అన్వేషించండి

Brahmamudi Serial Today November 11th:  ‘బ్రహ్మముడి’ సీరియల్:  రాహుల్‌ను రెచ్చగొట్టిన రుద్రాణి – చాటు నుంచి అంతా విన్న స్వప్న

Brahmamudi serial today episode November 11th: రాహుల్‌ మారిపోయాడన్న అనుమానంతో రుద్రాణి, రాహుల్‌ను మార్చాలని ప్రయత్నిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది  

Brahmamudi Serial Today Episode: ఇంట్లో వాళ్లను రాహుల్‌ క్షమాపణ అడుగుతాడు. దీంతో కావ్య కల్పించుకుని ఇంట్లో వాళ్లు అందరూ కాదు నిన్ను క్షమించాల్సింది స్వప్న అని చెప్తుంది. దీంతో రాహుల్ బాధగా స్వప్న దగ్గరకు వెళ్తాడు.

రాహుల్‌: స్వప్న నేను చేసిన తప్పుల వల్ల ఈ కుటుంబం ఎంత బాధపడిందో నాకు తెలియదు. కానీ నువ్వెంత సఫర్‌ అయ్యావో నాకు తెలుసు. కానీ దారుణం జరిగిపోయింది స్వప్న. ఇప్పుడు నేను మారి మనిషిని అవ్వడం తప్ప నేనేం చేయలేను. కానీ ఈ క్షణమే నాలో మార్పును మీకు చూపించాలి అనుకుంటున్నాను.. ఒక్క అవకాశం ఇవ్వు స్వప్న ఇంకెప్పుడూ నా వైపు తప్పు జరగనివ్వను నేను ఇంకెప్పుడూ నిన్ను బాధపెట్టను

స్వప్న:  నమ్మకం అనేది రాశులు పోసి ఉండదు రాహుల్‌. కనిపించగానే చేతిలోకి తీసుకోవడానికి.. నమ్మకం అనేది కళ్లకు కనిపించేది కాదు.. మనసుకు అనిపించేది. అది నిరూపణ అవ్వాలి. ఈ ఇల్లు అందరి ఇళ్లలాగా ఓ పది మంది తల దాచుకుంటున్న షెల్టర్‌ కాదు.. ఎవరెలా పోతున్నా వదిలేయడానికి అందరూ ఒకే మాటగా ఒకే మనసుతో ఒకే ఆలోచనతో పరువు ప్రతిష్టల కోసం బంధాలు పెనవేసుకుని బతుకున్న దేవాలయం.. అలాంటి దేవాలయంలో ఎవరు తప్పు చేసినా మిగిలిన అందరూ బాధపడాల్సి వస్తుంది. అది నువ్వు గుర్తించాలి. భార్యాభర్తల మధ్య క్షమాపణలు కాదు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం నాకు కలగాలంటే నీ మాటలతో కాదు నీ మనసులో నిరూపించు

అంటూ వెళ్లిపోతుంది. వెనకే రాహుల్‌ వెళ్తాడు. తర్వాత రాహుల్ దగ్గరకు రుద్రాణి వెళ్తుంది.

రుద్రాణి: వెళ్లి ఏంట్రా వాళ్లు అన్న మాటలకు అంతలా బాధపడుతున్నావా..? నువ్వు ఏదో తప్పు చేసినట్టు అంతలా కుమిలిపోతున్నావేంట్రా.?

రాహుల్‌: నేను చేసిన తప్పులు కుప్పలుగా పెరిగిపోయి నాకే భారంగా మారాయి మమ్మీ.. కనీసం ఏడ్చి అయినా ఆ భారాన్ని దించుకుందామనిపిస్తుంది

రుద్రాణి: సిగ్గు లేదురా ఆ మాట అనడానికి.. తప్పు చేసిన మగాడు ఏడవకూడదురా..? పంతం పట్టిన ఆడది పశ్చాతాప పడకూడదు. అందుకు బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ మీ మమ్మీయే.. అసలు నువ్వు ఏం తప్పు చేశావనిరా అంతలా బాధపడుతున్నావు.. తప్పు ఎవరైనా చేశారు అంటే ఈ ఇంట్లో వాళ్లు చేశారు. రేయ్‌ ఒక చోట తప్పు జరిగింది అంటే పరిస్థితులే కారణం అవుతాయి. పరిస్థితులు అంటే పై నుంచి ఏమైనా ఊడిపడతాయా..? పక్కనున్న మనుషులు పెట్టే పరీక్షలేరా పరిస్థితులు అంటే.. ఈ కుటుంబం అతా కలిసి నీకు పరీక్ష పెడుతూనే ఉన్నారు.. అయినా నువ్వు వాళ్ల ముందు నటిస్తున్నావేమో అనుకున్నాను.. కానీ నిజంగా మారిపోయావా..?

రాహుల్‌: ఇది నటన కాదు నిజంగానే నేను మారడానికి వాళ్లు నాకిచ్చిన మరో అవకాశం.. ఇప్పుడు కూడా నేను నీ మాట విని మారకపోతే ఈ కుటుంబానికే కాదు.. నా స్వప్నకు కూడా నేను తీరని అన్యాయం చేసిన వాడిని అవుతాను..

అంటూ రాహుల్‌ చెప్పడం రుద్రాణి తిట్టడం చాటు నుంచి స్వప్న వింటుంది.

రాహుల్‌: ఇక నన్ను మనిషిగా కాదు ఒక పురుగు కన్నా హీనంగా చూస్తారు. ఈ ఇంట్లోంచి శాశ్వతంగా గెంటేస్తారు…

రుద్రాణి: రేయ్‌ నీకు పిచ్చి పట్టిందిరా వాళ్లందరి మాటకు నీకు మతిపోయింది. అవన్నీ మాయ మాటలురా నమ్మొద్దు అడుక్కు తింటావు..

రాహుల్‌: జైళ్లో కూర్చుని చిప్ప కూడు తినే కంటే.. ఈ కుటుంబాన్ని నా భార్యను నమ్మి అడుక్కు తినడం ఎంతో గౌరవం మమ్మీ.. ఈ రోజు రాజ్‌, కావ్య కనక లేకపోయి ఉంటే.. నా గురించి కనక ఆలోచించకుండా ఉంటే చివరికి ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. నేను కూయిలీని చంపానని పోలీసులు నమ్మారు.. ఆధారాలు ఉన్నాయి.. ఇంట్లో వాళ్లు నమ్మారు.. చివరికి నా భార్య కూడా అదే నమ్మింది. కానీ రాజ్‌, కావ్యలు మాత్రం నమ్మలేదు.. అందుకే నేను తప్పు చేయలేదని సాక్ష్యాధారాలతో సహా నిరూపించి నన్ను ఈ కేసు నుంచి బయటకు తీసుకొచ్చారు.. అంతటితో ఆగకుండా ఇన్ని తప్పులు చేసిన నన్ను కూడా క్షమించి ఇంట్లోకి కూడా రానిచ్చారు.. ఇంత చేసిన వాళ్ల కోసం నా ప్రాణమైనా ఇచ్చేయాలనిపిస్తుంది మమ్మీ.. కానీ నువ్వు ఇంకా వాళ్లకు ద్రోహం చేయాలి అంటున్నావు.. తప్పు మమ్మీ తప్పు చేస్తున్నావు..

రాహుల్‌ మాటలకు స్వప్న కళ్లల్లో నీళ్లు వస్తాయి.

రుద్రాణి: రేయ్‌ ఇన్ని ఆలోచిస్తే బతకలేవురా..?

రాహుల్‌: నాకు సలహాలు ఇవ్వకు మమ్మీ

అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రాజ్‌ రూంలో కావ్య గురించి ఆలోచిస్తుంటే.. కావ్య వచ్చి తనకు చికెన్‌ మంచూరియా తినాలని ఉందని చెప్తుంది. దీంతో రాజ్‌ దొంగ చాటుగా కిచెన్‌లోకి వెళ్లి చికెన్‌ మంచూరియా చేస్తుంటే ప్రకాష్‌ చూసి దెయ్యం అనుకుని అందరిని నిద్ర లేపి కిచెన్‌లోకి తీసుకెళ్తాడు. అందరినీ చూసి రాజ్‌ షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
Brahmamudi Serial Today August 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
Illu Illalu Pillalu Serial Today August 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget