అన్వేషించండి

Brahmamudi Serial Today May 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కళ్యాణ్‌కు సారీ చెప్పిన అప్పు – కొత్త ప్లాన్‌ వేసిన రుద్రాణి

Brahmamudi Today Episode: రుద్రాణి కొత్త ప్లాన్‌ వేసి రాజ్‌, కావ్య శాశ్వతంగా విడిపోయేలా చేయాలనుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: కావ్యను ఇంప్రెస్ చేయడానికి రాజ్‌ వివిధ రకాలుగా డ్రెస్‌ మార్చుకుంటుంటే అప్పుడే అపర్ణ ఫోన్ చేస్తుంది. రేపటి గురించి ఏమైనా ఆలోచించావా అని అడుగుతుంది. సూపర్ డ్రెస్‌ తో వస్తానని రాజ్‌ చెప్పగానే.. అపర్ణ కోప్పడుతుంది.

అపర్ణ: నేను అడిగింది డ్రెస్‌ గురించి కాదు.. నీ ఐడియా గురించి.. ఎందుకంటే కళావతి మనసును నువ్వు ఎప్పుడో గెలుచుకున్నావు. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ ఇప్పుడు తన మనసులో ఉన్న మాటను బయటకు తీసుకురావాలి.  అంటే తనకు సంబధించింది ఏదైనా నువ్వు ట్రై చేయాలి కదా..!

రాజ్‌:   అవును కదా ఆ విషయమే మర్చిపోయాను అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు..?

అపర్ణ: ఖర్మ ఇది కూడా నేనే చెప్పాలా..? ఆడదాని మనసు గెలుచుకోవాలి అంటే ఏ పువ్వో, చీరో గిఫ్టుగా ఇవ్వాలి. అప్పుడు సంతోషపడుతుంది

రాజ్‌: అర్థమైంది అమ్మా.. ఇక చూడండి ఎలా రెచ్చిపోతానో.. రేపు తనకు ఇష్టమైన గిఫ్టు పట్టుకొస్తా.. తన మనసు గెలుచుకుంటాను. తన మనసులో మాటలను బయటకు తీసుకొస్తాను..

అపర్ణ: అది చేస్తాను ఇది చేస్తాను అని కోతలు కోయడం కాదు. రేపు అది నిజం కూడా చేయాలి

రాజ్‌: నేను హనుమంతుడి టైపు అమ్మా.. నా శక్తి నాకు తెలియదు.. ఇలా నువ్వు పక్కన ఉండి ఎంకరేజ్ చేస్తా ఉండు.. ఇక నేను ఏంటో కళావతికి అర్థం అయ్యేలా చేస్తాను.. అయినా రేపు మీరే చూస్తారు కదా..?

ఫోన్‌ కట్ చేస్తాడు.

అపర్ణ: వీడు గతం మర్చిపోయాక నా మాట వింటున్నాడు. ముందే నా మాట విని ఉంటే ఈ పాటికి నాకు మనవడో మనవరాలో పుట్టేవాళ్లు..

అనుకుంటుంది. కళ్యాణ్‌, అప్పు విషయంలో ధాన్యలక్ష్మీ వెళ్లి ప్రకాష్‌ను తిడుతుంది. ప్రకాష్‌ కూడా ధాన్యలక్ష్మీని తిడతాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. మరోవైపు రాజ్‌ ఎవరికో ఫోన్‌ చేసి రెడ్‌ రోజ్‌ బొకే ఆర్డర్‌ చేస్తుంటాడు. ఇంతలో యామిని వస్తుంది.

యామిని: ఏంటి బావా ఏదైనా పార్టీకి వెళ్తున్నావా..?

రాజ్‌: లేదే ఎందుకు అలా అడిగావు

యామిని: ఇంత స్టైల్‌గా రెడీ అయి ఉంటే డౌటు వచ్చింది

రాజ్‌:  స్టైల్ గా ఉంది కదా అందుకే ఈ డ్రెస్‌ సెలెక్ట్‌ చేసుకున్నాను

యామిని: అదే ఎందుకు అని అడుగుతున్నాను… ఆ  నా గుర్తుకు వచ్చింది బావ రేపు మనం ఇద్దరం వెళ్లి మన రిలేటివ్స్‌ కు మన పెళ్లి పత్రికలు ఇవ్వాలనుకున్నాం కదా అందుకోసం ఇలా రెడీ అయి ట్రై చేస్తున్నావు కదా..?

రాజ్‌: ట్రై చేయడం నిజమే కానీ నువ్వు అనుకుంటున్నట్టు మన రిలేటివ్స్‌ దగ్గరకు వెళ్లడానికి కాదు. నాకు వేరే మీటింగ్‌ ఉంది.

యామిని:  మీటింగా..?

రాజ్‌: మీటింగ్‌ అంటే ఆఫీసుకు వెళ్లి స్టాఫ్‌ ను కలవడం కాదు.. నేను వేరే ఒక ఇంపార్టెంట్‌ వ్యక్తిని కలవాలి

యామిని: సరే బావ రేపు మనం వస్తున్నామని మన రిలేటివ్స్‌ అందరికీ చెప్పేశాను.

రాజ్‌:  సారీ యామిని రేపు నీతో టైం అసలు స్పెండ్‌ చేయలేను

అని చెప్పి వెళ్లిపోతాడు. మరవైపు కళ్యాణ్‌, అప్పుకు భోజనం తీసుకెళ్లి తినిపిస్తాడు. దీంతో అప్పు సారీ చెప్తుంది. ఇంత ఓపిక నీకెలా వచ్చిందని ఎమోషనల్‌ అవుతుంది. మా వాళ్లే నన్ను భరించలేకపోయారు. నువ్వెలా భరిస్తున్నావని బాధపడుతుంది. మరోవైపు రుద్రాణికి యామిని ఫోన్‌ చేసి కావ్య ఏం ప్లాన్‌ చేస్తుందని అడుగుతుంది. ఈసారి ప్లాన్ చేసింది కావ్య కాదని మా వదిన అని చెప్తుంది రుద్రాణి. అయితే రేపు రాజ్‌ ఇంటికొచ్చే సమయానికి కావ్య ఇంట్లో లేకుండా చేస్తానని తన ప్లాన్‌ చెప్తుంది రుద్రాణి. మరుసటి రోజు అప్పు ఆఫీసుకు వెళ్తుంటే.. ధాన్యలక్ష్మీ కోపంగా వచ్చి ఏయ్‌ ఆగు అంటూ తిడుతుంది. ఆప్పు షాకింగ్‌ గా ఆగిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 5: రాగిణిని బెదిరించి సాక్ష్యాలు తీసుకోవాలని యువరాజు ప్రయత్నం..నిషికకు గట్టిగా బుద్ధి చెప్పిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: రాగిణిని బెదిరించి సాక్ష్యాలు తీసుకోవాలని యువరాజు ప్రయత్నం..నిషికకు గట్టిగా బుద్ధి చెప్పిన ధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌ని ఇంటికి తీసుకొచ్చిన విహారి! మహాకి మరో బాధ్యత!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌ని ఇంటికి తీసుకొచ్చిన విహారి! మహాకి మరో బాధ్యత!
Godavari Serial Today October 5th: 'గోదావరి' సీరియల్: జానుకి పెళ్లైపోయిందని తెలిసి గుండె పగిలేలా ఏడ్చిన సూర్య! నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయిన జాను!
'గోదావరి' సీరియల్: జానుకి పెళ్లైపోయిందని తెలిసి గుండె పగిలేలా ఏడ్చిన సూర్య! నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయిన జాను!
Nindu Manasulu Serial Today October 5th: నిండు మనసులు: ప్రేరణతో కలిసిపోవడం తనకి ఇష్టమే అని చెప్పేసిన సిద్ధూ! విజయానంద్ మంట పెడతాడా!
నిండు మనసులు: ప్రేరణతో కలిసిపోవడం తనకి ఇష్టమే అని చెప్పేసిన సిద్ధూ! విజయానంద్ మంట పెడతాడా!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget