అన్వేషించండి

Brahmamudi Serial Today October 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్: స్వప్నను బెదిరించిన రాహుల్‌ - విడాకుల విషయం అందిరకీ చెప్పిన స్వప్న

Brahmamudi serial today episode October 30th: తనకు విడాకులు ఇవ్వాలని లేదంటే బలవంతంగా తీసుకుంటానని రాహుల్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: రూంలో కూర్చుని ఆలోచిస్తున్న కావ్య దగ్గరకు రాజ్‌ వెళ్లి ఏం జరిగిందని అడుగుతాడు. దీంతో కావ్య.. రాహుల్‌ గురించి చెప్తుంది.  రాజ్‌, కోపంగా రాహుల్‌ ను తిడతాడు.

కావ్య:  ఆ రుద్రాణి ఎలాగూ రాహుల్‌కు బుద్ది చెప్పదు..కనీసం మనమైనా చెప్పాలి కదా మా అక్క అలా బాధపడుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలనండి..

రాజ్‌: సరే నువ్వు టెన్షన్‌ పడకు రాహుల్‌తో నేను మాట్లాడతాను

కావ్య: మాట్లాడటం కాదు ఇంకోసారి ఇలాంటి చెత్త పనులు చేస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్‌ ఇవ్వండి

రాజ్: నేను చెప్తాను అంటున్నాను కదా.. ఇవన్నీ ఆలోచిస్తూ నీ బుర్ర పాడుచేసుకోకు ముందు నువ్వు ఇది తిను

అంటూ చెప్పగానే.. కావ్య టిఫిన్‌ తింటుంది. మరోవైపు స్వప్న దిగాలుగా కూర్చుని ఉంటే రాహుల్‌ వెళ్తాడు.

రాహుల్‌: ఏంటి శ్రీమతి గారు రాబోయే కష్టం ముందే కనిపెట్టారా..? కడుపులో బాధ కళ్లల్లోకి వచ్చింది

స్వప్న: కట్టుకున్నోడి ఒంట్లో కొవ్వు వస్తే భరించే భార్య కళ్లల్లో బాధే కనిపిస్తుంది.

రాహుల్‌: కరెక్టుగా చెప్పావు.. మరి ఆ కొవ్వుకు నువ్వు సరిపోవడం లేదు.. నా చూపుకు నువ్వు ఆనడం లేదు స్వప్న.. మరేం చేయమంటావు చెప్పు

స్వప్న: నువ్వేం చేయనక్కర్లేదు.. నేను నిన్నటి స్వప్ననే అయితే నీ చిత్త కార్తె బుద్దికి బాగా గడ్డి పెట్టేదాన్ని

రాహుల్‌: నేను చిత్త కార్తెనే.. మరి నువ్వు ప్రతివతవే కదా..? కథల్లో కానీ సినిమాల్లో కానీ ప్రతివతలు ఏం చేస్తారు..? భర్తల సుఖాన్నే కోరుకుంటారు. అయ్యో పాపం కట్టుకున్న వాడికి ఏం కష్టం వచ్చిందో ఇంటి తిండి కాదని హోటల్‌ తిండి మీద ఆశపడ్డాడు అని సర్ది చెప్పుకుని ముక్కు చీదుకుని వదిలేస్తుంది. మరి నువ్వేంటమ్మా నన్ను వదిలేయడం లేదు..

స్వప్న: ఆరోజు నిన్ను నమ్మడం నేను చేసిన తప్పు.. నీతో రావడం నేను చేసిన తప్పు.. ఈ రోజు నువ్వు తెగించి ఇంతగా దిగజారిన ఇంకా నీ చెంప పగులగొట్టకుండా ఉండటం నేను చేసిన తప్పే..

రాహుల్‌: వద్దు నువ్వేం చేయోద్దు.. నువ్వు తప్పు చేస్తానన్నా..? నేను మాత్రం జీవితంలో నీతో మళ్లీ మళ్లీ తప్పు చేయించను. కాబట్టి ఈ తప్పులన్నీంటికీ పుల్‌ స్టాప్‌ పెట్టేదాం.. ఇక నేను నీతో కలిసి ఉండటం జరగదు.. ఎందుకంటే నువ్వు నాకు డివోర్స్‌ ఇచ్చేయ్‌..

అని రాహుల్‌ అడగ్గానే.. స్వప్న ఒప్పుకోదు.. బలవంతంగా స్వప్న చేత సంతకం చేయించాలని చూస్తాడు రాహుల్‌. అయితే తప్పించుకుని అందరికీ చెప్తానని  కిందకు వెళ్లిపోతుంది. అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. స్వప్న పేపర్స్‌ తీసుకెళ్లి రుద్రాణి ముందు వేస్తుంది.

రుద్రాణి: ఏంటివి నా ముందు వేస్తున్నావు..?

స్వప్న: నీ కొడుకు చేస్తున్న ఘనకార్యం.. నాకు చేస్తున్న అన్యాయం..

రుద్రాణి:  ఏమంటున్నావు వాడు నీకు అన్యాయం చేయడం ఏంటి..?

స్వప్న: నా మీద మొహం మొత్తిందంట.. ఇంకో ఆడదాని మీద మోజు పుట్టిందట

రుద్రాణి: ఏంటి స్వప్న నువ్వు అనేది..

రుద్రాణి: మరీ అంత షాక్‌ అవ్వకు అత్తా చూడ్డానికే చాలా చెండాలంగా ఉంది.

అపర్ణ: స్వప్న ఏంటది ఇదంతా..?

స్వప్న: రాహుల్ ఇంకోదాన్ని పెళ్లి చేసుకోవాలట.. అందుకే విడాకుల పేపర్స్‌ మీద సంతకం పెట్టమని వేధిస్తున్నాడు

అంటూ స్వప్న ఏడుస్తూ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. అప్పుడే రాజ్‌, కావ్య రూంలోంచి బయటకు వస్తారు. రాహుల్‌ కూడా కిందకు వస్తాడు. అందరూ రాహుల్‌ను తిడతారు. అయినా తనకు విడాకులు కావాలని చెప్పి వెళ్లిపోతాడు. అందరూ రుద్రాణిని తిట్టగానే రుద్రాణి పైకి వెళ్లి రాహుల్‌ను కొడుతుంది. రాహుల్‌ తన గర్ల్‌ ఫ్రెండ్‌ గురించి కన్వీన్స్‌ చేస్తాడు. మరోవైపు రాహుల్‌ను ఎలాగైనా మార్చాలని కావ్య, రాజ్‌ ఆలోచిస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today November 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును తిట్టి పెళ్లి ఆపేయమన్న లక్ష్మీ – రాజుకు ఫోన్‌ చేసి ఎమోషనల్‌ అయిన అపర్ణ  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును తిట్టి పెళ్లి ఆపేయమన్న లక్ష్మీ – రాజుకు ఫోన్‌ చేసి ఎమోషనల్‌ అయిన అపర్ణ  
Karthika Deepam 2 Serial Today November 4th: కార్తీకదీపం 2 సీరియల్: ఫుడ్ షేర్ చేసుకున్న జ్యోత్స్న, సూరజ్! రగిలిపోయిన మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: ఫుడ్ షేర్ చేసుకున్న జ్యోత్స్న, సూరజ్! రగిలిపోయిన మాలిని!
Jagadhatri Serial Today Nov 3:కేదార్‌ను చంపడానికి వచ్చి భంగపడిన మీనన్‌...జగధాత్రిని చూసి వెనక్కి పరార్‌
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను చంపడానికి వచ్చి భంగపడిన మీనన్‌...జగధాత్రిని చూసి వెనక్కి పరార్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని కాపాడిన మహా ఉగ్రరూపం! లక్ష్మీ తిరిగి రావాల్సిందే అంటోన్న యమున!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని కాపాడిన మహా ఉగ్రరూపం! లక్ష్మీ తిరిగి రావాల్సిందే అంటోన్న యమున!

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
GVMC Mayor ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
జీవీఎంసీ మేయర్‌‌గా ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
Embed widget