Chinni Serial Today March 17th: చిన్ని సీరియల్: ఏసీపీకే చుక్కలు చూపించిన కావేరి.. విజయ్ ఈగో హర్టూ.. ఈ మ్యాటర్ బాగా సీరియస్!
Chinni Today Episode విజయ్ కావేరి, ఉషలు ఫ్రింగర్ ఫ్రింట్స్ మ్యాచ్ అవ్వలేదని అధికారులతో చెప్పడం వాళ్లు కేసు విషయంలో విజయ్ మీద సీరియస్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode కావేరి (ఉష) విజయ్‌ని కలవడానికి బయల్దేరుతుంది. ఏసీపీ నన్ను అరెస్ట్ చేస్తాడేమో? మళ్లీ నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్లిపోతాను? చిన్నికి దూరం అయిపోతానేమో? ఈ ఇంటికి దూరం అయిపోతానేమో? అని బాధ పడుతుంది. అప్పుడే సత్య చిన్ని కోసం స్కూల్ బ్యాగ్, షూ చందు, భార్య కోసం కూడా తీసుకొస్తాడు. అది చూసిన ఉష తను లేకపోయిన తన అన్నయ్య చిన్నిని బాగా చూసుకుంటాడని తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది.
ఉష భయం భయంగానే విజయ్‌ని కలవడానికి కాఫీ షాప్‌కి వెళ్తుంది. టెన్షన్‌తో తన శ్రేయాభిలాషి ( భర్త రాజు అని ఉషకి తెలీదు)కి కాల్ చేస్తుంది. రాజు ఉషతో ఫోన్ ఆన్‌లోనే పెట్టమని ఏమైనా తికమకగా అడిగితే టెన్షన్ పడకుండా కాసేపు సైలెంట్‌గా ఉంటే తాను మెసేజ్ చేస్తానని అప్పుడు అదే కాన్ఫిడెంట్‌గా చెప్పమని శ్రేయాభిలాషి ఉషకి చెప్తాడు. ఉష లోపలికి వెళ్లే సరికి విజయ్, కుందన( బిగ్ బాస్ గీతూ రాయల్) లోపల ఉంటారు. విజయ్ ఉషని చూసి హలో మేడమ్ ఇక్కడ అని పిలుస్తాడు.
విజయ్: కంగ్రాట్యూలేషన్స్.
ఉష: ఎందుకు.
విజయ్: మీరే కావేరి అని ఒప్పుకోవడానికి అని వచ్చారు కదా అందుకే.
ఉష: నేను ఒప్పుకోవడానికి వచ్చానో ఒప్పించుకోవడానికి వచ్చానో మీకు తెలీదుకు కదా.నేను కావేరిని కాదు ఉషని అని మీతో ఒప్పించుకోవడానికి వచ్చా.
విజయ్: నాతో ఒప్పించుకోవడం నా నుంచి తప్పించుకోవడం జరగవు మేడం.
కుందన: ఇదేంటి సార్ కావేరిలా స్పందిస్తుంది అనుకుంటే ప్రతీ దానికి ఇలా రివర్స్‌లా స్పందిస్తుంది.
విజయ్: కుందన నువ్వు స్పందనలా స్పందించకు. ఈ మేడం స్పందనలు అన్నీ రిపోర్ట్స్ వచ్చే వరకే కదా. రిపోర్ట్స్ రావడానికి ఇంకా పది నిమిషాలే ఉంది ఈ లోపు వేడి వేడి కాఫీ తాగుదామా మేడం.
ఉష: హా తాగుదాం సార్.
కుందన ఫోన్‌కి రిపోర్ట్స్ వస్తాయి. కాఫీ తాగుతున్న కావేరి(ఉష) చాలా టెన్షన్ పడుతుంది. విజయ్ కావేరి దొరికిపోయింది అన్నట్లు చూసి తర్వాత రిపోర్ట్స్ చూసి షాక్ అవుతాడు. ఏంటి సార్ మీ రియాక్షన్ తేడాగా ఉందని కుందన అడిగితే ఈ మేడం వేలిముద్రలు కావేరి వేలిముద్రలతో మ్యాచ్ అవ్వలేదని చెప్తారు. అప్పటి వరకు భయం భయంగా ఉన్న ఉష ఒక్కసారిగా దర్జాగా కాళ్ల మీద కాలు వేసుకొని యాటిట్యూడ్ కనిపించేలా విజయ్ ముందు కూర్చొంటుంది. విజయ్ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు.
ఉష: ఇప్పుడేమంటారు మిస్టర్ ఏసీపీ విజయ్ గారు. నేను కావేరి అంటారా. ఉషని అంటారా. నేను ఇక్కడికి వచ్చింది నేను కావేరిని అని ఒప్పుకోవడానికా ఉషని అని ఒప్పించడానికా. ఏసీపీ గారు మీరు ఓ పని చేయాలి. రేపు మార్నింగ్ పది పావుకి మీరు ప్రెస్ మీట్ పెట్టి నేను కావేరి కాదు ఉష అని చెప్పాలి లేదంటే నేను ప్రెస్ మీట్ పెట్టి జరిగింది అంతా చెప్తా. గుర్తు పెట్టుకోండి పది పావు.
విజయ్: హలో మేడం మా డిపార్ట్‌మెంట్‌కి ఒక సారి అనుమానం వస్తే అది తీరే అంత వరకు ప్రెస్ మీట్ పెట్టం.
ఉష: ఒకే మీ అనుమానం పూర్తిగా తీరితేనే ప్రెస్ మీట్ పెట్టుకుందాం సరేనా ఏసీపీ సార్.
ఉష వెళ్లిపోతుంది. తర్వాత రాజుకి కాల్ చేసి చాలా హ్యాపీగా ఉన్నా చాలా థ్యాంక్స్ సార్ అని చెప్తుంది. ఫ్రింగర్ ప్రింట్స్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదు మీరు ఏం చేశారు అని అడుగుతుంది. దాంతో రాజు మీ వేలి ముద్రలే మార్చేశాను అని చెప్తాడు. అది ఎలా అని ఉష అడిగితే పీటీ టీచర్‌గా జాయిన్ అవ్వడానికి ముందు రోజు భారతి పిన్నితో నీకు పంపించి చేతులకు రాసుకోమన్న లిక్విడ్ పంపాను కదా దాని వల్ల నీ ఫ్రింగర్ ప్రింట్స్ మారిపోయావని చెప్తాడు. గతంలో ఆ లిక్విడ్ రాసుకుంటూ ఉంటే చేతులకు మంట పుట్టినా ఉష రాసుకుంటుంది. రాజు కావేరితో భవిష్యత్లో ఇలాంటి ప్రాబ్లమ్ వస్తుంది అని తెలిసే ఆ లిక్విడ్ రాస్తే చర్మం ఊడిపోయి వేలిముద్రలు పోతాయని చెప్తాడు. ఇక ఉష ఎమోషనల్ అవుతూ ఒక్క సారి మిమల్ని కలవాలి అని మీ కాళ్లకు దండం పెట్టుకోవాలి అని అంటుంది. దేవా నిజస్వరూపం తెలిసి మీరు కావేరిగా దర్జాగా బతికిన తర్వాత కలుద్దామని అంటాడు. ఇక రాజు ఏసీపీ ఈ కేసు వదలడు అని జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు.
విజయ్ తన అధికారికి ఫోన్ చేసి కావేరి ఏదో చేసుంటుందని కావేరికి తాను పోలీస్ అని తెలిసిపోయిందని చెప్తాడు. నువ్వు పోలీస్‌లా ఎందుకు చెప్పావ్ అని విజయ్ మీద సీరియస్ అవుతారు. కేసు మొత్తం స్టడీ చేసి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇన్విస్టిగేషన్ పూర్తి చేయమని అంటారు. ఇప్పుడు ఇది నా ఈగోకి సంబంధించిన విషయం అని ఈ కేసులో నేను ఓడిపోకూడదు అనుకొని కావేరి డిటైల్స్ మొత్తం ఇవ్వమని కుందనకు చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలయ్యని ఫాలో అవ్వడం అంత ఈజీ కాదోయ్ గిరి.. జైలులో తాళి కట్టడానికి గిరి ప్లాన్!





















