అన్వేషించండి

Brahmamudi Serial Today May 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  పెళ్లికి రెడీ అయిన ఇందు – ఇందును అనుమానించిన రేఖ

Brahmamudi serial today episode May 7th: మదన్‌తో తాను పెళ్లికి రెడీ అంటూ శారీ కట్టుకున్న ఇందును రేఖ అనుమానిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: మదన్‌ను తాను ప్రేమిస్తున్నానని కానీ మదన్‌కు నీకు పెళ్లి చేయబోతున్నారంటూ స్వాతి బాధపడుతుంటే మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది అంటూ ఇందు, స్వాతికి హామీ ఇస్తుంది. స్వాతి ధైర్యంగా సరే అక్క అంటూ వెళ్లిపోతుంది. మరోవైపు లక్కీ , రాజు దగ్గరకు వెళ్తాడు.

లక్కీ: ఒరేయ్‌ నేను ఒకటి అడుగుతాను చెప్తావా..?

రాజు: ఏంటో అడగరా

లక్కీ: మొన్న పది లక్షలు ఏం చేశావు చెప్పరా..? ఆ పది లక్షలు ఏం చేశావు

రాజు: నేను వేరే అవసరానికి వాడుకున్నాను

లక్కీ: ఏం అవసరంరా ఏ అవసరం ఉండి మొన్న పంజాగుట్ట హాస్పిటల్‌కు   వెళ్లావు.. అసలు హాస్పిటల్‌ లో ఎవరిని కలవడానికి వెళ్లావు.. నేను చిన్నప్పటి నుంచి నీతో కలిసి పెరిగాను. కలిసి తిరిగాను.. నీ జీవితంలో ఏ సీక్రెట్‌ లేవని నమ్మాను మామ కానీ నన్నే ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. ఐశ్వర్యకు ఆ పది లక్షలు ఇచ్చి నా లైఫ్‌ ను సెటిల్‌ చేసుకుందాం అనుకున్నాను.. కానీ నీ స్వార్థం నువ్వు చూసుకుంటావనుకోలేదు..

రాజు: స్వార్థమా…? చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరిగాను అన్నావు.. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది.

లక్కీ: అవున్రా నాకు అదే అర్థం అయింది. అసలు ఆ డబ్బులు నువ్వు ఎవరి కోసం ఖర్చు పెట్టావు.. చెప్పరా..?

రాజు: నేను చెప్పను

లక్కీ: నన్ను పరాయివాడిని చేస్తున్నావా..?

రాజు: నేనేం నిన్ను పరాయివాడిని చేయలేదు

లక్కీ: మరెందుకు రా నాతో దాస్తున్నావు.. సరే ఏ విషయం నాతో దాస్తున్నావో.. నీ గుండెల్లో మోస్తున్నావు నాకు తెలియడం లేదు కానీ ఆ పది లక్షలు ఐశ్వర్యకు ఇస్తే నా లైఫ్‌ సెట్‌ అవుతుందిరా దాని గురించి ఏం చేయాలో అది ఆలోచించు

అంటూ కోపంగా వెళ్లిపోతాడు లక్కీ. అప్పుడే రాజుకు ఇందు ఫోన్‌ చేసి రేపు తనకు పెళ్లి జరుగుతుందని చెప్తుంది. దీంతో రాజు షాక్ అవుతాడు. పెళ్లా..? పెళ్లి చూపలా..? అంటాడు. పెళ్లి చూపులు కాదు పెళ్లే జరుగుతుంది. కానీ నాకా పెళ్లి ఇష్టం లేదు. నువ్వే ఆ పెళ్లి ఆపాలి.. పెళ్లి ఆపేస్తే నీకు డబ్బులు ఇస్తాను అంటూ తన ప్లాన్ రాజుకు చెప్తుంది ఇందు. రాజు డబ్బుల కోసం సరే అంటాడు. మరోవైపు భ్రమరాంబ, శేషు కూడా మదన్‌, ఇందుల పెళ్లి ఆపేయాలని ప్లాన్ చేస్తారు. మరోవైపు రేఖ రూంలో భూషణ్‌ అనుమానంగా ఉంటాడు.

రేఖ: ఏమైంది భూషణ్‌ అలా ఉన్నావు..?

భూషణ్‌: మనం ఇన్ని రోజులుగా ఎన్నో ప్లాన్స్ వేశాం.. ఒక్కదాంట్లో సక్సెస్ కాలేదు. రేపు ఈ పెళ్లైనా సక్సెస్‌ అవుతుందా..? అని డౌటుగా ఉంది.

రేఖ: ఈ పెళ్లి విషయంలో మనం సక్సెస్‌ అవుతున్నాం.. పై నుంచి ఆ ఇందు అమ్మానాన్నలు వచ్చినా రేపు పెళ్లిని ఆపలేరు.. నువ్వేం టెన్షన్‌ పడకు

అంటూ రేఖ చాలా కాన్పిడెంట్‌గా చెప్తుంది. మరుసటి రోజు అందరికంటే ముందే స్వాతి రెడీ అయి వచ్చి హాల్లో నిలబడి ఉంటుంది. స్వాతిని చూసిన రేఖ నువ్వే పెళ్లి కూతురులా రెడీ అయ్యావు అసలైన పెళ్లి కూతురు ఎక్కడ..?

ఇందు: నేను రెడీ అయ్యాను ఆంటీ…

రేఖ: సరే అయితే అందరం కలిసి రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెల్దాం..  

ఇందు: ఆంటీ ఒకసారి గుడికి వెళ్లి గౌరి పూజ చేసి వస్తాను.

రేఖ: అవసరం లేదు.. ముందు పెళ్లి తర్వాతే నువ్వు ఎక్కడికైనా వెళ్లేది.

ఇందు: అది కాదు ఆంటీ.. పెళ్లికి ముందు అమ్మవారి పూజ చేయడం శుభప్రదం కదా..? ఫ్లీజ్‌ ఆంటీ.. పూజ చేసుకుని వెంటనే వస్తాను.

రేఖ: అయితే నువ్వు వదిన మాత్రమే వెళ్లండి.. వదిన ఇందును తీసుకుని గుడికి వెళ్లి పూజ చేయించుకుని తీసుకురా

అని చెప్పగానే.. భ్రమరాంబ సరే అంటూ ఇందును తీసుకుని గుడికి వెళ్తుంది. కారులో వెళ్తున్న ఇందుకు డ్రైవర్‌గా వచ్చిన రాజు సైగ చేస్తాడు. మధ్యలోకి వెళ్లాక ముఖానికి మాస్క్‌ పెట్టుకుని కత్తితో భ్రమరాంబను బెదిరించి ఇందును తీసుకుని వెల్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today NOV 9:అనసూయ పెళ్లి గురించి రాధ విక్కీకి చెబుతుంది. ఆనందంతో పొంగిపోయిన విక్రమ్‌కృష్ణ
నువ్వులేక నేను లేను: అనసూయ పెళ్లి గురించి రాధ విక్కీకి చెబుతుంది. ఆనందంతో పొంగిపోయిన విక్రమ్‌కృష్ణ
Gundeninda Gudigantalu Nov 9: సుమతి అరుణ్‌ను ప్రేమించడం తట్టుకోలేకపోయిన బాలు..తనపై కోపంతో మరదలని ట్రాప్‌ చేశాడని అనుమానం
గుండెనిండా గుడిగంటలు: సుమతి అరుణ్‌ను ప్రేమించడం తట్టుకోలేకపోయిన బాలు..తనపై కోపంతో మరదలని ట్రాప్‌ చేశాడని అనుమానం
Brahmamudi Serial Today November 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఫోటో కోసం గొడవ – రేఖకు రాజు వార్నింగ్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: ఫోటో కోసం గొడవ – రేఖకు రాజు వార్నింగ్‌
Illu Illalu Pillalu Serial Today November 9th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీ కోసం నర్మద, వేద గొడవ! రామరాజు కాళ్లు పట్టుకున్న భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీ కోసం నర్మద, వేద గొడవ! రామరాజు కాళ్లు పట్టుకున్న భాగ్యం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Embed widget