అన్వేషించండి

Brahmamudi Serial Today October 3rd:  ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సామంత్ గ్రూప్‌ కే అవార్డు – కావ్యను తిట్టిన రాజ్‌

Brahmamudi Today Episode: సామంత్‌  గ్రూప్‌కు ఎక్స్‌ ఫో అవార్డు రావడంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  కావ్య దగ్గరకు వచ్చిన స్వప్న ఒక్కసారి రాజ్‌కు సారీ చెప్పమని చెప్తుంది. ఇప్పటికీ ఆయనకు నేను లక్షల సార్లు సారీ చెప్పానని.. ఆయనకు కూడా నా మీద ఉంటే ఆయనను నాకు ఒక్కసారి సారీ చెప్పమను.. నేను వెళ్లి చెప్తాను. చెప్పడమే కాదు అత్తయ్యగారి దగ్గరకు  వెళ్లి క్షమాపణ చెప్పి ఆమె  కాళ్లు పట్టుకుంటాను అంటుంది. ఇదంతా అయ్యేది కాదు అనుకుని స్వప్న వెళ్లిపోతుంది. ఇంతలో ఎక్స్‌ ఫో నిర్వాహులు  వచ్చి సామంత్‌ గ్రూప్‌ జువ్వెల్లరీకి అవార్డు వచ్చిందని ప్రకటించడంతో అందరూ షాక్‌ అవుతారు. సామంత్‌, అనామిక హ్యాపీగా ఫీలవుతారు.

సామంత్‌: నేను నెంబర్‌ వన్‌ పొజిషన్‌కు రావడానికి చాలా టైం పట్టింది. ఈ ప్రదర్శనలో మా సంస్థకు అవార్డు వస్తుందని నేను ఊహించలేదు. కానీ ఫైనల్‌ గా సాధించగలిగాను. అందరూ అంటూ ఉంటారు. ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని కానీ ఈరోజు నేను సాధించిన ఈ విజయం వెనక నాకు ఇద్దరు  స్త్రీలు ఉన్నారు. మొదటి వ్యక్తి అనామిక. ఈ శుభసందర్భంలో మీకో గుడ్‌ న్యూస్ చెప్పబోతున్నాను. నేను అనామికను  పెళ్లి చేసుకోబోతున్నాను. అలాగే నా ఈ విజయానికి కారణమైన రెండో స్త్రీ మా క్రియేటివ్‌ డిజైనర్‌ మిసెస్‌ కావ్య.

 అని సామంత్ చెప్పగానే కావ్యతో పాటు అందరూ షాక్‌ అవుతారు. ఈ ఆవార్డు అందుకునే అర్హత మాకన్నా.. మా డిజైనర్‌ కావ్యకే ఉంది అని చెప్తాడు సామంత్‌.

కావ్య: సురేష్‌ గారు నేను డిజైన్స్‌ వేసింది వేరే కంపెనీకి కదా..?

సురేష్‌: ఆ కంపెనీ కూడా సామంత్‌ గ్రూప్‌ వాళ్ల బినామీనే అమ్మా మీకు తెలియదా?

సామంత్‌: మిస్సెస్‌ కావ్య ప్లీజ్‌ కమాన్‌ టూ డయాస్‌.

కావ్య: అదేంటి నన్ను పిలుస్తున్నారు. వాళ్ల ఏడుపు ఏదో వాళ్లు ఏడవమనండి. ఇందులో నన్నెందుకు లాగుతున్నారు. నేను తీసుకోను

అనామిక: కావ్య స్టేజీ మీదకు వచ్చి అవార్డు తీసుకో.. మిసెస్‌ కావ్య ఇది మీ అవార్డు మీరే తీసుకోవాలి. రండి

కావ్య: నన్నెందుకు ఇలా ఇరికిస్తున్నారు. నాకేంటి సంబంధం.

సురేష్‌: అమ్మా మీరు ముందు వెళ్లి అవార్డు తీసుకోండి తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. బాగోదు. అందరూ చూస్తున్నారు  అమ్మా..

కావ్య: సర్‌ నేను ఈ అవార్డు తీసుకోను మీరెందుకు ఇలా చేస్తున్నారు. నేను ఈ అవార్డు తీసుకుంటే ఒక వ్యక్తిత్వం లేని దాన్ని అయిపోతాను.

అనామిక: కమాన్‌ కావ్య ఫ్లీజ్‌ స్టేజీ మీదకు వచ్చేసెయ్‌.

 అని పిలవగానే కావ్య భయంతో మెల్లగా నడుచుకుంటూ స్టేజీ మీదకు వెళ్లి అనామికను ఇంత మోసమా..? నువ్వు కావాలనే మోసం చేశావా? అంటూ ప్రశ్నిస్తుంది. అదేమీ  పట్టించుకోకుండా అనామిక మా కంపెనీకి అవార్డు రావాలని కావ్య చాలా కష్టపడింది. ఈ అవార్డు మేము తీసుకోవడం కన్నా కావ్య తీసుకోవడమే సముచితం అంటుంది. దీంతో రాజ్‌ కోపంగా చూస్తుంటాడు. రుద్రాణి రాజ్‌ను రెచ్చగొడుతుంది. ఇద్దరూ మన ఇంట్లోంచి బయటకు వెళ్లగానే ఎలా రివేంజ్‌ తీర్చుకున్నారో చూడు అంటుంది.

   ఇంట్లో లైవ్‌ లో చూస్తున్నవాళ్లు షాక్‌ అవుతారు. ధాన్యలక్ష్మీ మాత్రం కావ్యను తిడుతుంది. ఆమె నిజస్వరూపం నాకు ముందే తెలుసు కాబట్టి నేనేం షాక్‌ కాలేదు అంటుంది. మరోవైపు కావ్య అవార్డు తీసుకుని వెళ్లిపోతుంటే మీడియా వాళ్లు వచ్చి మీరు దుగ్గిరాల ఇంటి కోడలు అయ్యుండి వారి కంపెనీకి వ్యతిరేకంగా పనిచేయడం ఏంటి? అంటూ ప్రశ్నలు అడుగుతుంటారు. ఏం చెప్పాలో అర్థం కాక కావ్య బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాజ్‌, సుభాష్‌, స్వప్న వెళ్లిపోతారు.

స్వప్న: ఇంకా ఇక్కడే ఉంటే గొడవ మరింత పెద్దది అవుతుందే.. వెళ్లిపోవే..

రాజ్‌: కంగ్రాచ్యులేషన్‌.. అద్బుతం నీకు మాటకు మాట జవాబు చెప్పడమే తెలుసు అనుకున్నాను. మాటంటే పడటం అలవాటు లేదనుకున్నాను.  కానీ నీలో చాలా కళలు ఉన్నాయని ఇవాళే అర్థం అయింది కళావతి. నీకు అనామికకు ఏమాత్రం తేడా లేదని నిరూపించావు.

కావ్య: మీరు చూసింది ఏదీ నిజం కాదు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు.

రాజ్‌: ఏది నిజం కాదు

 అంటూ రాజ్‌ నిలదీయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today Oct 10: కన్నా వాళ్ల అమ్మను తీసుకొచ్చిన మహాపై నారాయణ మండిపాటు..మా ఇంటి విషయాల్లో జోక్యం వద్దని హెచ్చరిక
పొదరిల్లు: కన్నా వాళ్ల అమ్మను తీసుకొచ్చిన మహాపై నారాయణ మండిపాటు..మా ఇంటి విషయాల్లో జోక్యం వద్దని హెచ్చరిక
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 10: శీనయ్యను విక్కీనే చంపాడని నమ్మిన రాధ, రామచంద్రం..భర్తపైనే కేసు పెట్టేందుకు స్టేషన్‌కు వెళ్లిన రాధ
నువ్వులేక నేను లేను: శీనయ్యను విక్కీనే చంపాడని నమ్మిన రాధ, రామచంద్రం..భర్తపైనే కేసు పెట్టేందుకు స్టేషన్‌కు వెళ్లిన రాధ
Peddi TV Premiere : టీవీల్లోకి పెద్ది వచ్చేస్తున్నాడు - మెగా పవర్ స్టార్ మూవీ బుల్లితెరపై చూసేందుకు రెడీయేనా!
టీవీల్లోకి పెద్ది వచ్చేస్తున్నాడు - మెగా పవర్ స్టార్ మూవీ బుల్లితెరపై చూసేందుకు రెడీయేనా!
Karthika Deepam 2 Serial Today October 10th: కార్తీకదీపం 2 సీరియల్: మాలినికి షాక్ ఇచ్చిన కార్తీక్ స్మార్ట్‌ మూవ్! చట్నీలు మాత్రమే తాతవి! టిఫెన్స్ పిన్నివే!
కార్తీకదీపం 2 సీరియల్: మాలినికి షాక్ ఇచ్చిన కార్తీక్ స్మార్ట్‌ మూవ్! చట్నీలు మాత్రమే తాతవి! టిఫెన్స్ పిన్నివే!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget