అన్వేషించండి

Brahmamudi Serial Today October 1st:  ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణి ప్లాన్ పసిగట్టిన స్వప్న – కావ్యకు జాగ్రత్తలు చెప్పిన కనకం

Brahmamudi Today Episode: రేపు జరిగే ఎక్స్‌ ఫోకు కావ్యను రావాలని సురేష్‌ చెప్పడంతో కావ్య ఆలోచనలో పడిపోతుంది. దీంతో ఇవాళ్టీ  ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగాజరిగింది.

Brahmamudi Serial Today Episode:   కళ్యాణ్‌ ఆటో నడపడం చూసిన అప్పు ఫీల్‌ అవుతుంది. నాతో కూడా అబద్దం చెప్తావా? అంటూ ఏడుస్తుంది. ఈరోజు నువ్వు ఇంటికి వచ్చావో నా చేతిలో చచ్చావే అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్తుంది. మరోవైపు రాజ్‌ ఆఫీసులో కూర్చుని డిజైన్స్‌  వేస్తుంటాడు. ఎంత టైం అయినా అలాగే కూర్చుని డిజైన్స్‌ వేస్తుంటాడు. ఎంప్లాయీస్‌ ఒక్కొక్కరుగా వెళ్లిపోతుంటారు. రాజ్‌ మాత్రం డిజైన్స్‌ సరిగ్గా రాక తల పట్టుకుని కూర్చుంటాడు. మరోవైపు కావ్య భోజనం చేస్తుంటే సురేష్‌ ఫోన్‌ చేస్తాడు.

కావ్య:  హలో సురేష్‌ గారు చెప్పండి.

సురేష్‌: కావ్య గారు మీకో గుడ్‌ న్యూస్‌ మీరు వేసిన డిజైన్స్‌ అన్ని బాగున్నాయి అని అప్రూవల్‌ వచ్చింది.

కావ్య: అవునా థాంక్యూ సార్‌.

సురేష్‌: మీకు ఇంకో గుడ్‌ న్యూస్‌ కూడా ఉంది అండి.

కావ్య: ఏంటండి అది.

సురేష్‌: రేపు జూబ్లీహిల్స్‌ లో జరిగే ఎక్స్‌ ఫోలో మన క్లయింట్స్‌ చాలా మంది అక్కడకు వస్తారు. రేపే మీరు కూడా అక్కడకు వస్తే వాళ్లందరిని మీకు పరిచయం చేస్తాను.

 అని చెప్పగానే కావ్య ఆ ఫ్రొగ్రాంకు రాజ్‌ కూడా వస్తాడని తాను రాలేనని చెప్తుంది. దీంతో సురేష్‌ బలవంతంగా కావ్య గారు మీరు వస్తున్నారు అంతే అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు. కనకం కూడా రేపు నీకేం అంత ముఖ్యమైన పని ఉంది అంటూ అడుగుతుంది. ఏం లేదని కావ్య రాజ్‌ కూడా వస్తాడని చెప్తుంది. దీంతో కనకం ఓహో మీ ఆయన్ని చూడగానే కరిగిపోయి ఎమోషన్‌ అవుతావని వెళ్లడం లేదా? అంటుంది. దీంతో నువ్వు అన్నందుకున్నా నేను రేపు వెళ్తాను అమ్మ అంటుంది కావ్య. మరోవైపు రాజ్ డిజైన్స్‌ తీసుకొచ్చి శృతికి ఇచ్చి ఇవి వెంటనే మాన్యుఫాశ్చరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ కు పంపించు రేపు ఎక్స్‌ ఫోకు ఇవే పంపించేవి అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు అనామిక రుద్రాణికి ఫోన్‌ చేస్తుంది.

రుద్రాణి: ఏంటి నువ్వు చెప్పేది నిజమా?

అనామిక: డాక్టర్‌ దగ్గర లాయర్‌ దగ్గర కాదు ఒక దొంగ ఇంకొక దొంగ దగ్గర కూడా అబద్దం చెప్పకూడదు ఆంటీ.

రుద్రాణి: దొంగా..? నేనా.. సరేలే తిడితే తిట్టావులే కానీ ఇంతకీ ఆ కావ్యను వాడుకుని రాజ్‌ ను ఎలా దెబ్బకొడుతున్నావో చెప్పు.

అనామిక: ఆ కావ్య డిజైన్స్‌ ను వాడుకుని రాజ్‌ కంపెనీకి రావాల్సిన అవార్డు రానీయకుండా అడ్డుకుంటున్నాను.

రుద్రాణి: పెంటాస్టిక్‌ ఈ విషయం కావ్యకు తెలియదు కదా..?

 అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే బయటి నుంచి స్వప్న వింటుంది. మ అత్త ఎవరితోనే గూడు పుఠాణీ చేస్తుంది. అని రేపు నేను కూడా అక్కడికి వెళ్లడం బెటర్‌ అనుకుంటుంది. మరోవైపు ఆటో తీసుకుని ఇంటికి వచ్చిన కళ్యాణ్‌ ను చూసి అప్పు అలుగుతుంది. కళ్యాణ్‌ను తిడుతుంది. దీంతో కళ్యాణ్‌ నాకున్నది  నువ్వే పొట్టి నువ్వే మాట్లాడొద్దు అంటే నేను ఇక ఎవరితో మాట్లాడాలి అంటాడు. ఇంతలో కళ్యాణ్‌ సారీ చెప్తుంటే సాంగ్‌ ప్లే అవుతుంది.

అప్పు: నువ్వు అలా ఆటో నడపడం నాకు అసలు ఇష్టం లేదు.

కళ్యాణ్‌: నేను నీకోసం ఆటో నడపడం లేదు. మన కోసం మన భవిష్యత్తు కోసం నడుపుతున్నాను.

అప్పు: అదే నేను కూడ అంటున్నాను. నీ భవిష్యత్తుని నువ్వు కోరుకున్న జీవితాన్ని పక్కన పెట్టి ఇలా పనులు చేయడం అవసరమా?

కళ్యాణ్‌: నువ్వు పిజ్జా డెలివరి చేయడం తప్పు కానప్పుడు నేను ఆటో నడపడం  ఎందుకు తప్పు అవుతుంది.

అప్పు: నువ్వు వేరు..నేను వేరు..

కళ్యాణ్‌: అదే నేను అంటున్నాను. నువ్వు వేరు నేను వేరు కాదు.

అంటూ తను ఎందుకు ఆటో నడుపుతున్నాడో కళ్యాణ్‌ అప్పుకు చెప్తాడు. దీంతో అప్పు కన్వీన్స్ అవుతుంది. తర్వాత కావ్య ఎక్స్‌ ఫోకు వెళ్తుంటే కనకం ఆపి అక్కడ అల్లుడు గారు వచ్చి పలకరిస్తే నువ్వు మంచిగా మాట్లాడు. పొగరుగా సమాధానం చెప్పకు అని చెప్తుంది. కావ్య ఏం పట్టించుకోకుండా వెళ్తుంది. మరోమైపు రాజ్‌ ఆఫీసుకు వెళ్తుంటే అపర్ణ హారతి ఇచ్చి ఆల్‌ ది బెస్ట్ చెప్తుంది. వెళ్దామని రాజ్‌, సుభాష్‌, ప్రకాష్‌ వెళ్తుంటే రుద్రాణి ఆగండి ఆగండి అంటూ వచ్చి తాను వస్తానని చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు.

    నువ్వెందుకు అని అడుగుతారు. రాజ్‌ అవార్డు తీసుకుంటుంటే నేను ఆడియన్స్‌ లో కూర్చుని చప్పట్లు కొట్టాలి అంటుంది. సరే రండి అత్తయ్యా అంటాడు  రాజ్. ఇంతలో స్వప్న కూడా నేను వస్తాను అంటుంది. రాజ్‌ వద్దంటాడు. సుభాష్‌ మాత్రం స్వప్న కూడా రావాల్సిందే అని చెప్తాడు. దీంతో అందరూ కలిసి ఎక్స్‌ ఫోకు వెళ్తారు. మరోవైపు ఎక్స్‌ ఫోకు వెళ్లిన సామంత్‌, రాజ్‌ ఏదైనా చేస్తాడేమోనని భయపడుతుంలాడు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Death Penalty: తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IND vs BAN 2nd Test Day 5 Highlights: రెండో టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియాSircilla Weavers: 18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీSrikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులుTiger in Konaseema: చిరుత కోసం డ్రోన్లతో వేట - కోనసీమ DFOతో ఫేస్ టూ ఫేస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Death Penalty: తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
I Phone Murder : ఐ ఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
ఐ ఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
Pawan Kalyan: 'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
Kothagudem News: సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
Embed widget