అన్వేషించండి

Brahmamudi Serial Today October 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంట్లోంచి వెళ్లిపోయిన కావ్య – అయోమయంలో దుగ్గిరాల ఫ్యామిలీ

Brahmamudi serial today episode October 10th: రాజ్‌ తన నిర్ణయం మార్చుకోనని కరాకండిగా చెప్పడంతో కావ్య ఇంట్లోంచి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode:  అబార్షన్‌ విషయంలో సీతారామయ్య కోపంగా రాజ్ ను తిట్టి కొడతాడు. అయినా రాజ్‌ తన నిర్ణయంలో మార్పు లేదని మీరే కావ్యను ఒప్పించాలని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.

ధాన్యం: విన్నావు కదా కావ్య రాజ్‌ ఏం చెప్పాడో.. వాడు నిర్ణయం మార్చుకోడంటా..? ఇక ఆలోచించుకోవాల్సింది నువ్వే.. నువ్వు రాజ్‌ చెప్పినట్టు వినాలి అని చెప్పే హక్కు నాకు లేకపోవచ్చు కానీ ఇంట్లో గొడవలు జరిగితే మాత్రం నేను ఈ ఇంట్లోంచి వెళ్లిపోతాను. దానికోసం నువ్వేం చేస్తావో నీ భర్తను ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం

అని చెప్పి ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. కావ్య ఏడుస్తూ వెళ్లిపోతుంది.

అపర్ణ: ఏంటి అత్తయ్య వాడు మారాలని మనం ఎంత చేసినా వాడు మారడం లేదు.. చివరికి ఇలా జరిగిందేంటి..

ఇందిరాదేవి: నాకేం అర్థం కావడం లేదు అపర్ణ. వాడు మారాలని మనం ప్రయత్నించాం.. వాడు మారడం లేదు.. నా మనవరాలికి బిడ్డను దూరం చేసుకోమని చెప్పలేము.. ఇప్పుడు ఏం చేయాలి

రుద్రాణి: (మనసులో) ఏది జరగాలని కోరుకున్నానో కరెక్టుగా అదే జరిగింది. ధాన్యలక్ష్మీకి చిన్న నిప్పు పెట్టగానే కుటుంబం మొత్తాన్ని తగలేసింది. ఇప్పుడు రాజ్‌ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి

అనుకుంటుంది. తర్వాత అప్పు రూంలో కూర్చుని ఆలోచిస్తుంది. అప్పుడే కళ్యాణ్‌ జ్యూస్‌ తీసుకుని వెళ్తాడు.

కళ్యాణ్‌: పొట్టి ఇప్పుడు ఏం జరిగిందని అంతలా బాధపడుతున్నావేంటి..?

అప్పు: ఇంకా ఏం జరగాలని కూచి ఇందాక అత్తయ్య ఎంత గొడవ చేసిందో ఎన్ని మాటలు అన్నదో నువ్వే విన్నావు కదా..? అసలు మా కావ్య అక్క చేసిన తప్పేంటి కూచి నువ్వే చెప్పు.. కారణం చెప్పకుండా అబార్షన్‌ చేయించుకో అంటే ఏ తల్లి అయినా అలాగే రియాక్ట్‌ అవుతుంది. తప్పు చేస్తుంది బావ అయితే శిక్ష మా అక్కకా..?

కళ్యాణ్‌: తప్పు అన్నయ్యదో వదినదో కాదు.. నీది

అప్పు:  ఏం మాట్లాడుతున్నావు కూచి నేను తప్పు చేశానంటావేంటి..?

కళ్యాణ్‌: మరి లేకపోతే ఏంటి పొట్టి అసలు నువ్వే కనక టైంకి ఫుడ్‌ తీసుకుని రెస్ట్‌ తీసుకుని ఉంటే ఈ గొడవ జరిగేదా..? నీవల్ల కడుపులో బిడ్డకు ఎమవుతుందోననే అమ్మ అంత గొడవ చేసింది. అంటే ఒక రకంగా ఈ గొడవకు కారణం నువ్వే కదా..? ఇలా అస్తమానం ఆలోచిస్తూ కూర్చుంటే ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అవుతుందా..?

అప్పు: కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే కూచి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రాబ్లమ్‌ సాల్వ్‌ కాదు.. ఈరోజు ఎలాగైనా సరే అక్కకు నిజం తెలియాల్సిందే.. ఈ ప్రాబ్లమ్‌కు పులిస్టాప్‌ పెట్టాల్సిందే..

 అంటూ నిజం చెప్పడానికి అప్పు వెళ్తుంటే..

కళ్యాణ్‌: వద్దు పొట్టి.. వదినకు నిజం తెలిస్తే తట్టుకోలేదనే కదా అన్నయ్య చెప్పకుండా ఆగింది. అన్నయ్య ఎలాగైనా వదినకు తెలియకుండా అబార్షన్‌ చేయించాలని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు..అన్నయ్య ప్రయత్నం చేస్తా అంటున్నారు కదా చేయనిద్దాం. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు

అంటూ కళ్యాణ్‌ జ్యూస్‌ ఇస్తాడు అప్పుకు. ఇక లాన్ లో ఒంటరిగా కూర్చున్న కావ్య ఆ రోజు జరిగిందంతా గుర్తు చేసుకుని బాధపడుతుంది. చివరకు ఒక నిర్ణయానికి వచ్చి తన నిర్ణయాన్నంతా లెటర్‌ గా రాసి రూంలో పెట్టి వెళ్లిపోతుంది.   మరుసటి రోజు లెటర్‌ చదివిన అపర్ణ రాజ్‌ ను తిడుతుంది. అందరూ రాజ్‌ను తిడతారు. మరోవైపు కావ్య తన పుట్టింటికి వెళ్తుంది. ఒక్కదానివే వచ్చావా..? అల్లుడుగారు రాలేదా అని కనకం అడిగితే కనకం మీద కొప్పడుతుంది కావ్య. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌ని ఇంటికి తీసుకొచ్చిన విహారి! మహాకి మరో బాధ్యత!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌ని ఇంటికి తీసుకొచ్చిన విహారి! మహాకి మరో బాధ్యత!
Godavari Serial Today October 5th: 'గోదావరి' సీరియల్: జానుకి పెళ్లైపోయిందని తెలిసి గుండె పగిలేలా ఏడ్చిన సూర్య! నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయిన జాను!
'గోదావరి' సీరియల్: జానుకి పెళ్లైపోయిందని తెలిసి గుండె పగిలేలా ఏడ్చిన సూర్య! నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయిన జాను!
Nindu Manasulu Serial Today October 5th: నిండు మనసులు: ప్రేరణతో కలిసిపోవడం తనకి ఇష్టమే అని చెప్పేసిన సిద్ధూ! విజయానంద్ మంట పెడతాడా!
నిండు మనసులు: ప్రేరణతో కలిసిపోవడం తనకి ఇష్టమే అని చెప్పేసిన సిద్ధూ! విజయానంద్ మంట పెడతాడా!
Podarillu Serial Today Oct5:కన్నా వాళ్ల అమ్మ గురించి చక్రికి చెప్పిన మహా..గట్టిగా నిలదీసినా నిజం చెప్పని నారాయణ
పొదరిల్లు: కన్నా వాళ్ల అమ్మ గురించి చక్రికి చెప్పిన మహా..గట్టిగా నిలదీసినా నిజం చెప్పని నారాయణ

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Indiramma Towers: ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్.. అక్టోబర్ 9 లోగా డిపాజిట్ చెల్లించకపోతే ఇల్లు రద్దు!
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్.. అక్టోబర్ 9 లోగా డిపాజిట్ చెల్లించకపోతే ఇల్లు రద్దు!
Embed widget