అన్వేషించండి

Brahmamudi Serial Today October 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణికి వార్నింగ్‌ ఇచ్చిన కావ్య – పడి పడి నవ్వుకున్న రాహుల్‌

Brahmamudi serial today episode October 15th: మీడియాకు న్యూస్‌ లీక్‌ చేసి తన ఇంటికి పంపించింది రుద్రాణియే అని పసిగట్టిన కావ్య ఫోన్‌ చేసి తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode: మీడియాలో మొత్తం మన పరువు మన ఇంటి పరువు కావ్య తీసిందని తిడుతూ రాజ్‌ను రెచ్చగొట్టి కావ్యకు విడాకులు ఇచ్చేలా చేయాలనుకుంటుంది రుద్రాణి. అలాగే తన మాటలతో రాజ్‌ను రెచ్చగొడుతుంది.

రుద్రాణి: మన ఇంటి పరువు మర్యాదలను మంట కలిపిన మనిషిని రాజ్‌ను ఇబ్బంది పెడుతున్నారు. రాజ్‌ అలాంటి దిగజారిన వ్యక్తి కోసం నువ్వు దిగజారాల్సిన అవసరం లేదు.. నువ్వు ఊ అంటే అమ్మాయిలు క్యూ కడతారు

ఇందిరాదేవి కోపంగా రుద్రాణిని కొడుతుంది.

ఇందిరాదేవి: ఇంకోక్క మాట నీ నోటి నుంచి వచ్చిందంటే చంపేస్తాను జాగ్రత్త నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా..?

అపర్ణ: అత్తయ్య రుద్రాణికి కాపురాలు కూల్చడం తెలిసినంత బాగా వాటిని నిలబెట్టడం రాదు కదా

ఇందిరాదేవి: అయినా న్యూస్‌లో వచ్చింది అని తెగ గోల చేస్తున్నావు.. ఆ మీడియా వాళ్లు అడిగిన దాంట్లో తప్పేం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే తప్పు చేసింది నా మనవరాలు కాదు.. నా మనవడు..

రుద్రాణి: అంటే మీరింకా కావ్యకే సపోర్టు చేస్తున్నారా..?

అపర్ణ: అవును అది తప్పు చేయనంత వరకు దానికే సపోర్టు చేస్తాము.. నీకేమైనా ప్రాబ్లమా..?

రుద్రాణి: కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నట్టు మీకే లేనప్పుడు నాకెందుకు ఉంటుంది

ఇందిరాదేవి: అయితే నోరు మూసుకుని ఉండు..

అపర్ణ: ఓరేయ్‌ రాజ్‌ ఇప్పటి వరకు అల్లరి పాలు అయింది చాలు. ఇంకా లేటు చేసి మన పరువును మన ఇంటిని రోడ్డున పడేయకు.. వెళ్లు వెళ్లి దాన్ని ఇంటికి తీసుకుని రా

రాజ్‌: అమ్మ తను రాను రాను అంటుంటే ఎలా తీసుకురావాలి. నేను చేయాల్సిన ప్రయత్నాలు చేశాను. ఇక నా వల్ల కానే కాదు

అపర్ణ: గట్టిగా ప్రయత్నిస్తే ఈ ప్రపంచంలో కానిది అంటూ ఏదీ ఉండదు.. చిన్నప్నుడు నువ్వు అన్నం తిననని మారాం చేశావు. అన్నం పెట్టకుండా వదిలేశానా..?  స్కూల్‌కు వెళ్లనని మారాం చేశావు. చదువు నేర్పించకుండా వదిలేశామా..? తల్లిగా నా బాధ్యతలు నేను పూర్తి చేశాను. భర్తగా దాన్ని తీసుకొచ్చి నీ బాధ్యత కూడా పూర్తి చేసుకో.. చూడు రాజ్‌ తప్పు చేసింది నువ్వు నీ తప్పుకు నా కోడలు శిక్ష అనుభవిస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు.. కానీ నా కోడలు నా ఇంటికి రావాల్సిందే

అంటూ గట్టిగా చెప్పి వెళ్లిపోతుంది అపర్ణ. తర్వాత రూంలోకి వెళ్లిన రాహుల్‌ రుద్రాణిని చూసి నవ్వుతుంటాడు.

రుద్రాణి: రేయ్‌ నీకైమైనా పిచ్చిపట్టిందా..? ఎందుకు నవ్వుతున్నావు.. నేనేమైనా జోక్‌ చేశానా..?

రాహుల్‌: నువ్వే ఓ జోకర్‌ లా కనిపిస్తుంటే ఇక సపరేట్‌ గా జోకులు వేయడం ఎందుకు మమ్మీ

రుద్రాణి: రేయ్‌

రాహుల్‌: ఏంటి కోపం వచ్చిందా..? మరి నువ్వు ప్లాన్‌ చేసిన ప్రతిసారి ఫెయిల్‌ అవుతుంటే నాకు ఎలా ఉంటుంది. ఆ రాజ్‌కు కావ్యకు మధ్య దూరం పెంచేస్తాను. వాళ్లిద్దరిని విడగొట్టేస్తాను. అని చెప్తుంటే నాకెలా ఉంటుంది. ఇప్పుడు నీ ప్లాన్‌ నీకే రివర్స్‌ కొట్టింది. అయినా నాకు తెలియక అడుగుతాను మమ్మీ నీ జీవితంలో ఒక్కసారి కూడా సక్సెస్‌ అవ్వవా..? నువ్వేమైనా ఓటమికి కేరాఫ్‌ అడ్రస్సా చెప్పు మమ్మీ

రుద్రాణి:  ఏంట్రా వెటకారమా..? ఈ ఇంట్లో అందరూ దాన్ని నెత్తిన పెట్టుకున్నారు. అందుకే అది ఏం చేసినా వాళ్లకు తప్పుగా అనిపించడం లేదు. రాజ్‌కు సపోర్టు చేసి ఆ కావ్యను ఇంట్లోంచి గెంటేస్తారని ఆ ప్లాన్‌ చేశాను. కానీ అంతా రివర్స్ అయింది. ఇంటిల్లి పాది దాన్ని ఎందుకు అంతలా మోస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదురా

అంటుండగానే.. రుద్రాణికి కావ్య ఫోన్‌ చేస్తుంది. రుద్రాణి షాక్‌ అవుతుంది.

రాహుల్‌: ఏంటి మమ్మీ షాక్‌ కొట్టిన కాకిలా అలా అయిపోయావు.. ఎవరు ఫోన్‌

రుద్రాణి: ఆ కావ్య చేస్తుందిరా..?

రాహుల్‌: ఏంటి కావ్య చేస్తుందా..? కొంపదీసి ఆ మీడియా వాళ్లను పంపించింది మనమే అని డౌటు వచ్చిందా మమ్మీ

రుద్రాణి: రేయ్‌ అనవసర డౌట్టు పెట్టుకోకు

అని రాహుల్‌ను తిట్టి ఫోన్‌ లిఫ్ట్ చేస్తుంది. కావ్య కోపంగా మీడియా వాళ్లను పంపించిన ప్లాన్‌ నీదేనా అంటూ తిట్టి వార్నింగ్‌ ఇస్తుంది. తర్వాత రాజ్‌ కాల్‌ చేసి కావ్యను తిడతాడు. దీంతో కావ్య బాధపడుతుంటే కనకం వచ్చి ఓదారుస్తుంది. తర్వాతి రోజు దుగ్గిరాల ఇంటికి మహిళ సంఘాల వాళ్లు వచ్చి రాజ్ కు వార్నింగ్‌ ఇస్తారు. రుద్రాణి తన మాటలతో వాళ్లను మరింత రెచ్చగొడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
Godavari Serial Today October 13th: 'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget