అన్వేషించండి

Brahmamudi Serial Today September 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఫుల్ ఎంజాయ్ చేసిన రాహుల్, రుద్రాణి – కోమాలోంచి బయటకు వచ్చిన అపర్ణ

Brahmamudi Today Episode: ఇంట్లోంచి అందరినీ వెళ్తగొట్టడంలో సక్సెస్ అయ్యామని రాహుల్, రుద్రాణి పార్టీ చేసుకోవడంతో ఇవాల్టీ ఏపిసోడ్ ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  అమ్మ చావు బతుకుల్లో ఉంటే.. దానికి కారణమైన మనిషిని వెనకేసుకొస్తూ.. మన బ్లడ్‌ రిలేషన్‌‌ నే అనుమానిస్తున్నావా? కళ్యాణ్‌ అంటూ రాజ్‌ ఎమోషనల్‌ గా ఫీలవుతాడు. ఎవరి కోసమో మన ఇద్దరి మధ్య ఆవేశాలు వద్దు కళ్యాణ్‌ నువ్వు ప్రశాంతంగా ఉండు అంటాడు రాజ్. నేను ప్రశాంతంగా ఉండాలంటే ముందు నువ్వు వెళ్లి వదినను ఇంటికి తీసుకురావాలని కళ్యాణ్‌ చెప్తాడు.

రాజ్: నేను ఎప్పటికీ అలా చేయను. తను తప్పు చేసిందని ఫీల్ అయింది కాబట్టే వెళ్లిపోయింది.

కళ్యాణ్‌: వదిన పారిపోలేదు అన్నయ్య. భర్తగా నువ్వు నిలబడాల్సిన విధంగా, నమ్మాల్సిన విధంగా నమ్మలేదు కాబట్టి మనసు విరిగిపోయి వెళ్లిపోయింది.

రాజ్‌: నేను వెళ్లమనలేదు. రమ్మనలేను. నేను ఏ తప్పు చేయలేదు. తీసుకొచ్చే ప్రసక్తే లేదు.

కళ్యాణ్‌: ఇంత బండరాయిలా ఎలా మారావ్ అన్నయ్య. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. అప్పుడే నీకు వదిన విలువ తెలుస్తుంది.

 అని కళ్యాణ్‌ వెల్లబోతుంటే ధాన్యలక్ష్మీ వచ్చిపరాయి ఇంటి ఆడదాన్ని బాగా అర్థం చేసుకున్నావు. కానీ ఈ కన్నతల్లిని ఎందుక అర్థం చేసుకోలేదు అని అడుగుతుంది. దీంతో కళ్యాణ్‌ కోపంగా ధాన్యలక్ష్మీని తిడుతూ వదిన ఇల్లు వదిలి వెళ్లిపోవడంలో నీ పాత్ర ఎంత ఉందని నిలదీసి వెళ్లిపోతాడు.  తర్వాత తాము  అనుకున్నది సక్సెస్ అయిందని రుద్రాణి, రాహుల్ సంతోషంగా డ్యాన్స్ చేస్తుంటారు.

రుద్రాణి: కల్యాణ్‌ను రాకుండా చేశాం.  కావ్యను కూడా పంపించాం.  మా వదిన ప్రాణాలు పోయేలా చేశాము.

రాహుల్‌: అత్తయ్య తిరిగి ప్రాణాలతో రాదు. దాంతో రాజ్ పిచ్చోడు అయిపోతాడు. అప్పుడు ఆస్తి గురించి పట్టించుకోడు. సో.. మనదే రాజ్యం.    

  ఇంతలో స్వప్న వస్తుంది. ఇద్దరూ డాన్స్‌ చేయడం చూసి తిడుతుంది. స్వప్నను చూసిన రాహుల్‌, రుద్రాణి తాము మాట్లాడుకుంది వినేసిందా? అని టెన్షన్‌ పడుతుంటారు. ఇంట్లో ఇంత పెద్ద గొడవ అయింది. అపర్ణ అత్త హాస్పిటల్‌లో ఉన్నారు. అవేం పెట్టించుకోకుండా తాగి చిందులేస్తున్నారా? మీరు మనుషులేనా అసలు అంటూ.. మా చెల్లి, అపర్ణ అత్త విషయంలో మీ హస్తం ఏమైనా ఉందా? ఉంటే మీకు చిత్తడే అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది స్వప్న. మరోవైపు కనకం, కృష్ణమూర్తి కావ్య గురించి మాట్లాడుకుంటూ బాధపడుతుంటారు. కనకం ఇందిరాదేవికి ఫోన్‌ చేస్తుంది.

కనకం: నమస్కారం అమ్మా..

ఇందిరాదేవి: కూతురు పుట్టింటికి వచ్చినా ఇంకా నమస్కారం చెబుతున్న నీ సంస్కారం నన్ను ఇంకా సిగ్గుపడేలా చేస్తుంది కనకం.

కనకం: తప్పు చేస్తే నిలదీసే పెద్దరికి మీకుంది. అలాగే నా కూతురు తప్పు చేయదన్న నమ్మకం నాకుంది. అసలు ఏం జరిగిందో తెలియక కంగారుపడుతున్నాం మేము.

ఇందిరాదేవి: మీరు కంగారు పడటానికి తప్పు చేసింది నీ కూతురు కాదు కనకం నా మనవడు.

కనకం: కానీ శిక్ష పడింది మాత్రం నా కూతురుకు. ఇప్పుడు నా కూతురు బతుకు ఏంటి?

ఇందిరాదేవి:  మా పెద్దరికాన్ని పక్కన పెట్టి ఎవరి నిర్ణయాన్ని వారే తీసుకున్నారు. నువ్వు అడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నన్ను క్షమించు కనకం.

 అంటూ ఇందిరాదేవి ఫోన్‌ కట్‌ చేస్తుంది. మరోవైపు కళ్యాణ్‌, అప్పు బాధపడుతుంటారు. వదిన వెళ్లిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది అంటూ ఏడుస్తుంటాడు. వాళ్లిద్దరూ ఎప్పటికీ దూరంగా ఉండాల్సిందేనా అంటూ బాధపడతాడు. తర్వాత ఇందిరాదేవి రాజ్‌ దగ్గరకు వెళ్లి తిడుతుంది. మీ పంతాలకు పోయి మా మనసులు కష్టపెడుతున్నారు అంటూ నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా ఆ పిచ్చిది నిన్ను భరించింది కానీ తెలియకుండా అది ఒక్క పొరపాటు చేసిందని ఇంట్లోంచి వెళ్లిపోతుంటే ఆపకుండా ఉండిపోయావు అంటూ బుద్ది చెప్తుంది. తర్వాత అపర్ణ కళ్లు తెరిచి కావ్యను అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వకు వార్నింగ్ ఇచ్చిన శోభ – చెర్రికి నిజం చెప్పిన భూమి

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నా ప్రాణాలు కాపాడిన బంటీ అనాథ.. నేనే దత్తత తీసుకుంటా: అంబిక నిర్ణయంతో అంతా షాక్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నా ప్రాణాలు కాపాడిన బంటీ అనాథ.. నేనే దత్తత తీసుకుంటా: అంబిక నిర్ణయంతో అంతా షాక్!
Godavari Serial Today September 4th: 'గోదావరి' సీరియల్: ఇద్దరి భామల మధ్య ఇరుక్కున్న మురళీ! ఆ ఆంబోతు ఎవరు? రెంట్ 5 లక్షలా!
'గోదావరి' సీరియల్: ఇద్దరి భామల మధ్య ఇరుక్కున్న మురళీ! ఆ ఆంబోతు ఎవరు? రెంట్ 5 లక్షలా!
Nindu Manasulu Serial Today September 4th: నిండు మనసులు: ఐపీఎస్ చేయను.. ఇంట్లో నిర్ణయం చెప్పేసిన ప్రేరణ! భర్తగా చనిపోయానని సిద్ధూ అనడానికి కారణమేంటి?
నిండు మనసులు: ఐపీఎస్ చేయను.. ఇంట్లో నిర్ణయం చెప్పేసిన ప్రేరణ! భర్తగా చనిపోయానని సిద్ధూ అనడానికి కారణమేంటి?
Nindu Noorella Saavasam Serial Today September 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును సేవ్‌ చేసిన అమర్‌ - మనోహరిని అనుమానించిన భాగీ
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును సేవ్‌ చేసిన అమర్‌ - మనోహరిని అనుమానించిన భాగీ

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
Sahaa Movie : గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Embed widget