అన్వేషించండి

Brahmamudi Serial Today July 5th: బ్రహ్మముడి సీరియల్: కల్యాణ్‌ తన కాళ్లు పట్టుకుంటేనే క్షమిస్తానన్న అనామిక.. కావ్య తోటికోడలి మాటలు రికార్డ్ చేసిందా! 

Brahmamudi Serial Today Episode అనామికతో మాట్లాడటానికి వెళ్లిన కావ్య డబ్బు కోసమే అనామిక ఇదంతా చేస్తుందని తెలుసుకొని బిత్తరపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Brahmamudi Today Episode కావ్య రాజ్ దగ్గరకు వచ్చి ఒకసారి అనామికతో మాట్లాడుదామని అందరూ కల్యాణ్‌కి శిక్ష పడుతుందని అనుకుంటున్నారు అని అంటుంది. కల్యాణ్‌కి శిక్ష పడకుండా చేయాలని అంటుంది. అనామిక ఇంటికి వెళ్తే ఇద్దరం కలిసి వాళ్లి ఇంటికి దాడి చేయడానికి వెళ్లామని మరో కేసు పెడతారని రాజ్ అంటాడు. తల్లిదండ్రులే అనామిక జీవితం నాశనం చేసేస్తున్నారని డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని అంటాడు. నీకు ఇంకా నమ్మకం ఉంటే నువ్వు వెళ్లు నేను మాత్రం రాను అని రాజ్ కావ్యతో అంటాడు. దాంతో కావ్య అనామిక దగ్గరకు వెళ్తుంది. కావ్య వెళ్లసరికి అనామిక బయట కాళ్ల మీద కాలు వేసుకొని కూర్చొని జ్యూస్ తాగుతుంటుంది. 

అనామిక: అనుకున్నాను.. నా అత్తింటి నుంచి రాజీకో రాయబారానికో వస్తారని..
కావ్య: అనుకున్నాను.. ఇలా అత్తింటి నుంచి రాజీకో రాయబారానికో రావాలి అని నువ్వు కోరుకుంటున్నావని.. రాక్షస సభలో కూడా రాజీకో సంధికో వచ్చిన రాయబారికి కూర్చోమని మర్యాద చేస్తారు. గౌరవంగా చూసి గౌరవంగా సాగనంపుతారు. నీ కంటే పెద్దదాన్ని తోడు కోడలిని కనీసం కూర్చొమని చెప్పకపోగా నా ముందే కాళ్లముందే కాళ్లు వేసుకొని కూర్చొన్నావ్ అంటే అర్ధమైపోతుంది. 
అనామిక: ఏం అర్థమైపోతుంది. 
కావ్య: నువ్వింక అత్తింటిలో అడుగు పెట్టదలచుకోలేదని.
అనామిక: మళ్లీ నేను ఆ ఇంటికి ఎందుకు వస్తాను. వస్తే గిస్తే కల్యాణే నా పుట్టింటికి రావాలి. భార్య చెప్తే వినని మనిషికి కోర్టు ద్వారా బుద్ధి చెప్పాలని ఇదంతా. కల్యాణ్  బిజినెస్ చూసుకోవాలి. కోట్లు సంపాదించాలి. అదంతా తీసుకొచ్చి నా ముందు గుమ్మరించాలి. అలా చేయని మనిషికి ఇలాగే బుద్ధి చెప్తే తప్ప దారిలోకి రాడు.
కావ్య: అంటే నువ్వు కల్యాణ్‌ మీద ప్రేమతో ఈ పెళ్లి చేసుకోలేదా. తన వెనక ఉన్న ఆస్తి చూసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా. 
అనామిక: మరి అంతే కదా. అందరూ నిన్ను స్వప్నని ఆస్తి కోసం ఆ ఇంటి కోడళ్లు అయ్యారని అంటారు. కానీ నాకు అలా అనిపించడం లేదు. కానీ నేను మీలా ఉండలేను. నాకు లగ్జరీగా ఉండటం ఇష్టం. 
కావ్య: అనామిక నువ్వు అడుగుపెట్టింది దుగ్గిరాల ఇంటిలో అక్కడ నీకు అవసరం అని అంటే ఎందుకు అని ఎదురు ప్రశ్నించకుండా డబ్బు ఇస్తారు కదా. అంతెందుకు నువ్వు మీ నాన్న పేరు మీద పదిలక్షల చెక్ పంపించనప్పుడు కూడా ఆ నిజం మీ అత్తగారికి తెలీదు అనుకున్నావా. మా అత్తగారికి తెలీదు అనుకున్నావా. వాళ్ల అత్తగారు అయిన అమ్మమ్మ గారికి తెలీదు అనుకున్నావా అయినా నీ విలువ కాపాడారు కదా. కల్యాణ్‌కి కూడా అర్థమైనా నిన్ను ఏమీ అనలేదు కదా.
అనామిక: ఆ పది లక్షలు పాతిక లక్షలు ఎవరికి కావాలి. కల్యాణ్ స్వరాజ్ గ్రూప్స్ ఎండీగా చేరితో కోట్లు సంపాదించొచ్చు.
కావ్య: మాట్లాడితే కోట్లు అంటున్నావ్ నువ్వేం చేసుకుంటావ్ అన్ని కోట్లు. నాకు అర్థమైంది. పది లక్షల కోసం నీ పుట్టింటి వాళ్లు దొంగతనం చేయించారు అంటే అర్థమైపోతుంది వాళ్లకి ఇంకెన్ని అప్పులు ఉన్నాయో అని.. అందుకే నువ్వు కల్యాణ్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నావ్. నీ మాట వినకపోయే సరికి మీడియా, పోలీస్ స్టేషన్, కోర్టు అంటూ ఇలా డ్రామాలు ఆడుతున్నావ్. ఇదంతా నీ పుట్టింటి వాళ్లకి దోచిపెట్టడానికే కదా. వాళ్ల అప్పులు తీర్చడానికి నీ జీవితం ఎలా బలి చేస్తున్నారో నీకు అర్థం కావడం లేదు. 
అనామిక: కనిపెట్టేశావ్. తెలివైన దానివే. కానీ కల్యాణ్ నీ అంత తెలివైన వాడు కాదు. అందుకే ఇంకా కనిపెట్టలేదు. అవును నా పుట్టింటి వాళ్లకి డబ్బు కావాలి. అది నా మొగుడు సంపాదించి ఇవ్వడు. ఇలా చేస్తే కల్యాణ్ బాబు, అతనికి బాబు, అతని బాబు కూడా దిగొస్తాడు. పరువు కోసం కల్యాణ్ నా కాళ్ల దగ్గరకు వస్తాడు. నేను పక్క ప్రణాళికతో కల్యాణ్‌ని ఈ కేసులో ఇరికించాను.  
కావ్య: మొత్తానికి నా కళ్లు తెరిపించావ్. 
అనామిక: నీకు అర్థమైంది కదా. ఈ అనామిక అంటే ఏంటో అర్థమైంది కదా. కల్యాణ్ నా కాళ్లు పట్టు కోకపోతే జైలుకి వెళ్లక తప్పదు.

అందరూ కోర్టు దగ్గరకు చేరుకుంటారు. కల్యాణ్ డౌన్ డౌన్ అంటూ మహిళా మండలి వాళ్లు నినాదాలు చేస్తుంటారు. మహిళా మండలి అధ్యక్షురాలు ఝాన్సీని మీడియా ప్రశ్నిస్తుంది. ఆవిడ తప్పు చేసిన ఎవరికైనా శిక్ష పడాలి అని లేదంటే ఊరుకోమని అంటుంది. ఇక  అప్పుడే అప్పు తన తల్లిదండ్రులతో కలిసి కోర్టుకి వస్తుంది. మీడియా వాళ్లని చుట్టు ముడుతుంది. కల్యాణ్‌కి నీకు ఎన్ని ఏళ్లగా అక్రమ సంబంధం ఉంది.. డబ్బు కోసమే ఈ సంబంధం పెట్టుకున్నారా అని రకరకాల ప్రశ్నలు అడిగి అప్పుని ఇబ్బంది పెడతారు. దీంతో కనకం మీడియా వాళ్ల మీద ఫైర్ అవుతుంది. అనామిక తమని బజారుకి ఈడ్చిందని.. దేవుడే ఉంటే నిజం బయటకు వస్తుందని అంటూ అప్పుని తీసుకొని కోర్టులోపలికి వెళ్లిపోతుంది.  కోర్టులో అనామిక బోనులో నిల్చొన్న కల్యాణ్ దగ్గరకు వెళ్లుంది.

అనామిక: ఎలా ఉంది నా ప్రతాపం.
కల్యాణ్: పసుపు కుంకుమ స్థానంలో బూడిద మిగులుతుందని తెలీని ఓ పచ్చిదాన్ని చూసి జాలేస్తుంది. 
అనామిక: నాకే నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎలా ఉండే నిన్ను ఎక్కడికి తీసుకు వచ్చానో చూశావా. ఇవాళ నిన్ను నీ ప్రియురాలు అప్పుని అందరి ముందు తల దించుకునేలా చేయకుంటే నా పేరు అనామిక కాదు.

జడ్జి వచ్చి లాయర్లు వాదిస్తే వద్దని ఇద్దరితో తానే మాట్లాడుతాను అని చెప్తాడు. గొడవలు జరగని ఫ్యామిలీలు భార్య భర్తలు ఉండరని ఉన్నత మైన ఫ్యామిలీకి చెందిన అబ్బాయి కాబట్టి విడాకుల దాకా వెళ్లకుండా సర్దుకుంటే మంచిదని ఓ అవకాశం ఇస్తున్నా అని ఇద్దరూ కలిసి ఉండటానికి ఒప్పుకుంటారా అని అడుగుతారు. దానికి అప్పు కల్యాణ్‌తో కలిసి ఉండటం తనకి ఇష్టమే కానీ అప్పుని బోనులో నిల్చొపెట్టాలి అని శిక్షించాలి అని అంటుంది. ఇక కల్యాణ్‌ తన కాళ్లు పట్టుకోవాలి అంటుంది. అనామిక మాటలకు జడ్జి కూడా షాక్ అయిపోతారు. తన కాళ్లు పట్టుకోక పోతే జైలుకి పంపేవరకు వదలనని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీ మిస్టరీని జాను కనిపెట్టేస్తుందా.. తనతో పాటు కలిసున్నది లక్ష్మి అని మిత్రకు తెలిసిపోతుందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget