అన్వేషించండి

Brahmamudi Serial Today October 28th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: కళ్యాణ్‌ ను కన్వీన్స్‌ చేసిన అప్పు – క్లయింట్స్‌ తిరిగి వచ్చేలా చేసిన కావ్య

Brahmamudi Today Episode:  అమ్మ మీద పాట రాయడం తన వల్ల కావడం లేదన్న కళ్యాణ్‌ను మోటివేట్‌ చేస్తుంది అప్పు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజ్‌ వెజిటేబుల్స్‌ తీసుకుని నీరసంగా ఇంటికి రాగానే రుద్రాణి భయపడుతుంది. ఆమె సౌండ్‌కు అందరూ హాల్లోకి వస్తారు. ఏమైందని అడుగుతారు. కూరగాయల బండి ఇంట్లోకి వచ్చిందనుకున్నాను అంటుంది.

రుద్రాణి: ఒక కంపెనీకి సీఈవో అయ్యుండి. ఇంటి నౌకరి లాగా ఈ కూరగాయలు తేవడం ఏంట్రా..? చూడ్డానికి నాకే అదోలా ఉంది. ఈ పనులు చేయడానికి నీకేం ఇబ్బందిగా లేదా? రాజ్‌

రాజ్‌: ఎందుకు అత్తా నాకు ఇబ్బంది. కన్నతల్లికి, తండ్రికి లేని ఇబ్బంది నేనెందుకు పడాలి.

అపర్ణ: నువ్వు ఎందుకు ఈ పనులు చేస్తున్నావో నాకు అర్థం అయింది.

రాజ్‌: మీరెందుకు ఈ పనులన్నీ చేయిస్తున్నారో నాకు బాగా తెలుసు మమ్మీ.

అపర్ణ: ఇప్పుడేంటి ఆఫీసు నుంచి కావ్యను బయటకు పంపించి నిన్ను నీ స్థానంలో కూర్చోబెడితే తప్పా ఆఫీసుకు వెళ్ళవా..?

రాజ్‌: మీరేంటి కావ్యను ఆఫీసులోనే ఉంచి నన్ను మేనేజర్‌ పోస్టులోనే పడేస్తారు. కాదంటే ఇలాంటి ఇంటి చాకిరి చేయిస్తారు.

ఇందిర: నీకు బాగానే అర్థం అయిందిరా నా చిట్టి మనవడా..?

రాజ్‌: అయితే ఇప్పుడు చెప్తున్నాను విను నాన్నమ్మా.. మీరు కళావతి కోసం కంపెనీ నుంచి నన్ను తొలగించాలని చూస్తున్నారు. కంపెనీ అప్పుల్లో కూరుకుపోయి దివాలా తీసినా నేను బాధ్యుడిని కాదు.  

 అని రాజ్‌ చెప్పగానే ప్రకాష్‌ వచ్చి తన కారు క్లీన్‌ చేయించు అంటాడు. ఇవన్నీ నువ్వు చేయలేవు రాజ్‌. నువ్వు ఆఫీసుకు వెళ్లు అంటుంది స్వప్న. కారు వాష్‌ చేయిస్తాను అని రాజ్‌ వెళ్లిపోతాడు. కళ్యాణ్‌ సాంగ్‌ రాయడానికి కూర్చుంటాడు. అప్పు భోజనం తీసుకుని వస్తుంది.

అప్పు: ఏంటి కూచి ఇది అప్పుడెప్పుడో పాత సినిమాల్లో చూసినట్టు ఉంది.

కళ్యాణ్‌: పాట సరిగ్గా రాయలేకపోతున్నాను పొట్టి. రాస్తుంటే ఆర్టిఫిషియల్‌ లా అనిపిస్తుంది.

అప్పు: ఎందుకలా..?

కళ్యాణ్‌: ఎందుకు అంటావేంటి అమ్మ మీద పాట రాయాలి. దాని గురించి ఆలోచిస్తుంటే అమ్మ గుర్తుకు వస్తుంది. మనల్ని చేసిన అవమానం గుర్తుకు వస్తుంది.

అని కళ్యాణ్‌ బాధపడుతాడు. దీంతో అప్పు  తన మాటలతో కళ్యాణ్‌ను కన్వీన్స్‌ చేస్తుంది. అమ్మ ప్రేమ పలు రకాలుగా ఉంటుందని ఆ కోపంలోనూ మీ అమ్మకు చాలా ప్రేమ ఉందని చెప్తుంది. దీంతో అవమానించిన వ్యక్తిని కూడా ఇంత అభిమానిస్తావని ఇప్పుడే తెలిసింది అంటాడు. మరోవైపు రుద్రాణి ఇందిరాదేవి దగ్గరకు వస్తుంది.

ఇందిర: ఏంటి విలక్షణ నటి చాలా ఆలోచిస్తున్నావు.

రుద్రాణి: మీరు చేస్తుంది చాలా అన్యాయం అమ్మా..

ఇందిర: అన్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా?

రుద్రాణి: అసలు రాజ్‌ ఏంటి మన కంపెనీ సీఈవో అమ్మా.. ఈ కూరగాయలు తేవడం ఏంటి..? సిటీ బస్సులో వెళ్లడం ఎంటి?

ఇందిర: సరే ఓ పని చేయ్‌. వాడి బదుల నువ్వు  వెళ్లు..

రుద్రాణి: ఎందుకులే అమ్మా వాడు చూసుకుంటాడులే..

  అనగానే ఇందిరాదేవి రుద్రాణిని తిట్టి వెళ్లిపో అంటుంది. ఇంతలో రాజ్‌ కంగారుగా లోపలికి వచ్చి భామ్మకు ఆయిల్‌.. బాబాయ్‌కి కారు కీస్‌ ఇచ్చి వాష్‌ అయిపోయింది అని చెప్తాడు. ఇంతలో ఇందిరాదేవి మెల్లగా ప్రకాష్‌ను పిలిచి చెవిలో ప్యాన్‌ చెడిపోయింది బాగు చేయించుకురమ్మని చెప్తుంది. దీంతో రాజ్‌ బయటకు ఎందుకు నేనే చేస్తాను అని రాజ్‌ రిపేరు చేస్తాడు. మరోవైపు ఆఫీసులో ఉన్న కావ్య దగ్గరకు ఇద్దరు వ్యక్తుల వచ్చి విష్‌ చేస్తారు. వాళ్లను చూసిన శృతి ఫోన్‌ చేస్తే మీటింగ్‌కు రానని చెప్పారు అని అడుగుతుంది. దీంతో వాళ్లు మేడం పద్దతిగా పిలిచారు అందుకే వచ్చామని చెప్తారు. వాళ్లకు థాంక్స్‌ చెప్తుంది కావ్య. మరోవైపు సుభాష్‌, అపర్ణ దగ్గరకు వస్తాడు.

సుభాష్‌: ఏంటి అపర్ణ ఎన్ని పనులు చెప్పినా వాడిలో మార్పు రావడం లేదు అని టెన్షన్‌ పడుతున్నావా? వాడు తప్పక మారతాడు.

అపర్ణ: ఈ వంకతో నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నారా..? మరోసారి మోసపోవడానికి నేనే సిద్దంగా లేను. మిమ్మల్ని జీవితంలో క్షమించను.

ఇందిర: ఎందుకురా అలా బాధపడతావు. ఒకప్పుడు నువ్వు తప్పు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పశ్చాతాప పడుతున్నావు. ఏదో ఒక రోజు అపర్ణ నిన్ను క్షమిస్తుంది.

సుభాష్‌: ఆ ఆశ, నమ్మకం రెండూ లేవమ్మా.. నేను చేసిన తప్పుకు ఈ శిక్ష అనుభవించాల్సిందే.

అని బాధగా వెళ్లిపోతాడు. మరోవైపు కావ్యతో శృతి మాట్లాడుతుంది.

శృతి: అసలు వీళ్లు నాతో మాట్లాడటానికి ఇంట్రెస్టే చూపించలేదు మేడం. అలాంటిది మీరు పిలవగానే ఎలా వచ్చారు.

కావ్య: మన కంపెనీతో అగ్రిమెంట్‌ చేసుకున్నప్పుడు ఏదైన కారణాలతో కంపనీతో బ్రేకప్‌ చేసుకుని మరోక కంపెనీతో బిజినెస్‌ చేయాలి అనుకుంటే అది ఇద్దరి వైపు అంగీకారంతో జరగాలి. లేదంటే పెనాల్టీ కట్టాలి. ఆ విషయం నేను గుర్తు చేశాను. అందుకే వచ్చారు.

శృతి: మీర అగ్రిమెంట్‌ లో రూల్స్‌ మాట్లాడారు కాబట్టి వాళ్లు వచ్చారు. కానీ తిరిగి మనతో వాళ్లు బిజినెస్‌ చేస్తారా? మేడం.

 అని శృతి డౌట్‌ క్రియేట్‌ చేయగానే.. ఏదో ఒకటి చేసి వీళ్ల మనసు మార్చాలి. తిరిగి మనతో బిజినెస్‌ చేసేలా చేయాలి. మనకు ఇంకో మార్గం లేదు అని చెప్తుంది కావ్య. మరోవైపు రాజ్ గార్డెన్‌ లో మొక్కలకు నీల్లు పడుతుంటే అందరూ వచ్చి చూసి షాక్‌ అవుతారు. తాతయ్య వచ్చి పనివాళ్లను మానేయమని చెప్పాలనుకుంటున్నాను అంటాడు. దీంతో అపర్ణ, ఇందిర నాటకం మొదలెడతారు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
Godavari Serial Today October 13th: 'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget