అన్వేషించండి

Brahmamudi Serial Today September 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: మరో కొత్త ప్లాన్‌ వేసిన రుద్రాణి – రుద్రాణిని టార్చర్‌ చేసిన స్వరాజ్‌

Brahmamudi serial today episode September 10th: తీర్థంలో పౌడర్‌ కలపిన రుద్రాణి ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌ అవ్వడంతో మరో కొత్త ప్లాన్‌ వేస్తుంది రుద్రాణి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode: పంతులును పక్కకు పంపించి తాను తీసుకొచ్చిన పౌడర్‌ తీర్థంలో కలిపి హ్యాపీగా లేచి తిరిగి చూస్తుంది. వెనక జూనియర్‌ స్వరాజ్‌, కనకం చూస్తూ ఉంటారు. వాళ్లను చూసిన రుద్రాణి షాక్‌ అవుతుంది.

రుద్రాణి: వీళ్లేంటి నన్ను ఇలా చూస్తున్నారు.. కొంపతీసి నేను తీర్థంలో పౌడర్‌ కలిపింది చూశారా ఏంటి..? ( మనసులో అనుకుంటూ) ఏంటి నా వైపు అలా చూస్తున్నారు..

కనకం:  నువ్వు చేసిన పనికి

రుద్రాణి: ( మనసులో) డౌటే లేదు.. వీళ్ల వాలకం చూస్తుంటే కచ్చితంగా చూసేసినట్టే ఉన్నారు

స్వరాజ్: ఏంటి తప్పు చేశానని భయపడుతున్నావా..?

రుద్రాణి: నేనా నేను తప్పు  చేయడం ఏంటి.. ? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు

స్వరాజ్‌: నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు తెలయదా..? ఏం చేస్తున్నావు ఇక్కడ..?

రుద్రాణి: నేనా నేనేం చేయట్లేదే..

స్వరాజ్: నేను ఇందాక ఏం చెప్పాను.. జ్యూస్‌ ఇవ్వమని అడిగాను కదా.? ఈ ఇంటి వారసుడు జ్యూస్‌ అడిగితే ఇవ్వాలని తెలియదా..?

రుద్రాణి: ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు.. ఇది నా ఇల్లు.. నా ఇష్టం.. నాకు పని చేయాలనిపిస్తే చేస్తాను  లేదంటే కాలీగా తిరుగుతాను.. అయినా నువ్వు ఓనర్ అనుకుంటున్నావా..?

కనకం: అవును నా డార్లింగ్‌ ఇప్పుడు ఓనరే.. ఇందాక వదిన ఏం చెప్పిందో విన్నావు కదా.?

రుద్రాణి: ఏంటి డార్లింగా..? ఇదెప్పుడో

స్వరాజ్: అవును నేను తనకు డార్లింగ్‌.. తను నాకు డార్లింగ్‌.. అయినా నాకు జ్యూస్‌ తెస్తావా..? నా ఫ్రెండ్‌కు చెప్పనా..

అనగానే సరే ఉండు.. నేను పౌడర్‌ కలిపింది చూడలేదు అన్నమాట అని మనసులో అనుకుని రుద్రాణి వెళ్లిపోతుంది. గణపతి పూజ చేస్తారు. పూజ అయిపోయాక కావ్య హారతి ఇస్తుంటే.. అపర్ణ తాను ఇస్తానని తీసుకుంటుంది. అందరూ హారతి తీసుకుంటారు.

పంతులు: ఇక అందరూ తమ కోరికలు వినాకుడికి విన్నవించుకుంటూ దండం పెట్టుకోండి

అపర్ణ: ఓరేయ్‌ ఫ్రెండ్‌ అంత సేపు మొక్కావు ఏం కోరుకున్నావు.

స్వరాజ్: మనం కోరుకున్న కోరికలు బయటకు చెప్పకూడదు ఫ్రెండు..

అపర్ణ: నేను నీ ఫ్రెండే కదా చెప్పొచ్చులే..

స్వరాజ్‌: నేను ఎప్పటికీ ఈ ఇంటిలోనే ఉండిపోవాలని కోరుకున్నాను..

అపర్ణ:  అయితే లైఫ్‌లాంగ్‌ ఉంటావా..? ఏమ్మా మా ఇంట్లోనే ఉంచుతావా..?

ఇందిరాదేవి: ఏంటి అపర్ణ అలా అడగొచ్చా…? వాళ్లు ఏమనుకుంటారు..?

రేవతి ఏడుస్తూ బయటకు వెళ్లిపోతుంది. వెనకాలే రాజ్‌ వెళ్తాడు. ఏడుస్తున్న రేవతి ఓదారుస్తాడు. ఇంతలో పంతులు తీర్థం అందరూ తీసుకుందురు రండి అని పిలుస్తాడు.. పంతులు తీర్థం ఇస్తుంటే.. స్వరాజ్‌ ముందు నాకు అంటూ వెళ్లి పంతులును తగులుతాడు. తీర్థం మొత్తం కింద పడిపోతుంది. రుద్రాణి కోపంగా స్వరాజ్‌ను తిడుతుంది.

రుద్రాణి: ఏరా ఉన్న వాడివి ఒక్కచోట ఉండలేవా..? తీర్థం మొత్తం ఎలా ఒలికిపోయిందో చూడు

రేవతి:  ఏదో చిన్న పిల్లాడు తప్పై పోయింది. క్షమించండి.

రుద్రాణి: ఏంటి చిన్న పిల్లాడా..? ఇలా పరాయి వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదా..? నీకు ..

అపర్ణ: రుద్రాణి ఏంటా మాటలు ఇంటికి వచ్చిన అతిథులతో ఇలాగేనా మాట్లాడేది.

రుద్రాణి: అది కాదు వదిన తీర్థం అలా కింద పడిపోతే ఇంటికి ఎంత అరిష్టం.

ఇందిరాదేవి: అని నీకు ఎవరు చెప్పారే.. తీర్థం కింద పడితే అరిష్టం.. పిల్లి ఎదురొస్తే కష్టం.. బల్లి మీద పడితే ప్రమాదం అని మన హిందూ ధర్మాలలో ఎక్కడా చెప్పబడలేదు ముందు ఆ అమ్మాయికి సారీ చెప్పు

రుద్రాణి: సారీనా నేనా నెవర్‌ చెప్పను..

రేవతి: పర్వాలేదు నాన్నమ్మ గారు తప్పు మాదే నేనే బాబును జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోసారి అలా జరగదు..

అపర్ణ: ఏంటి రాధ అలా మాట్లాడతావు.. చిన్న పిల్లాడు అన్నాక అల్లరి చేయాలి. ఆట పట్టించాలి. అదే కదా వాడికి ఆనందం.. పైగా వీడెవడు నా ఫ్రెండ్‌.. వీడు ఏం చేసినా రైటే.. ఈ ఇంట్లో ఎవ్వరూ తప్పు పట్టడానికి వీలులేదు..

స్వరాజ్‌: ఆ విషయం ముందు మీ రుబ్బురోలుకు చెప్పు

రుద్రాణి: ఎవ్వడ్రా రుబ్బు రోలు వేలేడంత లేవు నాకే పేరు పెడతావా..?

కనకం: ఏంటి రుద్రాణి ఇది.. నీ గొడవలకు చిన్నా పెద్ద తేడా లేదా..? ఆఖరికి ఆ చిన్న పిల్లాడి చేత కూడా మాట అనిపించుకోవాలా..?

ఇందిరాదేవి: మా రుద్రాణికి మాట పడనిదే ముద్దు దిగదులే కనకం

సీతారామయ్య: రుద్రాణి పిల్లలు దేవుడికి ప్రతిరూపాలు అంటారు. వీడి చేత ఏ మంచి కోసం విఘ్నేశ్వరుడు అలా చేయించాడో మనకేం తెలుసు..

అనగానే.. రుద్రాణి, రాహుల్‌ అలిగి వెళ్లిపోతాడు.

రాహుల్‌: ఏంటి మమ్మీ మనం అనుకున్న ప్లాన్‌ ఇలా ఫెయిల్‌ అయింది

రుద్రాణి: చెప్పాను కదా మనం ఇంకా గట్టిగా ఆలోచించాలి.. ముందు ఆ కావ్య సంగతి కాదు.. ఇంటికి వచ్చిన అతిథి గురించి ఆలోచించాలి

అంటూ రుద్రాణి కొత్త ప్లాన్‌ వేస్తుంది. తర్వాత కిచెన్‌లోకి వెళ్లిన కావ్యను వెనక నుంచి వెళ్లి హగ్‌ చేసుకుంటాడు రాజ్. కావ్య అదిరిపడుతుంది. వెంటనే అక్కడికి వచ్చిన ఇందిరాదేవి రాజ్‌ను తిట్టి పంపిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
Nindu Manasulu Serial Today October 14th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
Embed widget