అన్వేషించండి

Brahmamudi Serial Today October 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్: తన నిర్ణయం మార్చుకోని కావ్య – ఇంట్లో వాళ్లను తిట్టిన రాజ్‌   

Brahmamudi serial today episode October 24th: కావ్య తన నిర్ణయం మారదని ప్రాణం పోయినా అబార్షన్‌ చేయించుకోనని చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది  

Brahmamudi Serial Today Episode: ఇంట్లో అందరికీ కాఫీ ఇస్తూ.. హ్యాపీగా నవ్వుతూ తిరుగుతున్న కావ్యను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అసలు కావ్య ఎలా ఇలా ఉండగలుగుతుంది అని ప్రశ్నిస్తారు.

అపర్ణ: కావ్య ఇలాంటి  పరిస్థితుల్లో నువ్వు నవ్వుతున్నావా..?

కావ్య: అదేంటి అత్తయ్యా ఈ ఇంట్లో నవ్వడం బ్యాన్‌ చేశారా..? ఏంటి..? ఇంక నేను వచ్చేశానుగా ఆ ప్రాబ్లమే ఉండదు.. ఆ బ్యాన్‌ ఎత్తేస్తాను లేండి..

స్వప్న: కావ్య ఇక ఆపవే నీ నటన. నీ నటనతో నవ్వించగలవని..ఏడ్చి ఏదైనా సాధించగలవని ప్రపంచం అంతా తెలిసిపోయింది.

కావ్య: అవునా అక్కా మరి మీ అందరికీ తెలిసిపోయి ఉండాలే

ఇందిరాదేవి: నీ నటనే కాదు ఇన్నాళ్లు మాకు తెలియకుండా దాచిన నిజం కూడా తెలిసిపోయింది

అపర్ణ: అంతటి భయంకరమైన నిజం తెలిసి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో కళ్లారా చూసి ఏం చేయాలో అర్థం కాక నిన్ను ఎలా కాపాడుకోవాలో అంతు చిక్కక మేమందరం టెన్షన్‌ పడుతుంటే.. నువ్వు మాత్రం ఏమీ జరగనట్టు ఎలా ఉన్నావు.. ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు..

కావ్య: అత్తయ్య మీరు నిజం తెలిసి టెన్షన్‌ పడుతున్నారు. కానీ నేను ఆ నిజం తెలియక దిగులు పడ్డాను. ఇన్నాళ్లు మీ అబ్బాయి అలా ఎందుకు ప్రవర్తించారో నాకు అర్థం కాక నాలో నేనే సతమతం అయ్యాను. కానీ అత్తయ్యా ఆయన ఎందుకు అలా చేశారో.. ఆయన ప్రవర్తనకు కారణం ఏంటో నాకు స్పష్టంగా తెలిసిపోయింది. ఇంకెందుకు అత్తయ్యా బాధపడటం

సుభాష్‌: ఏంటమ్మా ఇది అసలు ఏమంటున్నావో నీకైనా అర్థం అవుతుందా.?

కావ్య: నిన్నటి దాకా మీకు అందరికీ అర్థం కాక నన్ను ప్రశ్నించారు. ఈరోజు నాకు అర్థం అయి మీ అందరికీ జవాబు చెప్తుంటే.. నాకు అర్తం కాలేదు అనడం వ్యర్థం కదా మామయ్య

అపర్ణ: నీకు పిచ్చి పట్టిందే.. నీ ప్రాణాలు పోతాయి అని చెప్తున్నాడే వాడు

కావ్య: కానీ నా కడుపులో బిడ్డ ప్రాణాలు నిలబడతాయి కదా అత్తయ్య

ఇందిరాదేవి: నీది అమాయకత్వమో మూర్ఖత్వమో తెలియడం లేదు కావ్య.. బిడ్డను మోస్తే నీ ప్రాణాలు పోతాయంటుంటే.. నీకు సరదాగా ఉందా..?

కావ్య: అమ్మమ్మగారు ఉరిమే ఉరుమును.. కురిసే వానను.. పోయే ప్రాణాన్ని ఎవ్వరూ ఆపలేరు అమ్మమ్మ

ఇందిరాదేవి: ఏడ్చినట్టు ఉంది నీ వేదాంతం.. ఉరుము వినబడకుండా చెవులో దూదులు పెట్టుకోవచ్చు.. వానకు తడవకుండా గొడుగు పట్టుకోవచ్చు.. అలాగే నా మనవడు చెప్పినట్టు చేస్తే నీ ప్రాణానికి ఏ ప్రమాదం లేకుండా హాయిగా ఆనందంగా బతకొచ్చు

కావ్య: అంటే నన్ను నేను బతికించుకోవడం కోసం అమ్మ అనే మాటకున్న అర్థాన్ని చంపేయమంటారా..? ఆడదానికి అమ్మ అనే పిలుపే ఒక వరం ఆ వరాన్ని అందుకోకుండా నా బిడ్డ స్వరాన్ని కడుపులోనే నొక్కేయమంటారా..? తన ఆయుష్షును కూడా పోసి తన బిడ్డకు లోకాన్ని చూపిస్తే అది అసలైన అమ్మతనం.. కానీ అదే బిడ్డ ఊపిరి తీసి తను బతకాలి అనుకోవడం అనర్థం. ఆ అనర్థానికి నేను తావు ఇవ్వాలని అనుకోవడం లేదు అమ్మమ్మ

రుద్రాణి: వావ్‌ ఎం చెప్పావు కావ్య.. నిన్ను చూస్తుంటే.. నాకు చాలా ముచ్చటేస్తుంది.

అనగానే అందరూ రుద్రాణిని తిడతారు. కానీ రుద్రాణి మాత్రం మీరు ఏమైనా అనుకోండి ఈ విషయంలో నేను కావ్యను మెచ్చుకోకుండా ఉండలేను అంటుంది. కావ్య మాత్రం తనకు బడ్డే ముఖ్యమని చెప్పి వెళ్లిపోతుంది. కావ్య మాటలు విన్న రాజ్‌ ఇంట్లో వాల్లను తిడతాడు. తర్వాత కావ్యను తాతయ్య పిలిచి అబార్షన్‌ చేయించుకోమని చెబితే కావ్య వినదు. దీంతో ఇంట్లో వాళ్లందరూ కలిసి కావ్యను ఎలాగైనా మార్చాలని ప్లాన్‌ చేస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget