Brahmamudi November 22 : కావ్య, నీ తెలివితేటలకు జోహార్లు.. భార్య ప్లాన్ తెలుసుకొన్న షాక్లో రాహుల్!
Brahmamudi Serial November 22 : స్వప్న తనని ఇరికించేయాలి అనుకుంటుందని రాహుల్ తెలుసుకోవడంతో కథ మంచి మలుపు తిరిగింది.
Brahmamudi November 22 Episode : ఈరోజు ఎపిసోడ్ లో అప్పు సూసైడ్ చేసుకున్నట్లుగా కలగంటుంది కనకం, తుళ్ళిపడి నిద్ర లేస్తుంది.
కృష్ణమూర్తి: ఏం జరిగింది, ఎందుకలా కంగారుపడుతున్నావ్..
కనకం : ఏమీ లేదు ఏదో పీడకల వచ్చింది, మంచినీళ్లు తాగి వస్తాను అని చెప్పి అప్పు రూమ్ కి వెళ్తుంది.
అక్కడ అప్పు కనిపించకపోవడంతో ఇంత రాత్రి అప్పుడు ఎక్కడికి వెళ్ళింది అని కంగారుపడుతూ బయటికి వస్తుంది. అక్కడ ఆలోచనలో ఉన్న అప్పుని చూస్తుంది.
కనకం : ఇంత రాత్రి అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావ్..
అప్పు: నిద్ర పట్టలేదు అందుకే ఇక్కడ కూర్చున్నాను, ఏం ఆ మాత్రం స్వతంత్రం కూడా లేదా నాకు ఈ ఇంట్లో..
కనకం: స్వతంత్రం ఇచ్చాను కదా నువ్వు అబ్బాయిని వెంట ఏసుకు తిరిగినా అర్ధరాత్రి ఇంటికి వచ్చిన ఏమీ అనలేదు కదా.
అప్పు: అలా అదుపులో పెట్టిన బాగుండేది ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
కనకం కూతురికి గదిలోకి తీసుకువెళ్లి పడుకోబెడుతుంది.
కనకం: ఇందాక కావ్య ఉంటే నాకు ఈ కష్టాలు ఉండేవి కాదు అన్నందుకు బాధపడ్డావా అని అప్పుని అడుగుతుంది, తను ఉంటే నాకు కష్టాలు ఉండదేమో కానీ నువ్వు పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అనటంతో పప్పు ఎమోషనల్ అవుతూ తల్లిని హగ్ చేసుకుంటుంది.
మరోవైపు రాజ్ ఇంటిలోకి దొంగ ప్రవేశిస్తాడు. ఇంటి తలుపులు తెరిచే ఉంచినందుకు ఆనందిస్తూ రాజు వాళ్ళు కదలకుండా వాళ్ళిద్దరిని తాడుతో కట్టేస్తాడు. నా కుదుపులకి మెలకువ వచ్చిన రాజ్ దంపతులు దొంగని చూసి కంగారు పడతారు.
రాజ్ : మామూలుగా అయితే అరుస్తావు కదా ఇప్పుడేమైంది అరువు అంటాడు.
కావ్య: ఉండండి ఎప్పుడు దొంగని కళ్ళారా చూడలేదు అంటూ దొంగని తేరిపారా చూస్తుంది.
కావ్య: అతనిని కుసల ప్రశ్నలు అడిగి అసలు నువ్వు దొంగలా ఎందుకు అయ్యావు అని అడుగుతుంది.
దొంగ: కావ్య అభిమానానికి ఎమోషనల్ అయిపోతూ అంతా మీ వదిన వల్లేనమ్మా, పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని చూసి ఆ వస్తువులన్నీ మన ఇంట్లో ఉండాలని గొడవ చేసింది. ఇంక నాకు తప్పలేదు అని తన విషాద గాధ చెప్తాడు.
కావ్య: వదిన ఏం చేస్తుంది అన్నయ్య..
దొంగ: తను కూడా దొంగేనమ్మ, ఇది పండుగ సీజన్ కదా ఆడవాళ్లు పట్టు చీరలు కొంటారు కదా అవి నొక్కేయ్యటానికి వెళ్ళింది. వాళ్ల కాన్వర్జేషన్ కి చిరాకుపడతాడు రాజ్, కావ్యని మందలిస్తాడు.
దొంగ: ఈ బావతో ఎలా వేగుతున్నావు చెల్లెమ్మ అంటూ డబ్బు ఎక్కడ ఉంది అని కూపి లాగుతాడు.
కావ్య: డ్రాయర్ సొరుగు లో ఉంది అని చెప్తుంది.
దొంగ: అందులో ఉన్న ఏటీఎం కార్డు తీసి రాజ్ ని పిన్ నెంబర్ చెప్పమంటాడు.
కావ్య : ఆయనని బ్రతిమాలుతావ్ ఏంటి అన్నయ్య.. వైఫై ద్వారా 5000 తీసుకోవచ్చు తీసుకో అని చెప్పటంతో 5000 తీసుకొని కార్డు అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు దొంగ.
రాజ్: నీకేమైనా పిచ్చా.. డీటెయిల్స్ అన్ని దొంగకి ఇచ్చేస్తావేంటి అని కోప్పడతాడు.
కావ్య: బీరువాలో ఉన్న నగల గురించి, మీ డబ్బులు కట్టల గురించి చెప్పలేదు 5000 తో వదిలించుకున్నందుకు సంతోషించండి అంటుంది.
మరోవైపు రాజేష్ నుంచి ఎలా తప్పించుకోవాలో అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది స్వప్న.
స్వప్న: ఎలా అయినా ఈ సమస్య నుంచి బయటపడాలి, తాతయ్య ఇచ్చిన నగలు ఉన్నాయి కదా అవి తాకట్టు పెట్టి సమస్య నుంచి బయటపడాలి. ఎవరైనా అడిగితే రాహుల్ మీదకి నెట్టెయ్యవచ్చు అనుకుంటుంది. ఆ మాటలు విన్న రాహుల్ షాక్ అవుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.