అన్వేషించండి

Chinni Serial Today January 28th: చిన్ని సీరియల్: మ్యాడీ-మధులను ఒక్కటి చేయాలని హగ్‌ల ప్రోగ్రాం.. లోహిత కుట్ర! రాధా రూపంలో ఆఫ్ టికెట్ ఎంట్రీ!

Chinni Serial Today Episode January 28th మధు, మ్యాడీలను ఒక్కటి చేయాలి అని వ్రతం పేరుతో ఎత్తుకునే కార్యక్రమాలు చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధుని ఎత్తుకొని మ్యాడీ గుడి మెట్లు ఎక్కుతుంటే వాళ్లని పడేయాలి అని లోహిత మెట్ల మీద అరటి తొక్క వేస్తుంది. మ్యాడీ అది తొక్కకుండా పక్కన కాలేసి వెళ్లిపోతాడు. తర్వాత ప్రమీల ఆ తొక్క తొక్కి లోహిత మీద పడిపోతుంది. పంతులు మ్యాడీని ఆపి మెట్లు అన్నీ ఎక్కేశావ్ బాబు ఇక దింపేయ్ అంటాడు. మ్యాడీ మొత్తం చూసి మధ్యలో దింపేయాలి అనుకున్నా ఇలా ఎత్తుకొని వచ్చేశా ఏంటి అని అనుకుంటాడు.

మ్యాడీ, మధు, లోహిత, వరుణ్ అందరూ దేవుడి దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుంటారు. దర్శనం అయిపోయింది కదా ఇక వెళ్లొచ్చా అని మ్యాడీ అంటే ఇంకా చాలా ఘట్టాలు ఉన్నాయి అని పంతులు చెప్తారు. తర్వాత జంట గంట ఘట్టం అని మధుని ఎత్తుకొని గంట కొట్టించమని చెప్తారు. మ్యాడీ ఎత్తుకోవడంతో మధు గంట కొడుతుంది. లోహిత ఉడికిపోతుంది. ఎంత సేపు గంట కొడతారు.. గంటని గంటసేపు కొట్టాల్సిన అవసరం లేదు అని లోహిత అంటుంది. దాంతో మ్యాడీ మధుని కిందకి దింపేస్తాడు. తర్వాత వరుణ్ లోహితను ఎత్తుకుంటే లోహిత గంట కొడుతుంది. తర్వాత పంతులు జంట జ్యోతి ఘట్టం అని పంతులు అంటే దానికి మ్యాడీ మధుతో ఈ జంటల ప్రోగ్రాం నీదే కదా అని అడుగుతాడు. నాకేం తెలీదు అంతా మీ పెద్దమ్మదే అని మధు అంటుంది. తర్వాత మధు, మ్యాడీలతో ఒకే దీపం వెలిగించేలా చేస్తారు. 

మ్యాడీ మనసులో మధుని నేను భార్యగా చూడటం లేదు తను ఎప్పటికీ నాకు స్నేహితురాలే అలాగే ఉండేలా చూడు అని కోరుకుంటాడు. తర్వాత ఇద్దరితో దాంపత్య ఉపనిషత్తు అని మ్యాడీ మధుని ఎత్తుకొని ముడుపు కట్టించాలి అని పంతులు అంటాడు. ఇదేంటి ఇది ఇవన్నీ నేను చేయను అని మ్యాడీ అంటే ఇక్కడి ఆచారం బాబు చేయాలి అని పంతులు కవర్ చేస్తాడు. మధుకి ముడుపు ఇచ్చి మీ కోరికలు కోరి ముడుపు కట్టండి అని అంటాడు. మధు మ్యాడీతో జీవితాంతం కలిసి ఉండాలి అని కోరుకుంటుంది. మ్యాడీ మాత్రం మధుతో త్వరగా విడిపోవాలి అని కోరుకుంటాడు. ఇక లోహిత మధు, మ్యాడీలు విడిపోవాలని కోరుకుంటుంది. వరుణ్ అయితే తను లోహిత ఎప్పటికీ కలిసే ఉండాలి అని మధు, మ్యాడీ కూడా కలిసి ఉండాలని కోరుకుంటాడు.

ముడుపు కట్టడానికి మ్యాడీ మధుని ఎత్తుకుంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. వరుణ్ కూడా లోహితను ఎత్తుకుంటాడు. లోహితను ఎత్తలేక వరుణ్ నానా పాట్లు పడతాడు. మ్యాడీ మాత్రం మధుని మైమరిచిపోయి చూస్తూ అలాగే ఉండిపోతాడు. మధు, లోహిత ఇద్దరూ ముడుపులు కట్టేస్తారు. తర్వాత లోహిత మనసులో ఎంత అన్యోన్యంగా ఆనందంగా ఉన్నారు.. వీళ్ల ఆనందం చెడగొట్టడానికి నాకు ఏదైనా మార్గం దొరికితే బాగున్ను అని లోహిత అనుకుంటుంది. మరోవైపు అదే గుడికి ఆఫ్ టికెట్ లంగావోణి కట్టుకొని రాధా గెటప్‌లో రెడీ అయి వస్తాడు. ఈ గెటప్ ఎందుకు అన్న అని అతని మనిషి అడిగితే చిన్నిని కలవడానికి ఇలా వచ్చా.. మ్యాడీ నన్ను గుర్తు పట్టకుండా రాధాలా రెడీ అయ్యా.. నాగవల్లి, దేవా చిన్నిని ఏమైనా చేయాలి అనుకుంటారు. దేవా నిజస్వరూపం చిన్నికి చెప్పాలి అని ఆఫ్ టికెట్ అంటాడు. మ్యాడీ ఓ చోట కూర్చొని చిన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే మధు వచ్చి కూర్చొని ఏంటి బాబు నా గురించే ఆలోచిస్తున్నావా అంటుంది. నీ గురించి ఏం ఉంటుంది అని మ్యాడీ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Samantha: బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
Embed widget