అన్వేషించండి

Chinni Serial Today March 10th: చిన్ని సీరియల్: కావేరి కేసు తేల్చడానికి రానున్న ఏసీపీనే నిఖిలా.. దేవా నుంచి కావేరిని కాపాడేది ఎవరు?

Chinni Today Episode కావేరి కేసు సాల్వ్ చేయడానికి పోలీసులు ఏసీపీ విజయ్‌ని రంగంలోకి దింపాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode బిగ్‌బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్, కావ్య ప్రేమించుకొని విడిపోయారని అందరకీ తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెర మొత్తం ఈ ఇద్దరే హాట్‌టాపిక్. నమ్మించి మోసం చేశారు. ఇక ఎప్పటికీ వాళ్లని ప్రేమించను ఇలా చాలా షోలలో కావ్య నిఖిల్ గురించి ఇన్‌ డైరెక్ట్‌గా మాట్లాడింది. ఈ తరుణంలో కావ్య లీడ్ రోల్‌లో నటిస్తున్న చిన్నీ సీరియల్‌లో తన మాజీ లవర్ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో నిఖిల్ కావ్యల అభిమానులు ఇద్దరూ కలిసిపోయారని సంబర పడుతున్నారు. ఇక ఈ రోజు సీరియల్‌లో నిఖిల్ ఎంట్రీ ఉందా లేదా తెలియాలి అంటే అసలు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

కావేరి మీద కన్నేసి తన అక్కని చంపేసిన దేవ పీటీ ఉషగా ఉన్న కావేరిని చూస్తాడు. కావేరిని కిడ్నాప్ చేయమని తన మనుషుల్ని పంపిస్తాడు. కిడ్నాప్ చేసి దేవా దగ్గరకు తీసుకెళ్లగా అక్కడ కావేరి ఉండాల్సిన ప్లేస్‌లో నాగవల్లి కిడ్నాప్ అయింటుంది. చేతిలో హ్యాకీ బ్యాట్ పట్టుకొని పీటీ ఉష ఎంట్రీ ఇచ్చి నేను ఉండాల్సిన ప్లేస్‌లో నాగవల్లి ఉందని షాక్ అయ్యావా దేవా అని తను తప్పించుకొని నాగవల్లిని ఆ మూటలో కట్టిన సంగతి చెప్తుంది. దేవా, నాగవల్లి షాక్ అవుతారు. స్పోర్ట్స్ కోటాలో వచ్చా నాతో గేమ్స్ వద్దని అంటుంది. కావేరి కావేరి అంటూ నా వెంట పడి నన్ను ఇబ్బంది పడితే పోలీస్‌లకు పట్టిస్తా అని ఇద్దరికీ వార్నింగ్ ఇస్తుంది. 

నాగవల్లి: బావ ఇప్పటికైనా నమ్ముతావా తను కావేరి కాదు ఉష అని. మనం అంటే భయంతో వణికిపోయే కావేరికి మనల్ని భయంతో వణికించే ఈ ఉషకి ఎంత తేడా ఉందో చూశావా. ఇక తను కావేరి అని నీ మనసు నుంచి తీసేయ్. అవును బావ నాకు ఓ డౌట్ అది నిజంగా కావేరి అయితే నువ్వు దాన్ని చంపాలి అనుకోవడం ఏంటి. నీ చేతిలో గన్ ఏంటి. ఏంటో సాఫ్ట్‌గా ఉండే నువ్వు ఇలా ఏంటి.
దేవా: మనసులో ఇదేంటి ఇలా దొరికిపోయాను. 
నాగవల్లి: చీమని దోమని చంపడానికి భయపడే నువ్వు ఇలా ఒక మనిషిని చంపడానికి రెడీ అయిపోయావు అంటే నమ్మలేకపోతున్నా.
దేవా: నాగవల్లి ఇదంతా నేను నీ కోసమే చేస్తున్నా నువ్వు కావేరిని చంపాను అన్నావు. ఒక వేళ కావేరి బతికి ఉంటే నువ్వు జైలుకి వెళ్లిపోతావ్ కదా. ఆ కావేరి వల్ల మీ అక్కని దూరం చేసుకున్నా మళ్లీ ఇప్పుడు అదే కావేరి వల్ల నిన్ను దూరం చేసుకోవడానికి రెడీగా లేను నాగవల్లి అందుకే దాన్ని చంపేయాలి అనుకున్నా.
నాగవల్లి: నా కోసం ఒక మనిషిని చంపడానికి రెడీ అయ్యావు అంటే నేను అంటే ఎంత ప్రేమ బావ నా కోసం అయినా నవ్వు ఇలా చేయొద్దు. ఈ ఉష సంగతి నేను చూసుకుంటా.
దేవా: నీ ముందు మంచి వాడిని కావడానికి దాన్ని వదిలేశా కానీ దాన్ని నేను ఎందుకు వదలుతాను. అస్సలు వదలను. 

మరోవైపు పోలీసులు కావేరి ఫోటోలు ముందు వేసుకొని ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోయిన ఖైదీ ఇలా హాకీ స్టిక్ పట్టుకొని ఫొటోలు పట్టుకోవడం ఏంటి అని మాట్లాడుకుంటారు. సాక్ష్యాలతో సహా కావేరి, ఉష వేరు వేరని మరో పోలీస్ ఫైల్ చూపిస్తారు. చనిపోయిన వారు బతికినట్లు బతికిన వారు చనిపోయినట్లు మార్చే సొసైటీలో ఉన్నామని తను కావేరినా ఉషనో సీక్రెట్‌గా ఇన్వెస్ట్ చేయడానికి ఏసీపీ విజయ్‌ని రంగంలోకి దించాలని అనుకుంటారు. మరోవైపు చిన్ని చందులో ఉష టీచర్ కనిపించడం లేదని కంగారు పడుతుంది. ఇంతలో ఉష రావడంతో అమ్మా అమ్మా అని వెళ్లి హగ్ చేసుకుంటుంది. అమ్మ అనొద్దు టీచరమ్మ అనమని ఉష చెప్తుంది.

ఇక ఇంట్లోకి వెళ్లి తన ఆంటీని హగ్ చేసుకొని ఏడుస్తూ నేను నా కూతురికి దూరం అయిపోతానేమో అని భయంగా ఉందని తనని చంపడానికి  ప్రయత్నించాడని అంటుంది. తన శ్రేయాభిలాషి అయిన రాజుకి కాల్ చేస్తుంది. (రాజు కావేరి భర్త కానీ కావేరికి ఆ విషయం తెలీదు) తన శ్రేయాభిలాషికి జరిగింది అంతా చెప్తుంది. మిమల్ని కిడ్నాప్ చేసి వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడని మీరు ధైర్యంగా ఉండండి అని అంటాడు. మీరే నా ధైర్యం అని మీరు చెప్పినట్లు ఉషగా మారాని  అని ఇప్పుడు భయంగా ఉందని అంటే రాజు కావేరికి ధైర్యం చెప్తాడు. దేవాకి తాను బుద్ధి చెప్తానని నేను బతికి ఉండే వరకు మిమల్ని మీ కూతుర్ని కలిసే ఉంచుతానని అంటాడు. తన భార్యబిడ్డల జోలికి వచ్చినందుకు దేవా చాప్టర్ క్లోజ్ చేయాలని రాజు అనుకుంటాడు. 

మరోవైపు మహి కనిపించడం లేదని దేవా టెన్షన్ పడతాడు. నాగవల్లి, ఆమె పెద్ద అక్క ఏం కాదని అంటారు. దేవా మహి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాడు. బాలరాజు కిడ్నాప్ చేశాడేమో అనుకుంటాడు. ఇంతలో బాల దేవాని కలుస్తాడు. ఇద్దరూ మాట్లాడుతారు. నువ్వు ఒక్కడివే వచ్చావేంటి అంటే డ్రైవర్లు అందరూ మానేశారు అని అంటాడు. దాంతో దేవా చెప్పడం వల్లే మానేశారని రాజు దగ్గర ఉన్న వ్యక్తి అనుకుంటాడు. ఇక రాజు మహిని తీసుకొని ఇంటికి బయల్దేరుతాడు. మరోవైపు రాజుకి తన ఫ్రెండ్ కాల్ చేసి రాజు చెప్పిన లోకేషన్ దొరికిందని అంటాడు. రాజు అటు వెళ్తాడు. చిన్నికి యాక్సిడెంట్ చేసిన వాడు దొరికితే వాడి పని అయిపోతుందని అనుకుంటాడు. ఇక మహి రాజుతో పని ఉందని మా ఇంటి వైపు వచ్చారని అంటాడు. ఇక రాజుకి దేవా మీద అనుమానం వచ్చి వెంకట్‌కి కాల్ చేసి ఓనర్ పేరు అడిగితే దేవేంద్ర వర్మ అని చెప్పడతో షాక్ అవుతాడు. అప్పుడే ఆ కారు తీసుకొని నాగవల్ల రావడం చూసి షాక్ అవుతాడు. మహి దేవాని పిన్ని అని పిలవడంతో ఎవరు అని అడుగుతాడు. మా అమ్మ చెల్లి యూఎస్‌లో ఉంటుందని రాజుతో మహి చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
Gundeninda Gudigantalu August 19th:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
గుండెనిండా గుడిగంటలు:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
Illu Illalu Pillalu Serial Today August 19th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి చింతామణి వార్నింగ్! ప్రేమని విదేశాలకు వెళ్లిపోమన్న తండ్రి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి చింతామణి వార్నింగ్! ప్రేమని విదేశాలకు వెళ్లిపోమన్న తండ్రి!
Meghasandesam Serial Today August 19th: ‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను నిజం చెప్పమన్న భూమి – శారదను కిడ్నాప్‌ చేసిన సూర్య   
‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను నిజం చెప్పమన్న భూమి – శారదను కిడ్నాప్‌ చేసిన సూర్య   

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Embed widget