అన్వేషించండి

Brahmamudi Serial Today October 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అప్పు కావ్యల మధ్య గొడవ – అప్పూను ఓదార్చిన కళ్యాణ్‌  

Brahmamudi serial today episode October 6th: విడాకుల విషయంలో కావ్య, అప్పును తిట్టడంతో ధాన్యలక్ష్మీ, కావ్యను తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది  

Brahmamudi Serial Today Episode: అప్పు కావ్యల మధ్య విడాకుల విషయంలో చర్చ జరుగుతుంది. కావ్య ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. అప్పు: ఏంటి అక్కా విడాకుల గురించి అడగ్గానే.. సైలెంట్‌ అయిపోయావు.. ఇంతకాలం బావే ప్రాణంగా బతికిన నువ్వు ఇప్పుడు ఏకంగా ఆయనతో బంధమే వద్దు అంటున్నావు.. అక్కా నువ్వె చెప్తుంటావు కదా మనం వెళ్లే దారిలో ముళ్లు ఉంటే వాటిని దాటుకుని వెళ్లాలి కానీ దారి మళ్ళి వెళ్లకూడదని..నువ్వే చెప్తుంటావు కదా..? ఇది కరెక్టు కాదు అక్కా నువ్వు బావకు విడాకులు ఇవ్వాలనుకోవడం కరెక్టు కాదు అక్క..

కావ్య: ఆయన చేస్తుంది కరెక్టేనా అప్పు.. నాకు తెలియకుండా నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లి అబార్షన్‌ చేయించాలనుకున్నారు.. చెప్పు అప్పు ఆయన చేస్తుంది కరెక్టేనా అప్పు.. (అప్పు సైలెంట్‌గా చూస్తుంది.) నా బిడ్డను చంపుకోమని నాతో ఆయన గొడవ చేసినప్పుడల్లా నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు.. అంతెందుకు నువ్వు కొద్ది రోజుల్లో తల్లివి అవుతున్నావు కదా..? నా స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు అప్పు… సడెన్‌గా కవిగారు వచ్చి నిన్ను అబార్షన్‌ చేయించుకో అని చెబితే నువ్వు ఎలా ఫీలవుతావు అప్పు.. చూశావా అప్పు ఇంత దానికే నీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మరి నాకెలా ఉంటుందో తెలుసుకో అప్పు.. ఆయన నా బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నాడో చెప్పకపోతే నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అప్పు

అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. అప్పు ఏడుస్తూ…

అప్పు:  నీ ప్రాణం కోసం బావ ఆరాటపడుతుంటే ఆయన బంధాన్ని వదులుకోవాలనుకుంటున్నావా..? అక్కా

ఇద్దరూ మాట్లాడుకోవడం స్టెప్స్ మీద నిలబడి అంతా వింటుంది రుద్రాణి. తర్వాత సీతారామయ్య రాజ్‌ను పిలిచి మందలిస్తాడు. నీవల్ల కుటుంబం పరువు రోడ్డున పడిందని కోప్పడతాడు. రాజ్‌ సైలెంట్‌గా చూస్తుంటాడు. కావ్య నీకోసం ఎంతో చేసింది. ఎన్నో బాధలు పడింది. కావ్య కోసమైనా నువ్వు నీ నిర్ణయం మార్చుకో అని చెప్తాడు. రాజ్‌ పలకకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రూంలో ఉన్న అప్పు దగ్గరకు ధాన్యలక్ష్మీ వెళ్తుంది.

ధాన్యం: అప్పును డిన్నర్‌ చేద్దువు రా

అప్పు: నాకు ఆకలిగా లేదు అత్తయ్యా మీరు వెళ్లండి

ధాన్యం: ఆకలిగా లేదా..? మీ అక్క గురించి ఆలోచిస్తూ తినకూడదు అనుకుంటున్నావా..? నేను ఆడదానినే అప్పు.. నాకు అన్ని తెలుసు.. ఈ టైంలో ఆకలి లేదు అనడం అబద్దం ఈ టైంలో ఎంత ఎక్కువ ఫుడ్‌ తీసుకుంటే అంత మంచిది

అప్పు: కాసేపాగి తింటాను అత్తయ్య

అని  అప్పు చెప్పగానే.. ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర రుద్రాణి అప్పు ఎందుకు తినడం లేదో మీకు తెలుసా..? అంటూ కావ్య వల్లే అంటుంది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్తుంది.

రుద్రాణి: కావ్యను విడాకులు గురించి అడిగింది అప్పు.. అప్పుడు కావ్య అప్పును తిట్టింది. అందుకే అప్పు తినడం లేదు.

అపర్ణ:  ఏంటి రుద్రాణిని ఎప్పుడు నా కోడలి మీద పడి ఏడ్వడమేనా..?నీ పని

రుద్రాణి: నన్ను తిట్టడం కాదు వదిన తను అప్పును తిట్టిందో లేదో మీరే అడగండి

అపర్ణ: ఏంటి కావ్య నువ్వు అప్పును తిట్టావా..?

కావ్య: తిట్టాను అత్తయ్యా కానీ

ఇందిరాదేవి: అప్పును ఎందుకు అన్నావు కావ్య

కావ్య:  నేనేం కావాలని తిట్టలేదు అమ్మమ్మగారు ఏదో కోపంలో

ధాన్యం: ఏంటి కోపంగా నువ్వు తిట్టడానికి నా కోడలే దొరికిందా..? ఇప్పటికే మీ కారణంగా ఈ ఇంట్లో గొడవలకు అప్పు నలిగిపోతుంది. తను ఎప్పుడు చూసినా డల్లుగానే ఉంటుంది. ఇప్పుడు తను బాధపడుతుంది చాలదు అన్నట్టు స్పెషల్‌ గా మాటలతో మనసు విరిచేసి బాధపెట్టాలని చూస్తున్నావా..?

కావ్య:  అది కాదు అత్తయ్యా..

ధాన్యం: ఏంటి అది కాదు.. రెండు రోజుల నుంచి అప్పు కనీసం జ్యూస్‌ కూడా తాగడం లేదు. ఎలా ఇచ్చిన గ్లాస్‌ అలాగే ఉంచుతుంది. నేను ఇంకా వికారంతోనేమో అనుకున్నాను.. కానీ నీ కారణంతోనే అని ఇప్పుడు అర్థం అయింది. ఏంటి కావ్య మీ గొడవల్లోకి నా కోడలును ఎందుకు లాగుతున్నారు.. మీలాగే అప్పుకు కూడా ఏదైనా ప్రాబ్లం రావాలని కోరుకుంటున్నావా.?

ప్రకాష్‌: ధాన్యం ఏం మాట్లాడుతున్నావు నువ్వు..

ధాన్యం: మీరు ఉండండి అప్పు ఇప్పుడు కడుపుతో ఉంది. అలా ఏడుస్తూ కాలి కడుపుతో ఉంటే కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటి..?

రుద్రాణి: భర్తకే విడాకులు ఇచ్చేస్తా అని చెప్పిన మనిషి  ఇక నీ కోడలి కడుపులో బిడ్డ గురించి ఎందుకు ఆలోచిస్తుంది ధాన్యలక్ష్మీ..

కావ్య కోపంగా రుద్రాణిని తిట్టి భోజనం చేయకుండా వెళ్లిపోతుంది. తర్వాత కళ్యాణ్‌ రూంలోకి భోజనం తీసుకెళ్లి అప్పుకు తినిపిస్తాడు. మరోవైపు కావ్య ఆడుతున్న నాటకం వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని అపర్ణ, ఇందిరాదేవి అనుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today October 10th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది.. చేతకాని తండ్రిని అయిపోయా: కుమిలిపోతున్న రామరాజు
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది.. చేతకాని తండ్రిని అయిపోయా: కుమిలిపోతున్న రామరాజు
Podarillu Serial Today Oct 10: కన్నా వాళ్ల అమ్మను తీసుకొచ్చిన మహాపై నారాయణ మండిపాటు..మా ఇంటి విషయాల్లో జోక్యం వద్దని హెచ్చరిక
పొదరిల్లు: కన్నా వాళ్ల అమ్మను తీసుకొచ్చిన మహాపై నారాయణ మండిపాటు..మా ఇంటి విషయాల్లో జోక్యం వద్దని హెచ్చరిక
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 10: శీనయ్యను విక్కీనే చంపాడని నమ్మిన రాధ, రామచంద్రం..భర్తపైనే కేసు పెట్టేందుకు స్టేషన్‌కు వెళ్లిన రాధ
నువ్వులేక నేను లేను: శీనయ్యను విక్కీనే చంపాడని నమ్మిన రాధ, రామచంద్రం..భర్తపైనే కేసు పెట్టేందుకు స్టేషన్‌కు వెళ్లిన రాధ
Peddi TV Premiere : టీవీల్లోకి పెద్ది వచ్చేస్తున్నాడు - మెగా పవర్ స్టార్ మూవీ బుల్లితెరపై చూసేందుకు రెడీయేనా!
టీవీల్లోకి పెద్ది వచ్చేస్తున్నాడు - మెగా పవర్ స్టార్ మూవీ బుల్లితెరపై చూసేందుకు రెడీయేనా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget