత మనసులో మ్యాడీ వచ్చే టైంకి చిన్ని టాపిక్ మాట్లాడదు ఏంటి అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
Godavari Serial Today August 5th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget