Chinni Serial Today May 22nd: చిన్ని సీరియల్: కావేరికి నరకం చూపిస్తున్న దేవా.. బాలరాజుతో విషయం చెప్పి బోరున ఏడ్చిన కావేరి!
Chinni Today Episode కావేరి బాలరాజుని కలిసి దేవా తనకు పెడుతున్న టార్చర్ గురించి చెప్పడం చిన్ని తండ్రిని బయటకు తీసుకొస్తా అని మొండికి పోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవేంద్ర వర్మ కావేరితో నేను చెప్పిన డీల్‌కి ఓకే కాకపోతే చిటికెన వేలితో మొదలైంది బొటను వేలి వరకు వస్తుందని అంటాడు. తర్వాత కావేరి ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. చిన్ని ఉందా లేదా అని కంగారుగా కావేరి భారతికి కాల్ చేస్తుంది. చిన్నికి ఏం కాకూడదు అని అనుకుంటూ భారతి దగ్గరకు వెళ్తుంది.
చిన్ని జైలులో ఉన్న తండ్రి దగ్గరకు వెళ్తుంది. కానిస్టేబుల్ చిన్నిని బాలరాజు దగ్గరకు వెళ్లనివ్వదు. చిన్ని చాలా బతిమాలుతుంది. బాలరాజు మరోవ్యక్తితో బాబాయ్ నాకూతురితో మాట్లాడుతా అంటే కుదరదు అని కావాలి అంటే కోర్టు దగ్గర రేపు మాట్లాడొచ్చు అని అంటారు. చిన్ని లేడీ కానిస్టేబుల్ కాలు కూడా పట్టుకుంటుంది. కానీ ఆమె కుదరదు అంటే కుదరదు అని చిన్నిని బయటకు గెంటేస్తుంది. మా నాన్నని కలిసే వరకు ఇక్కడ నుంచి వెళ్లను అని చిన్ని అంటుంది. ఏడుస్తూ అక్కడే ఉంటుంది.
ఆఫ్ టికెట్ చిన్నిని ఇంటికి వెళ్దామని అంటాడు. చిన్ని రాను అనేస్తుంది. ఆఫ్ టికెట్ మనసులో వదినమ్మ చిన్నిని ఎట్టి పరిస్థితిలో బయటకు తీసుకెళ్లొద్దని చెప్పింది ఇప్పుడేం చేయాలి అని అనుకుంటాడు. కావేరి భారతికి కాల్ చేస్తూనే ఉంటుంది కానీ భారతి కాల్ కలవదు. దాంతో ఆ దేవేంద్ర వర్మ అందర్ని కిడ్నాప్ చేసుంటాడేమో అని కంగారుగా స్కూటీ స్పీడ్‌గా నడుపుతుంది. ఇంతలో దేవేంద్ర వర్మ కారుతో కావేరికి ఎదురుగా వస్తాడు. కళ్లు కనిపించడం లేదా అని కావేరి తిడుతుంది. దేవా కిందకి దిగుతాడు. దేవాని చూసి కావేరి షాక్ అవుతుంది. దగ్గరకు వెళ్లి దేవా కాలర్ పట్టుకొని చిన్ని ఎక్కడ అని నిలదీస్తుంది. నా డీల్‌కి ఒప్పుకుంటేనే చిన్ని వస్తుందని అంటుంది.
కావేరి దేవా కాలర్ పట్టుకోవడం చూసిన నాగవల్లి వచ్చి కావేరిని కొడుకుతుంది. నా బావని పట్టుకోవడానికి ఎంత ధైర్యమే అని తిడుతుంటే దేవా ఆపి తనని తీసుకెళ్లిపోతాడు. నా డీల్ గురించి మర్చిపోవద్దు ప్రశాంతంగా ఉందాం ఆలోచించు అని దేవా కావేరితో చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు ఎస్‌ఐ రావడంతో చిన్ని గురించి చెప్తారు. ఆయన కూడా చిన్నిని వెళ్లిపోమని చెప్తే చిన్ని వెళ్లను అని మొండికేస్తుంది. బాలరాజు దగ్గరకు వెళ్లి నీ కూతురిని వెళ్లమని నువ్వు చెప్తావా మా పద్థతిలో చెప్పాలా అంటే బాలరాజు చిన్నిని వెళ్లిపోమని బతిమాలుతాడు. మా నాన్న కాదు కదా ఆ దేవుడు చెప్పినా వినను వెళ్లను అని చిన్ని అంటుంది.
రాత్రి వరకు చిన్ని పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంటుంది. పెద్ద వర్షంలో చిన్ని, ఆఫ్ టికెట్ ఇద్దరూ బయటే నిల్చొంటారు. చిన్ని అలా ఉండటం చూసిన అధికారి చిన్ని దగ్గరకు వెళ్లి ఇలా మొండిగా ప్రవర్తిస్తావేంటి అని అడిగి 5 నిమిషాలు టైం ఇచ్చి కలిసి వెళ్లిపోమని చెప్తారు. దాంతో చిన్ని తండ్రి దగ్గరకు పరుగులు తీస్తారు. ఇలా మొండిగా ప్రవర్తిస్తావేంటి చిన్ని అని రాజు చిన్ని మీద కోప్పడతాడు. చిన్ని తండ్రితో మాట్లాడి నువ్వు ఏం తప్పు చేయలేదని నేను నమ్ముతున్నా నాన్న అమ్మ కూడా నమ్మడం లేదు అసలేం జరిగింది అని అడుగుతుంది. మొత్తం బాలరాజు చెప్తాడు.
చిన్ని లాయర్‌తో కలిసి మాట్లాడుతా అని చెప్తుంది. చిన్ని ఇంటికి వెళ్తుండగానే కావేరి అక్కడికి వస్తుంది. ఉష టీచర్ అని కానిస్టేబుల్ మాట్లాడటంతో బాలరాజు చూస్తాడు. కావేరి బాలరాజుని కలిసి చిన్ని కనిపించడంలేదని ఆ దేవేంద్ర వర్మ ఏమైనా చేశాడేమో అని భయంగా ఉంది అంటే చిన్ని ఇంతకు ముందే ఇక్కడికి వచ్చి వెళ్లిందని బాలరాజు చెప్తాడు. ఏమైందని బాలరాజు కావేరిని అడిగితే నాకు ఆ దేవా నరకం చూపిస్తున్నాడు అని మొత్తం చెప్తుంది. దేవా ఇంత నీచానికి దిగజారాడా అని బాలరాజు అంటాడు. అన్నయ్య తోడు కూడా లేదు అనాథ అయిపోయాను అని కావేరి ఏడుస్తుంది. మీ అన్నయ్యని చంపాను అని అంటే నువ్వు ఎలా నమ్మావు కావేరి అని బాలరాజు అంటాడు.
దేవా మీ అన్నయ్యని చంపి ఆ కేసులో నన్ను ఇరికించాడని చెప్తాడు. తనని నమ్మమని కావేరిని బతిమాలుతాడు. కళ్లముందు కనిపిస్తున్న సాక్ష్యాలు నువ్వే మా అన్నయ్యని చంపావని చెప్తున్నాయి కానీ మనస్సాక్షి మాత్రం నువ్వు తప్పు చేయలేదు అని చెప్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదని కావేరి వెళ్లిపోతుంది. దారిలో చిన్ని కనిపిస్తుంది. చిన్నిని పట్టుకొని నీకు ఏం కాలేదు కదా అని ఏడుస్తుంది. ఆఫ్ టికెట్ జరిగింది కావేరికి చెప్తాడు. వర్షంలో తడుస్తూ అలా మొండిగా ఉండటం ఏంటి అని కావేరి చిన్నిని తిడుతుంది. ఇక చందు కావేరికి కాల్ చేసి అత్త లోహితకు ఆకలి వేస్తుంది అని ఏడుస్తుంది. ఇంట్లో సరుకులు లేవు డబ్బులు లేవు ఏమైనా కొందామని అంటే అని చెప్తాడు. పది నిమిషాల్లో పార్శిల్ తీసుకొస్తా అని చందుతో కావేరి చెప్తుంది. చిన్నితో మీరు జాగ్రత్తగా ఉండండి మీరు బయటకు రావొద్దు అని చెప్తుంది. ఆటోని పిలిచి ఇద్దరినీ పంపిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!





















