అన్వేషించండి

Brahmamudi Serial Today September 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్య గురించి ఎమోషనల్‌ అయిన అప్పు – రాహుల్‌ ఆటాడుకున్న దుగ్గిరాల ఫ్యామిలి

Brahmamudi serial today episode September 13th: ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే.. అప్పు మాత్రం కావ్య గురించి తలుచుకుంటూ ఎమోషనల్‌ అవుతుంది.

Brahmamudi Serial Today Episode:  స్వరాజ్‌కు ప్రేమగా అన్నం తినిపిస్తున్న అపర్ణను చూసిన రేవతి బాధగా బయటకు వెళ్తుంది. ఏమైందని అందరూ చూస్తుంటే.. మేము వెళ్లి తెలుసుకుంటామని రాజ్, కావ్య వెళ్తారు.

రాజ్: ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు తలుచుకుని ఎందుకు బాధపడుతున్నావు అక్కా

కావ్య: రేవతి గారు ఈ రోజు మీరు కోరుకుంది జరిగింది కదా ఎందుకు బాధపడుతున్నారు పదండి భోజనం చేద్దాం

రేవతి: వాళ్లు చూపించే ప్రేమను చూసి తట్టుకోలేకపోయాను. అందుకే దొరికిపోతానేమోనని భయపడ్డాను.

రాజ్: అక్కడే ఉంటే నువ్వు ఒక్కదానివే దొరికిపోయేదానివి ఇక్కడైతే మన ముగ్గురం దొరికిపోతాము పద అక్కా లోపలికి వెళ్దాం.

ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు.

అపర్ణ: అదేంటి రాధ అలా వెళ్లిపోయావేంటి..?

కావ్య: వాళ్ల అమ్మ వాళ్లు గుర్తుకు వచ్చారట

రుద్రాణి:  ఎందుకు మీరు మీ అమ్మ వాళ్లతో కలిసి ఉండటం లేదా..? ఎందుకు దూరంగా ఉన్నారు.. గొడవ అయిందా..?

రాజ్: అంటే అత్తా వాళ్ల అమ్మా నాన్నలు ఈ ఊరిలో ఉండరట.. ఎక్కడో వైజాగ్‌లో ఉంటారట.. ఎప్పుడో తప్పితే రారట. అలాంటిది అమ్మ వాడిని ఒడిలో కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తుంటే చూసి కొంచెం ఎమోషనల్ అయింది అంతే

కావ్య: ఏ బిడ్డకైనా అలా అమ్మమ్మ ప్రేమ దొరికితే తన తల్లికి ఆనందమే కదా రుద్రాణి గారు ఈ చిన్న విషయం మీకు తెలియకపోవడం విచిత్రంగా ఉంది.

అపర్ణ:  దీనికే కన్నీళ్లు పెట్టుకోవాలా రాధ. వీడే కాదు నువ్వు కూడా ఎప్పుడు కావాలన్న ఇంటికి రావొచ్చు.. వీడికి నాకు మధ్య బంధం ఏంటో నాకు తెలియదు కానీ వీడిని చూసిన ప్రతిసారి ఈ ఇంటి మనిషిలా అనిపిస్తాడు. మీ అమ్మా నాన్నలు దూరంగా ఉన్నారని అస్సలు బాధపడొద్దు నేను కూడా మీ అమ్మే అనుకో

రుద్రాణి: ( మెల్లగా) అమ్మలా అనుకోవడం ఏంటి..? అమ్మే కదా

రాహుల్‌: ఆ విషయం మనం ఫ్రూవ్‌ చేయాలి మమ్మీ

రుద్రాణి: వీళ్ల భోజనం పూర్తి అయ్యే లోపు దాని ముసుగును ఎలా తొలిగిస్తానో చూడు

అంటుంది. అందరూ భోజనం చేయండి అని ఇందిరాదేవి చెప్పగానే.. అందరూ భోజనం చేస్తుంటారు. ఇంతలో రుద్రాణి వాటర్‌ తీసుకెళ్లి కావాలని రేవతి మీద పోస్తుంది అయ్యో బట్టలు తడిశాయి మీ ముసుగు తీయండి అంటూ లాగుతుంది. రేవతి వద్దండి అంటూ పట్టుకుంటుంది.

రుద్రాణి: ఇక్కడ ఎవరు పరాయి వాళ్లు ఉన్నారు.. పైగా మా వదిన కూడా అమ్మ లాంటిది అని చెప్పింది. ఆలోచించకుండా ముసుగు తేసేయండి.

రేవతి: అయ్యో పర్వాలేదండి.. ఉండనివ్వండి

అపర్ణ: రుద్రాణి.. ఎవరి ఆచారాలు వాళ్లవి పర్వాలేదు అంటుంది కదా..? ఎందుకు బలవంతం చేస్తావు.. తన మీద నీళ్లు పోయడం నీ తప్పు.. అమ్మ రాధ నీకు ఇబ్బందిగా ఉంటే రూంలోకి వెళ్లి ఫ్రెష్‌ అయి రా

రేవతి: సరేనండి

రేవతి రూంలోకి వెళ్తుంది. ఇప్పుడు తప్పించుకున్నావు తర్వాత ఫంక్షన్‌లో ఎలా తప్పించుకుంటావో చూస్తాను. తర్వాత అప్పు బయటకు వెళ్లి కావ్య గురించి డాక్టర్‌ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుని బాధపడుతుంటే.. కళ్యాణ్‌ వచ్చి ఓదారుస్తాడు. తర్వాత అందరూ హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఒక బౌల్‌లో కొన్ని చిట్టీలు తీసుకుని రుద్రాణి వస్తుంది. అందరినీ పిలుస్తుంది.

స్వప్న: ఫ్యామిలీ అన్నా  ఫ్యామిలీ ఫంక్షన్స్‌ అన్నా అసలు నచ్చని మా అత్తయ్య గారు ఈరోజేంటే.. ఈ పంక్షన్ ని బలే ప్లాన్‌ చేశారు.

రుద్రాణి: హ్యాపీగా ఉండటం కూడా తప్పేనా

ఇందిరాదేవి: అదంతా తర్వాత కానీ ఇంతకీ ఆ బౌల్‌లో ఏం రాసుకొచ్చావు

రుద్రాణి: ఈ చీటిలలో ఎవరేం చేయాలో రాసుకొచ్చాను. ఒక్కోక్కరు వచ్చి చీటీలు తీయాలి. అందులో వాళ్లకు ఏం చేయాలని వస్తుందో అది చేయాలి. ముందు నాన్న గారితో మొదలు పెడదాం

అంటూ సీతారామయ్య దగ్గరకు వెళ్తుంది. ఆయన తీసిన చీటీలో డైలాగ్‌ చెప్పాలని వస్తుంది. ఆయన డైలాట్‌ చెప్తాడు. ఇక అందరూ ఒక్కోక్కరుగా చీటీలు తీసి తమకేం వచ్చిందో అది చేస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Lahari: చక్రవాకం, మొగలిరేకులు హీరోయిన్.. చైల్డ్ ఆర్టిస్ట్ టూ లగ్జరీ లైఫ్.. లహరి అన్ టోల్డ్ స్టోరీ!
చక్రవాకం, మొగలిరేకులు హీరోయిన్.. చైల్డ్ ఆర్టిస్ట్ టూ లగ్జరీ లైఫ్.. లహరి అన్ టోల్డ్ స్టోరీ!
Jagadhatri Serial Today JULY 22th: అడవి నుంచి తప్పించుకున్న మీనన్‌....జేడీ టీంలోకి కొత్తగా వచ్చిన సింధూ
జగద్ధాత్రి సీరియల్: అడవి నుంచి తప్పించుకున్న మీనన్‌....జేడీ టీంలోకి కొత్తగా వచ్చిన సింధూ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
Godavari Serial Today July 22nd: 'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget