అన్వేషించండి

Brahmamudi Serial Today May 29th : ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : మాయ, రుద్రాణిలకు వార్నింగ్ ఇచ్చిన స్వప్న – కొత్తప్లాన్ తో అపర్ణను బోల్తా కొట్టించిన రుద్రాణి

Brahmamudi Today Episode : రుద్రాణి కొత్త ప్లాన్ వేసి కావ్యను అపర్థ దగ్గర ఇరికిస్తుంది. దీంతో స్వప్న రంగంలోకి దిగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode : రాజ్‌తో మాయ కాపురం జరిగేలాగా చేసి కావ్యను ఇంట్లోంచి వెళ్లగొట్టాలని రుద్రాణి అంటుంది. అయితే అప్పుడు రాజ్‌, మాయ ఇద్దరూ హాయిగా కాపురం చేసుకుంటూ వాడు ఆఫీసుకు వచ్చి మళ్లీ కింగ్‌ అయిపోతాడు అని రాహుల్‌ డౌట్‌ క్రియేట్‌ చేస్తాడు. దీంతో వాణ్ని ఎలా సంతోషంగా ఉండనిస్తాను మాయతో రోజురోజుకు వాడికి టార్చర్‌ పెట్టిస్తాను. దీంతో వాడు పిచ్చెక్కి పోతాడు అని రుద్రాణి చెప్పగానే రాహుల్‌ షాక్‌ అవుతాడు. నువ్వు నా తల్లివి అయిపోయావు కానీ లేదంటే నేను నీ కుట్రలకు తట్టుకోలేకపోయేవాణ్ని అంటాడు. మరోవైపు కావ్య, అప్పుకు ఫోన్‌ చేసి నువ్వు చెప్పిందే నిజమవుతుంది. మా అత్తయ్యా ఆ మాయను మా ఆయనకు ఇచ్చి పెళ్లి చేయబోతుంది అని చెప్తుంది. దీంతో మనం ఇప్పుడేం చేయాలో చెప్పు అని అప్పు అడుగుతుంది. నిజమైన మాయను కనిపెట్టాలని కావ్య చెప్తుంది. సరే అంటుంది అప్పు మరోవైపు అపర్ణ దగ్గరకు రుద్రాణి వెళ్తుంది.

రుద్రాణి: ఏంటి వదిన ఎవరి మీద కోపమో ఎవరి మీద చూపిస్తావేంటి? నాకు తెలుసు అందరూ నిన్ను తప్పు పట్టేసరికి నీకు అవమానంగా కూడా అనిపిస్తుంది. కావ్య విడాకుల విషయం ఎత్తితే ఇంటిల్లి పాది నీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక నువ్వు ప్రెస్టేషన్‌లో ఉన్నావు.

అపర్ణ: నా మనసును స్కాన్‌ చేసినట్టు బాగానే చెప్తున్నావు. అందరూ ఏకమై కావ్యకు సపోర్టు చేసినందుకు నేనేం బాధపడటం లేదు. వాళ్లన్నది కూడా నిజమే కదా? కానీ ఇప్పుడు జరగాల్సిన దాని గురించే ఆలోచిస్తున్నాను.

రుద్రాణి: జరగాల్సింది అంటే రాజ్‌కు మాయను ఇచ్చి పెళ్లి చేయడమే కదా?

అపర్ణ: అవును అంతకంటే పెద్ద సమస్య ఎం ఉంది.

రుద్రాణి: అందుకు కావ్య అడ్డుగా ఉంది.

అనగానే లేదని కావ్య  వాళ్ల కుటుంబ సభ్యులు మొత్తం నామీద పడతారేమోనని ఆలోచిస్తున్నాను అనగానే రుద్రాణి నా దగ్గర ఒక ప్లాన్‌ ఉంది. అది నచ్చితే చేయ్‌ లేకపోతే లేదు అంటూ నా భర్తకు వేరే అమ్మాయితో పెళ్లి జరిగినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కావ్య అగ్రిమెంట్‌ రాసిస్తే సరిపోతుంది కదా? అని రుద్రాణి చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు కావ్య బాబును ఆడిస్తూ ఉంటుంది. స్వప్న వచ్చి తిడుతుంది. బాబును తీసుకుని మాయ దగ్గరకు వెళ్తుంది. అసలు నువ్వు ఆడదానివేనా ఈ బిడ్డను నువ్వే కన్నావా? అని మాయను ప్రశ్నిస్తుంది. దీంతో మాయ, రుద్రాణి షాక్‌ అవుతారు. కని పారేయడం కాదే ఈరోజు నుంచి నీ బిడ్డను నువ్వే చూసుకో అని బాబుని మాయ చేతిలో పెట్టి వెళ్లిపోతుంది స్వప్న. మరోవైపు కావ్య ఒక్కతే రూంలోకి రావడంతో బాబు ఎక్కడని రాజ్‌ అడుగుతాడు. మా అక్క తీసుకెళ్లి మాయకు ఇచ్చిందని చెప్తుంది.

రాజ్‌: మరి నువ్వేం చేస్తున్నావు.

కావ్య: చూస్తూ ఊరుకున్నాను.

రాజ్‌: ఎందుకు వాడి బాధ తప్పిందనుకున్నావా? ఇక నుంచి ప్రశాంతంగా నిద్ర పోవచ్చనుకున్నావా? స్వప్న తీసుకెళ్తేంటే నువ్వెందుక చూస్తూ ఊరుకున్నావు..?

కావ్య: ఏవండి నేను ప్రశాంతంగా నిద్ర పోవడానికి వాడిని పంపించేశానా? ఏం మాట్లాడుతున్నారండి ఎలా కనిపిస్తున్నాను మీకు

రాజ్‌: ఆ మాయ నిజమైన మాయ కాదని నీకు తెలియదా?

కావ్య: చూడండి నేనేమీ కావాలని  చేయలేదు. మా అక్కకు ఆ మాయ కన్నతల్లి కాదని తెలియదు కదా

అంటూ ఇద్దరూ బాబు గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో కోపంగా మీ గోల నేను భరించలేకుండా ఉన్నాను వెళ్లి తీసుకురండి అని కావ్య చెప్పగానే సరే వెళ్తాను అని రాజ్‌ వెళ్లబోతుంటే కావ్య ఆపి ఇప్పుడు మీరు దాని రూంలోకి వెళితే అందరూ ఇంకోలా అర్థం చేసుకుంటారని కావ్య చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు - నన్ను ఇన్‌స్పరేషన్‌గా తీసుకోవద్దని చెప్పా...

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
Nindu Manasulu Serial Today October 14th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Embed widget