అన్వేషించండి

Brahmamudi Serial Today September 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేవతిని చూసి షాకైన దుగ్గిరాల ఫ్యామిలీ – రుద్రాణిని తిట్టిన ఇందిరాదేవి

Brahmamudi serial today episode September 15th: ముసుగులో ఉన్నది రేవతి అని తెలుసుకున్న దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode: వినాయక చవితి సంబరాల్లో భాగంగా చీటీలు తీసి ఒక్కోక్కరుగా వచ్చి తమ ఫర్మామెన్స్‌ చేసి వెళ్తుంటారు. ఇంతలో రుద్రాణి రాజ్‌ దగ్గరకు వెళ్లి చీటీ తీయిస్తుంది. అందులో తన మొదటి ప్రేమ గురించి చెప్పాలి అని వస్తుంది.

కావ్య: వెళ్లండి నిజాయితీగా మీ మొదటి ప్రేమను చెప్పండి.. నేను అని మాత్రం అబద్దం చెప్పకండి. ఎందుకంటే ముందు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంది మా అక్కను.. ఆ విషయం మర్చిపోకండి.

రాజ్: సరే నిజాయితీగానే నా ప్రేమను చెప్తాను.. నిజాయితీగా నా ప్రేమను చెప్పమంటున్నారు. చెప్తాను.. కానీ దానికంటే ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి.. ప్రేమ గొప్పదా..? పెళ్లి గొప్పదా..?

అంటూ రాజ్‌ అడగితే ఎవరి  నుంచి సమాధానం రాదు.

రుద్రాణి: నువ్వు ప్రేమ గురించి చెప్పమంటే మమ్మల్ని ప్రశ్న వేస్తావేంటి..? రాజ్‌..

రాజ్: కొంత మంది పెద్దలు చేసిన పెళ్ళిల్లే కరెక్టు అని వాదిస్తే.. మరికొంత మంది ప్రేమ లేకపోతే అసలు పెళ్లే లేదంటారు. వీటిలో ఏది నిజం అనే ప్రశ్న జోలికి నేను వెళ్లడం లేదు.. కేవలం నా అనుభవం మాత్రమే చెప్పబోతున్నాను.. పెళ్లి రెండు అక్షరాలతో మొదలై మూడు ముళ్లతో బంధం వేసి నలుగురి చేత అక్షింతలు వేయించి.. పంచభూతాల సాక్షిగా నేనే ఆరోప్రాణం అంటూ నాతో ఏడడుగులు వేయించింది. దాని ప్రతిఫలం నాకు ఇష్టం లేని ఒక మనిషి జీవితాంతం నాతోనే ఉంటానంటూ నా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇష్టం లేని మనిషితో నేను ఎందుకు కాపురం చేయాలని దూరంగా వెళ్లిపోతూనే ఉన్నాను.. కానీ నేను ఎంత దూరం వెళితే అంత దూరం వెతుక్కుంటూ వచ్చింది నా కళావతి. ఇష్టం లేని పెళ్లి అని నేను అనుకున్నాను.. కానీ తను మాత్రం ఇది దేవుడు చేసిన పెళ్లి అనుకుంది. మూడు ముళ్లు వేసినందుకే నాకు జన్మజన్మలకు సరిపడా ప్రేమను ఇచ్చింది. అలాంటి మనిషికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. మళ్లీ జన్మంటూ ఉంటే తిరిగి తన భర్తను అవ్వడం తప్పా.. కళావతి గడిచిన కాలం.. ఆ పెళ్లితో నువ్వు పెట్టిన కన్నీళ్లను నేను మార్చలేను.. కానీ భవిష్యత్తులో మాత్రం నీకు కన్నీరంటే తెలియని ప్రపంచాన్ని ఇస్తాను. నువ్వు ఇచ్చిన ప్రేమను పదింతలు చేసి నీకు ఇస్తాను. నా దృష్టిలో పెళ్లే గొప్పది అంటాను. దానికి కారణం అయిన కళావతే గొప్పది అంటాను. ఇక మీరు అడిగిన మొదటి ప్రేమ గురించి చెప్పాలంటే.. మన కంపెనీ వంద సంవ్సరాలు పూర్తి చేసుకున్న రోజున ఇదే వినాయకుడి పూజలు చేసినప్పుడు చీకట్లో నీడ చాటున నాట్యం చేస్తున్న  ఒక బాపు బొమ్మను చూసి ఇష్టపడ్డాను. ఆ క్షణం నిజంగానే ఒక తెలియని అనుభూతి చెందాను. దాన్నే ప్రేమ అనుకున్నాను. తనను ఎలాగైనా చూడాలనుకున్నాను. కానీ నేను వెళ్లే సరికి తను మిస్‌ అయ్యింది. తర్వాత స్వప్న అదే పాటకి డాన్స్‌ వేస్తూ కనిపించింది. అప్పుడే నాకు అర్థం అయింది. ఆ నీడలో చూసిన అమ్మాయి  స్వప్న

స్వప్న:  అది నేను కాదు రాజ్‌.. ఆరోజు నిన్ను ఇంప్రెస్‌ చేయాలంటే డాన్స్‌ చేయాలనుకున్న కానీ నాకు డాన్స్‌ రాదు.. అందుకే ఒకరి సాయం తీసుకున్నాను.. చీకట్లో డాన్స్‌ వేస్తుంటే.. నువ్వు చూసి మనసు పారేసుకుంది ఎవరి మీదో కాదు మా కావ్య మీదే.. తనే నాకు డాన్స్‌ నేర్పించింది

రాజ్‌: అయితే మొదటిగా ఇష్టపడింది.. మొదటిగా ప్రేమించింది.. మొదటిగా పెళ్లి చేసుకుంది.. నిన్నే అన్నమాట

కావ్య:  అవునండి

సీతారామయ్య:  ఓరేయ్‌ మనవడా నీ ప్రేమ నిజంగా చాలా గొప్పదిరా.. అందుకే మేమందరం కలసి నీకు స్వప్నతో పెళ్లి చేయాలని చూసినా.. నీకు కావ్యతోనే పెళ్లి జరిగింది. నాకు ఇప్పుడు అర్థం అయింది ఎందుకో

ఇందిరాదేవి: అదే ఆ దేవుడు మీకు ఎప్పుడో బ్రహ్మముడి వేశాడు.. మీకు ఆ విషయం ఆలస్యంగా తెలిసింది అన్నమాట..

రుద్రాణి: ఓకే ఈ రకంగా ఓ నిజం బయట పడింది. రాజ్‌ మొదటి ప్రేమ కావ్య అని తెలిసిపోయింది. ఓకే ఇప్పుడు దాదాపు అందరూ కవర్‌ అయిపోయారు.. ఇక మిగిలించి మన గెస్ట్‌ మాత్రమే.. తను కూడా చీటి తీస్తే ఓపెన్‌ అయిపోతుంది.

రేవతి:  అయ్యో నా వల్ల కాదండి..

అని చెప్తున్నా వినకుండా రుద్రాణి బలవంతంగా రేవతి చేత చీటీ తీయించి డాన్స్‌ చేయిస్తుంది. డాన్స్‌ చేస్తుంటే ముసుగు తీసేస్తుంది. రేవతిని చూసిన అందరూ షాక్‌ అవుతారు. రుద్రాణి కోపంగా అపర్ణను రెచ్చగొడుతూ రేవతిని తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 8: పిచ్చాసుపత్రిలో రాగిణిని కిడ్నాప్ చేసిన మీనన్‌...తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించిన రాగిణి
జగద్ధాత్రి సీరియల్: పిచ్చాసుపత్రిలో రాగిణిని కిడ్నాప్ చేసిన మీనన్‌...తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించిన రాగిణి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్‌ ఎవరిది? అంబిక దొరికిపోతుందా! మహా విహారికి ఏం చెప్పింది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్‌ ఎవరిది? అంబిక దొరికిపోతుందా! మహా విహారికి ఏం చెప్పింది!
Godavari Serial Today October 8th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌, జానుల రొమాంటిక్ హగ్! తాళి తీసి నాతో వచ్చేయ్ అని జానుకి షాక్ ఇచ్చిన సూర్య!
'గోదావరి' సీరియల్: సంజయ్‌, జానుల రొమాంటిక్ హగ్! తాళి తీసి నాతో వచ్చేయ్ అని జానుకి షాక్ ఇచ్చిన సూర్య!
Nindu Manasulu Serial Today October 8th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల చేతుల్లో రౌడీ హతం! సిద్ధూ జాబ్ రిస్క్‌లోకి వెళ్తుందా!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల చేతుల్లో రౌడీ హతం! సిద్ధూ జాబ్ రిస్క్‌లోకి వెళ్తుందా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget