అన్వేషించండి

chinni serial today April 17th: చిన్ని సీరియల్: చిన్నిని గెంటేసిన దేవా, నాగవల్లి! మ్యాడీ ఎంట్రీతో ట్విస్ట్!

chinni serial today episode April 17th చిన్నిని నాగవల్లి, దేవా గడువు పూర్తయిందని గెంటేస్తే మ్యాడీ అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్నికి మ్యాడీ ఇచ్చిన గడువు అయిపోతుండటంతో చిన్ని కావేరి ఫొటో దగ్గరకు వెళ్లి ఏడుస్తుంది. ఇంతలో నాగవల్లి అక్కడికి వచ్చి డిస్ట్రబ్ చేశానా.. నువ్వు మీ అమ్మతో మాట్లాడుతుంటే ఇబ్బంది పెట్టానా.. ఈ రోజు డేట్ ఏంటో నీకు గుర్తుందా అని అడుగుతుంది. గుర్తుంది అత్తయ్యా అని చిన్ని కన్నీరు పెట్టుకుంటుంది. 30 రోజులు గడువు అడిగి.. మీ అమ్మ నిర్దోషి అని నిరూపించుకోకపోతే మ్యాడీకి విడాకులు ఇస్తాను అని చెప్పావ్ గుర్తుందా.. ఆ రోజు మ్యాడీ అగ్రిమెంట్ పేపర్ల మీద సాయంత్రం 6 గంటలకు సంతకం పెట్టడం గుర్తుందా.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తట్టాబుట్టా సర్దేయాలి అని గుర్తుందా అని అడిగితే చిన్ని తలూపుతుంది. సాయంత్రానికి అల్లా రెడీ అయిపోయి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి.. లేదంటే మెడ పట్టుకొని గెంటేస్తా అని నాగవల్లి అంటుంది. 

నాగవల్లి వెళ్లిపోయిన తర్వాత చిన్ని తనతో తాను నేను మ్యాడీకి దూరం అవ్వడం అంటే నా ప్రాణం నేను వదిలేయడమే మ్యాడీ లేకుండా నేను ఉండలేను.. అమ్మా నేను మ్యాడీకి దూరం కాకుండా కలిసి ఉండేలా ఆశీర్వదించు అని ఏడుస్తుంది. మరోవైపు బాలరాజు దేవుడుకి దండం పెడుతూ చిన్నికి మ్యాడీబాబు ఇచ్చిన గడువు పూర్తయిపోయింది.. ఇప్పుడు నేను అజ్ఞాతం వీడాలి.. దేవా ఇంటికి వెళ్లి మ్యాడీ బాబు కాళ్లు పట్టుకొని అయినా బతిమాలాలి అని అనుకుంటాడు. ఆఫ్ టికెట్ విని అన్న నువ్వు వెళ్తే నీ ప్రాణాలకే ప్రమాదం.. నువ్వు అక్కడికి వస్తున్నాను అని చిన్నికి ఒకసారి చెప్పు అన్న.. చిన్నికి ఏమైనా ఆధారం దొరికుంటే నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు కదా అని ఆఫ్ టికెట్ చెప్తాడు. 

బాలరాజు చిన్నికి కాల్ చేస్తే చిన్ని ఏడుస్తుంది. నా తలరాత అమ్మ తలరాత ఆ దేవుడు కన్నీటితో రాసినట్లు ఉన్నాడు నాన్న.. అందుకే బతికినంత కాలం అమ్మకి కన్నీళ్లే ఇప్పుడు నీకు కన్నీళ్లే అని ఏడుస్తుంది. నేను కోరుకున్నది ఏదీ నాకు దగ్గలేదు నాన్న దొరికినట్లే దొరికి దూరం అయిపోతున్నాయి.. అని ఏడుస్తుంది. నువ్వేం బాధ పడకు అమ్మా నేను వెంటనే అక్కడికి వస్తాను.. మ్యాడీ బాబుతో నేను మాట్లాడుతాను.. అవసరం అయితే మ్యాడీ బాబు కాళ్లు పట్టుకుంటాను.. నీకు ఇంకా కొంచెం గడువు ఇవ్వమని బతిమాలుతాను అని అంటాడు. నాన్న నువ్వు ఇక్కడికి రావొద్దు అని చిన్ని తండ్రికి చెప్తుంది. నీ గురించి ఇంత కాలం దాచాను అని దీన్ని కూడా మోసం అంటాడు నాన్న నువ్వు రావొద్దు అని అంటుంది. నువ్వు ఇక్కడికి వస్తే నా మీద ఒట్టే నాన్న అని చిన్ని ఫోన్ కట్ చేసేస్తుంది. కూతురి కాపురం నిలబెట్టలేని దౌర్భాగుడిని అయిపోయా అని బాలరాజు చాలా బాధ పడతాడు. 

సాయంత్రం టైం 6 అవ్వడంతో నాగవల్లి లోహిత, శ్రేయలతో వెళ్లి దాన్ని తీసుకురండి అని అంటుంది. లోహిత, శ్రేయ వెళ్లి చిన్నిని పిలిచి వాళ్లే లగేజ్ సర్దేస్తారు. లోహి మ్యాడీ ఇంకా రాలేదు వచ్చాక ఒక్క మాట చెప్పేసి వెళ్తాను అని చిన్ని బతిమాలితే ఎవరికీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని లోహిత చిన్నిని లాక్కొస్తుంది. నాగవల్లి చిన్నిని వెళ్లిపోమని అంటే అత్తయ్యా ప్లీజ్ అని చిన్ని బతిమాలితే పోవే అని నాగవల్లి చిన్నిని గెంటేస్తుంది. ఇంతలో కావేరి ఆత్మ చిన్నిలోకి వస్తుంది. నాగవల్లి చిన్నిని గెంటేస్తే మ్యాడీ వచ్చి పట్టుకుంటాడు. చిన్నిని తీసుకొని నాగవల్లి, దేవా దగ్గరకు వెళ్తాడు. ఏంటి మమ్మీ ఇది అని మ్యాడీ అడిగితే నెల రోజుల గడువు పేరుతో మనల్ని చాలా ఇబ్బంది పెట్టింది.. ఇప్పుడు గడువు పూర్తయింది కదా అందుకే గెంటేస్తున్నాం అని దేవా అంటాడు. ఆ పని చేయాల్సింది నేను కదా అని మ్యాడీ అంటాడు.

చిన్ని షాక్ అయిపోతుంది. చిన్ని వల్ల అందరి కంటే ఎక్కువ బాధ పడింది.. అలాంటప్పుడు చిన్నిని గెంటేయాల్సింది నేనే కదా మీరు ఎందుకు గెంటేస్తున్నారు.. సరే ఇప్పుడు నువ్వు వచ్చావ్ కదా నువ్వే గెంటేయ్ అని దేవా అంటాడు. గెంటేయ్ నాన్న అని నాగవల్లి అంటే సారీ మమ్మీ చిన్ని ఇక్కడే ఉంటుంది.. మనతో పాటు మన ఇంట్లోనే ఉంటుంది అని మ్యాడీ అంటాడు. అలా ఎలా ఉంటుంది నాన్న ఆ చిన్ని వాళ్ల అమ్మ నిర్దోషి అని తేల్చకపోయినా మన ఇంట్లో ఉండటం ఏంటి అని అంటే నిజనిజాలు తేలే వరకు చిన్ని మన ఇంట్లోనే ఉంటుంది.  ఎవరు కరెక్ట్ చెప్తున్నారో తేల్చుకునే వరకు తను ఇక్కడే ఉండాలి.. దోషి ఎవరో నిర్దోషి ఎవరో నేను తెలుసుకోవాలి.. జరిగిన దాని వల్ల అందరి కంటే ఎక్కువ నష్టపోయింది నేను.. అందరి కంటే ఎక్కువ కోల్పోయింది నేను.. అమ్మ చనిపోవడం వల్ల నువ్వు భార్యని మాత్రమే కోల్పోయావు.. నువ్వు అక్కని మాత్రమే కోల్పోయావు.. కానీ నేను చాలా పోగొట్టుకున్నా.. అమెరికా వెళ్లడం వల్ల చిన్నప్పుడే చిన్నిని కోల్పోయాను.. అమ్మని వాళ్ల అమ్మ చంపింది అని తెలియడంతో చిన్నిని మళ్లీ కోల్పోయాను.. నేను ప్రేమించిన చిన్నిని కోల్పోయాను.. ఇప్పుడు వాళ్ల అమ్మ తప్పు చేయలేదు అని తెలిస్తే చిన్నిని నేను తరిమేస్తే తనని శాశ్వతంగా కోల్పోయేవాడిని అందుకే తను ఇక్కడే ఉండాలి అని అంటాడు. చిన్ని వాళ్ల అమ్మ తప్పు చేసింది అని తెలిస్తే చిన్నిని గెంటేస్తా అదే ఇంకెవరైనా ఉన్నారని తెలిస్తే అసలు దోషిని పోలీసులకు పట్టిస్తా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
TV Actor Arrested: మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
Vanana Brundha: మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు
మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు
Godavari Serial Today July 11th: 'గోదావరి' సీరియల్: పెళ్లి కొడుకు గుట్టు బయటపెట్టిన జాను.. చివరి నిమిషంలో ఆగిన నందు పెళ్లి!
'గోదావరి' సీరియల్: పెళ్లి కొడుకు గుట్టు బయటపెట్టిన జాను.. చివరి నిమిషంలో ఆగిన నందు పెళ్లి!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget