అన్వేషించండి

Brahmamudi Serial Today September 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కలిసిపోయిన తల్లీకూతుళ్లు – హ్యపీమూడ్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ

Brahmamudi serial today episode September 16th: రేవతి, అపర్ణ కలిసిపోవడంతో రుద్రాణి అయోమయంలో పడిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: ముసుగులో వచ్చి అపర్ణను మోసం చేస్తున్నావా..? అంటూ రుద్రాణి కోపంగా రేవతిని తిడుతుంది. అయితే రాజ్‌ అడ్డుపడి రేవతిని తీసుకొచ్చింది నేనే అని చెప్తాడు. అందుకు తాము హెల్ప్‌ చేశామని ఫ్యామిలీ మెంబర్స్‌ చెప్తారు.

రుద్రాణి: అయితే అందరూ కలిసి మా వదినను మోసం చేశారా

ఇందిరాదేవి: రుద్రాణి మోసం చేసింది ఎవరు..?  రేవతికి తెలియని వయసులో తప్పుడు సలహాలు ఇచ్చి తను ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కారణం అయింది ఎవరు..? నువ్వు కాదా..?

రుద్రాణి: అంటే అప్పుడు రేవతి ప్రేమించిన వాడు దక్కకపోతే చచ్చిపోతాను అంటే ఏదో ధైర్యం కోసం

ఇందిరాదేవి: చాల్లే నోరు మూయ్‌ చేసిందే పనికిమాలిన పని మళ్లీ దాన్ని సమర్థించుకుంటున్నావా..? ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వు నేను కాదు.. అపర్ణ. ఇంత మంది రేవతి ఇంటికి రావాలని కోరుకుంటున్నాం.. అపర్ణ కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సింది.

రాజ్‌: అమ్మా అప్పుడెప్పుడో అక్క తప్పు చేసిందని ఇప్పటికి కూడా శిక్ష వేయడం సరి కాదమ్మా. అక్క పెళ్లి చేసుకునే సమయానికి నేను చిన్న పిల్లాడిని.. అక్క వెళ్లి పోతుంటే ఆపొచ్చు అనే విషయం కూడా తెలియదు నాకు. మీరందరూ పెద్ద వాళ్లు కదమ్మా అక్క వెళ్లిపోతుంటే ఎందుకు ఆపలేదు. మీకు చెప్పకుండా వెళ్లిపోవడం తప్పే.. కానీ దానికి ఇంత పెద్ద శిక్ష వేయాలా..? ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ల తప్పును కూడా క్షమిస్తే ప్రేమ ఉన్నట్టు.. అని నువ్వే చెప్పావు కదా అమ్మా.. మరి అక్కను ఎందుకు క్షమించలేదు అమ్మ. మనం అందరం ఉండి కూడా అక్క అనాథలాగా ఎక్కడో ఎందుకు ఉండాలి. తన బిడ్డకు ఎవ్వరూ లేరని ఎందుకు చెప్పుకోవాలి చెప్పు

కావ్య:  అత్తయ్యా తన  తప్పు తాను తెలుసుకుంది. తను ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాతే మీరు పడుతున్న బాధలను అర్థం చేసుకుంది. తను కోలుపోయిన తల్లి ప్రేమను తిరిగి పొందాలని ఆశ పడుతుంది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి అత్తయ్యా

ఇందిరాదేవి: నువ్వు దూరం పెట్టినప్పటి నుంచి అది ఎక్కడుందో తెలుసుకుని దాని బాగోగులు చూసుకోవాలని నేను మీ మామయ్య కలిసి తనకు ఎన్నో సార్లు డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించాము.. కానీ ఇది అమ్మ నాకు వేసిన శిక్ష నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి. అమ్మ నన్ను క్షమించింన రోజే నేను మళ్లీ ఆ ఇంటి బిడ్డను అవుతానని ఆ శిక్ష అనుభవిస్తుందే..

రాజ్: నీ కోపాన్ని పక్కన పెట్టి ఒక్కసారి అక్కను చూడమ్మా.. తన బాధను అర్థం చేసుకుని తనను క్షమించు అమ్మ

రుద్రాణి: అంటే ఏంట్రా ముసుగు వేసుకుని వచ్చి మోసం చేసినా కూడా తనను క్షమించాలా..?

అపర్ణ:  ముసుగులో ఉన్నది రేవతి అన్న విషయం నాకు తెలుసు.. నా కూతురును నేను గుర్తు పట్టలేనా.? మొదట్లో అది చేసిన పనికి కోపం వచ్చినా.. మెల్లమెల్లగా నాలో బాధ మొదలైంది. కానీ లాస్ట్‌ టైం అది ఇంటికి వచ్చినప్పుడు దాన్ని  చూసేసరికి అది చేసిన తప్పు గుర్తుకు వచ్చి దాని మీద అరిచేశాను. ఎప్పటికీ దాన్ని క్షమించకూడదు అనుకున్నాను. కానీ ఒక రోజు అనుకోకుండా నా మనవణ్ని తీసుకుని తన ఇంటికి వెళ్లాను..

అని ప్లాష్‌బ్యాక్‌ చెప్తుంది. రేవతి తన తల్లి అపర్ణను గుర్తు చేసుకుని ఏడుస్తుంది. అంతా గుమ్మం దగ్గర నిలబడి చూస్తుంది. అపర్ణ కూడా ఎమోషనల్‌ అవుతుంది.

అపర్ణ: ఆరోజు నిన్ను చూశాక నీ మాటలు విన్నాక నాలోని కోపం బాధ అన్నీ అక్కడే చచ్చిపోయాయి. ఇన్నేళ్లుగా నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థం అయింది. నువ్వు చెప్పింది నిజమేరా ఒక మనిషిని మనం ప్రేమించామంటే వాళ్ల తప్పులను కూడా క్షమించేంత గొప్పగా ప్రేమించాలి. కానీ కన్న కూతురు నాకు చెప్పకుండా పెళ్లి ఎలా చేసుకుంటుంది అనే కోపం నా ప్రేమను కప్పేసింది అనుకుంటా..? అందుకే దూరంగా వెళ్లిపోమ్మని శిక్షించాను..

రేవతి:  అమ్మా తప్పు నేను చేశాను.

అపర్ణ: నువ్వు ముసుగు వేసుకుని వచ్చినంత మాత్రాన నిన్ను  నేను గుర్తు పట్టలేనా..? నేను నీ తల్లినే నువ్వే కాదు.. నీ ఊపిరి తగిలితే పొంగిపోతానే

అనగానే.. రేవతి ఏడుస్తూ అపర్ణ కాళ్ల మీద పడుతుంది.

అందరూ కలసిపోతారు. హ్యాపీగా ఉంటారు. తర్వాత అప్పు రూంలో కూర్చుని కావ్య గురించి డాక్టర్‌ చెప్పిన విషయాలు గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఇంతలో కళ్యాణ్‌ వచ్చి ఓదారుస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కిడ్నాప్‌లో లీడ్ కనిపెట్టిన మహా! జల్లెడ పడుతున్న విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కిడ్నాప్‌లో లీడ్ కనిపెట్టిన మహా! జల్లెడ పడుతున్న విహారి!
Godavari Serial Today October 15th: 'గోదావరి' సీరియల్: జాను, సూర్యల లవ్ మేటర్ శేషుకి చెప్పేసిన సింహాద్రి! నందుకి డబ్బు ఇచ్చిన మురళీ!
'గోదావరి' సీరియల్: జాను, సూర్యల లవ్ మేటర్ శేషుకి చెప్పేసిన సింహాద్రి! నందుకి డబ్బు ఇచ్చిన మురళీ!
Nindu Manasulu Serial Today October 15th: నిండు మనసులు: ప్రేరణ ఇంటికి లగేజ్‌తో వచ్చేసిన సిద్ధూ! టాస్ గెలిచిన ప్రేరణ! సంతోషంలో రాజశేఖరం!
నిండు మనసులు: ప్రేరణ ఇంటికి లగేజ్‌తో వచ్చేసిన సిద్ధూ! టాస్ గెలిచిన ప్రేరణ! సంతోషంలో రాజశేఖరం!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 15: విక్కీని మెడపట్టి బయటకు గెంటేసిన రాధమ్మ..అత్తగారింట్లోనే ఉండిపోవాలని అల్లుడి నిర్ణయం
నువ్వులేక నేను లేను: విక్కీని మెడపట్టి బయటకు గెంటేసిన రాధమ్మ..అత్తగారింట్లోనే ఉండిపోవాలని అల్లుడి నిర్ణయం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget